అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: చందుని వశీకరణ చేసుకోవడానికి వల్లీ ప్లాన్! సూసైడ్ అంటూ ధీరజ్‌ని ఆటపట్టించిన ప్రేమ!

Illu Illalu Pillalu Serial Today Episode April 20th ఎస్‌