అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని దారుణంగా బాధ పెట్టిన ధీరజ్! మందు తాగొచ్చిన చందు తండ్రికి నిజం చెప్పేస్తాడా!

Illu Illalu Pillalu Serial Today Episode April 6th శ్రీవల్లి గురించి నిజం చెప్పేస్తానంటూ చందు మందు తాగి తండ్రిని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ ధీరజ్‌తో తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్‌రా.. అమూల్య విషయంలో నాకు ఏ పాపం తెలీదు.. ఇది నా కుటుంబం.. ప్రాణం పోయినా నా కుటుంబానికి అన్యాయం చేయనురా.. అన్నింటికంటే ముఖ్యంగా నీ మీద నాకు ఉన్నది స్వచ్ఛమైన ప్రేమరా అని ప్రేమ చెప్తుంది. ఆపుతావా నీ డ్రామాలు నన్ను మోసం చేసింది చాలు కన్నీరు పెట్టి మళ్లీ డ్రామాలు మొదలు పెట్టకు అని ధీరజ్ అంటాడు. 

ప్రేమ చాలా బాధ పడుతూ నీకు నా మీద ప్రేమ మొదలవ్వడానికంటే ముందు నేను నిన్ను ప్రేమించాను.. కానీ నా ప్రేమని ఊహల్లోనూ కలల్లోనూ తప్ప డైరెక్ట్‌గా చెప్పలేకపోయాను.. కానీ నువ్వు నాకు ప్రపోజ్ చేసిన తర్వాత నా ప్రేమ చెప్పకుండా ఉండలేకపోయాను.. కానీ నా దురదృష్టం ఏంటి అంటే నా ప్రేమ చెప్పే టైంకి ఈ గొడవ మొదలైంది.. అందుకే ప్రేమకి ప్రతిరూపం అయిన ఈ పావురాలను ఇచ్చి ఐలవ్యూ ధీరజ్ అని చెప్పాలని వచ్చాను అని పావురాల బొమ్మని అందిస్తుంది. ధీరజ్ దాన్ని తీసుకొని విసిరేస్తాడు. ఆ పావురం గొప్పతనం ఏంటో తెలుసా నీకు ప్రేమించిన పావురం కోసం ప్రాణం ఇస్తుంది.. ఒకటి చనిపోతే మరొకటి కూడా చనిపోతుంది. అది దాని గొప్పతనం నీకు దాన్ని ముట్టుకునే అర్హత కూడా లేదు అని అంటాడు.

ప్రేమ కింద పడిపోయిన పావురాల బొమ్మని పట్టుకొని ఏడుస్తుంది. పెంకులు ప్రేమకి గుచ్చుకోవడంతో ధీరజ్ చూసి మనసులో నీకు రక్తం రావడం చూసి నాకు బాధగా ఉంది కానీ నువ్వు చేసిన మోసం చూసి నా మనసు బండరాయిలా మారిపోయింది అనుకుంటాడు. ఇంతలో నర్మద వచ్చి చూసి కంగారుగా ప్రేమకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. తర్వాత ధీరజ్  దగ్గరకు వెళ్లి నువ్వు అసలు మనిషిలా ప్రవర్తిస్తున్నావా.. భార్యతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా.. అని నిలదీస్తుంది. అంతే వదినా ముంచేవాళ్లంతా నీకు మంచోళ్లలాగా.. మంచోళ్లు అంతా ముంచేవాళ్లలా కనిపిస్తారు అని అంటాడు. నిజం తెలిసిన రోజు పశ్చాత్తాపపడతావ్ తెలుసుకో అని నర్మద అంటుంది. ప్రేమని బాధ పడొద్దని ఓదార్చుతుంది. వల్లీ చేసిన తప్పునకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావ్ చాలా బాధగా ఉంది ప్రేమ అని అంటుంది.

వల్లీ కోపంగా జరిగింది తలచుకొని ఆలోచిస్తూ ఉంటే భాగ్యం, ఇడ్లీబాబాయ్ బజ్జీలు తింటూ డ్యాన్స్‌లు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఒకర్ని ఒకరు తినిపించుకోవడం చూసి వల్లీ చీపురు పట్టుకొని వెళ్తుంది. కన్నకూతురి కాపురం కూలిపోయింది అన్న భయం, బాధ లేకుండా బజ్జీలు వేసుకొని తింటారా అని ఇద్దరినీ చితక్కొట్టేస్తుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ వచ్చి నిన్ను బతిమాలి తీసుకెళ్లేలా చేస్తా చూస్తూ ఉండు అని భాగ్యం కూతురితో చెప్తుంది. 

చందు మందు తాగి ఇంటికి వస్తూ మా నాన్నకి నేను అంటే కొడుకునే కాదు.. నమ్మకాన్ని.. శ్రీవల్లి చేసిన మోసాన్ని నాన్నకి చెప్తేస్తా అని అనుకుంటూ ఇంటికి వస్తాడు. నర్మద, ప్రేమ, అమూల్య అందరూ వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడకండి రేపు మాట్లాడొచ్చు అంటే లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి అని చందు అంటాడు. సాగర్ పట్టుకోవడంతో నువ్వు నాన్నని మోసం చేశావ్.. నాన్నని మోసం చేసిన వాళ్లకి నన్ను ముట్టుకునే అర్హత లేదు నన్ను ముట్టుకోకు అని అంటాడు. నాన్న నాన్న అని పిలుస్తాడు. రామరాజు బయటకు వస్తాడు. ఏమైందని అడిగితే తిరుపతి తాగినట్లు నటించి నేను తాగుతూ బండి పడేశా అంటాడు. ఇక చందు నాన్న నేను బండి పడేశా.. నీకు వల్లీ గురించి ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. నర్మద, ప్రేమ ఆపాలని చూస్తారు. నువ్వు తాగేసి వచ్చావారా అని రామరాజు అడుగుతాడు. 

నన్ను క్షమించండి నాన్న  అని చందు అంటాడు. నేను తాగి రావడానికి కారణం అదే అని అంటాడు. నువ్వు తాగి రావడానికి వల్లీ కారణమా అని రామరాజు నోరెళ్ల బెడతాడు. వల్లీ చేసిన మోసం తట్టుకోలేరు.. గుండె గట్టిగా పట్టుకోండి అని అంటాడు. ఏమైందిరా అని రామరాజు అడిగితే నర్మద, ప్రేమలు వచ్చి వల్లీ అక్క ఇంటికి వెళ్లి మీకు కాల్ చేయకపోవడంతో మీకు మర్యాద ఇవ్వలేదు అని ఇలా మాట్లాడుతున్నారని కవర్ చేస్తారు. సాగర్ చప్పట్లు కొడుతూ చూశావా.. నర్మద రామరాజు గారికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయి.. ఏం కనిపించడం లేదు.. అదే స్థానంలో నేను ఉంటే ఏరా తాగి వచ్చావా.. నా పరువు తీశావా అని నా గూబ పగల గొట్టేసి నా మెడ పట్టుకొని గెంటేసే వాళ్లు మీరు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 6th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
Gundeninda Gudigantalu August 6th:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌
Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు వార్నింగ్‌ ఇచ్చిన వెంకీ – రేఖకు కోపం తెప్పించిన లక్కీ  
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు వార్నింగ్‌ ఇచ్చిన వెంకీ – రేఖకు కోపం తెప్పించిన లక్కీ  
Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget