అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: రామరాజు ఆస్తి ముక్కలైపోతుందా! వాటా అడగమని సాగర్‌ని రెచ్చగొట్టిందెవరు?

Illu Illalu Pillalu Serial Today Episode April 29th నర్మద నగలు విడిపించడానికి రామరాజు ఆస్తిలో వాటా అడగమని ప్రసాద్ సాగర్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు భార్యతో మన ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం ఇంటి ఆడపడుచుగా తనతో అక్షింతలు వేయిస్తే మంచిది అని అంటాడు. అంటే అన్నాను అంటారు కానీ మీకు మీ పెద్ద కూతురు అంటే ఇష్టమని మరోసారి నిరూపించుకున్నారు అంటుంది. ఇంతో కాస్త దూరంలో కామాక్షి ఏడుస్తూ కనిపిస్తుంది. అందరూ కామాక్షి దగ్గరకు వెళ్తారు. శుభమా అని ఫంక్షన్‌ జరుగుతుంటే నీ ఏడుపు ఏంటే అని వేదవతి తిడుతుంది. ఈ ఇంట్లో నా పరువు అప్పడం కంటే తేలికైపోయింది అని ఏడుస్తుంది. ఇది మళ్లీ దేనికో టెండర్ పెట్టిందని వేదవతి అంటుంది. ఏమైందని రామరాజు అడిగితే కూతురికి తులమో ఫలమో పెట్టాలని లేదా అని అంటుంది. 

రామరాజు కామాక్షితో పెద్దమ్మాయ్ నువ్వు అడక్కుండానే ఇవ్వాలి అనుకున్నాను నువ్వే ఏడుస్తున్నావ్ అని మెడలో గొలుసు తీసుకొని ఇస్తాడు. భలే ప్లాన్  చేశావ్ వదినా.. ఏది ఏమైనా నీకు నటిగా మంచి భవిష్యత్ ఉందని నర్మద, ప్రేమ అంటారు. వల్లీని వేదవతి తల్లి దీవించి నీ ద్వారా నా కూతురు మొదటి సారి నానమ్మ కాబోతుంది.. నీ కడుపున వాళ్ల నాన్న పుట్టాలమ్మా అని అంటుంది.  అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో వల్లీ తండ్రి ఒక్క నిమిషం చూడండి బావగారు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను.. మూత పెట్టిన ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు ఉన్నాయని మనం చాలా ఆశపడతాం.. తీరా మూత తీస్తే ఇడ్లీలు లేవని తెలిశాకా చాలా నిరాశపడతాం.. బాధ పడతాం.. అవునా కాదా  అంటాడు. సమయం సందర్భం లేకుండా ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు బావ గారు అని రామరాజు అడిగితే ఇడ్లీ తినాలి అనుకున్నారు దాని గురించి అంటున్నారు అని భాగ్యం కవర్ చేస్తుంది. నర్మద తల్లిదండ్రులు వల్లీకి దీవిస్తారు. తర్వాత ప్రసాద్ రావు సాగర్‌ని పక్కకి తీసుకెళ్తాడు. 

నర్మద నగలు విడిపించేశావా అని అడుగుతాడు. పెద్ద అమౌంట్ కదా మామయ్య గారు కాస్త లేట్ అవుతుంది అని అంటాడు సాగర్. మీ నాన్నకి అడుగు అని ప్రసాద్ రావు తండ్రి అంటే నేను ఉద్యగం కొనుకున్నా అని ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఇంకా డబ్బులు ఏం ఇస్తారు అని సాగర్ అంటే అయితే ఆస్తిలో నీ వాటా అడుగు అని ప్రసాద్రావు సాగర్‌కి చెప్తాడు. సాగర్ షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య ఆస్తిలో నా వాటా నేను అడగటం ఏంటి అని అంటాడు. నువ్వు జీవితం మొత్తం కష్టపడినా 20 లక్షలు కట్టడం కష్టం నువ్వు అడిగినా మీ నాన్న ఇవ్వడు.. అందుకే తాకట్టు పెట్టిన నా కూతురి నగలు విడిపించడానికి నీకు ఉన్న ఒక్క మార్గం నీ వాటా అని అంటాడు. ఇంతలో నర్మద వచ్చి అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ మీరు ఇంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. సాగర్ తడబడుతూ ఏం లేదు మామూలుగా మాట్లాడుకుంటున్నాం అని చెప్తాడు.

వేదవతి, రామరాజు వల్లీని దీవించి పండంటి మగ పిల్లాడిని కనాలి అని వేదవతి అంటే లేదమ్మా ఆడపిల్లనే కనాలి అని రామరాజు అంటాడు. వేదవతి, రామరాజులు మగ పిల్లాడే ఆడపిల్లే అని వాదించుకుంటారు. లేని కడుపు కోసం ఇద్దరూ కొట్టేసుకుంటున్నారు అని ఇడ్లీబాబాయ్ భాగ్యానికి చెప్తాడు. ఇడ్లీబాబాయ్ చాలా టెన్షన్ పడతాడు. ఈ టెన్షన్ నా వల్ల కాదు మందు కొట్టేసి అందరి మందు వల్లీ కడుపు అబద్ధం అని చెప్పేయాలి అనుకుంటాడు. ప్రేమ ధీరజ్‌తో ఒరేయ్ మీ బావ ఇక్కడే ఉన్నాడు కదా సాక్షి సంతకం పెట్టమని చెప్పరా అంటే మా అక్కకి తెలిస్తే మామూలుగా ఉండదు వద్దు అనేస్తాడు. నేనే అడుగుగా అని ప్రేమ వెళ్తుంది. వెనకాలే ధీరజ్ కూడా వెళ్తాడు. అన్నయ్యా ఒకరి దగ్గర జాబ్ చేయకుండా సొంతంగా ట్రావెల్స్ పెట్టాలి అన్నది ధీరజ్ పట్టుదల.. మీకు ఏం ఇబ్బంది లేకపోతే ఫైనాన్స్ కోసం సంతకం పెట్టగలరా అని ప్రేమ అడుగుతుంది. భాస్కర్ సరే అని ఈ విషయం గురించి నేనే మాట్లాడాలి అనుకున్నా మీ అక్కకి తెలీకుండా నేనే చూసుకుంటా సంతకం పెడతా డాక్కుమెంట్స్ ఇవ్వు అని అంటాడు. 

భాగ్యం చాటుగా ఆ మాటలు వినేస్తుంది. కాసేపు మీ అక్కని మ్యానేజ్ చేయండి అని అంటాడు. ఇంతలో తిరుపతి వచ్చి జోష్‌ కావాలి అనడంతో అందరూ కలిసి ఇట్స్‌ఏ ఫ్యామిలీ పార్టీ అని చిందులు వేస్తారు. ఇడ్లీబాబాయ్ నిజం చెప్పాలి అనుకుంటే భాగ్యం ఆపుతుంది. తర్వాత ఇడ్లీబాబాయ్ తిరుపతి దగ్గరకు వెళ్లి మందు తాగుదాం అని అంటాడు. తిరుపతి మందు ఏర్పాటు చేయడంతో ఇడ్లీబాబాయ్ ఫుల్లుగా తాగుతాడు. మరోవైపు ప్రేమ ధీరజ్‌తో ఇప్పుడే వెళ్లి సంతకం పెట్టించు అని చెప్పడంతో ధీరజ్ భాస్కర్‌ని తీసుకెళ్తాడు. ఇక ఫుల్లుగా తాగేసిన ఇడ్లీబాబాయ్ రామరాజు వాళ్ల దగ్గరకు వచ్చి ఆపండి..,. ఇంక దాచుకోవడం నా వల్ల కాదు అందరికీ ఓ ముఖ్య మైన విషయం చెప్పాలి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget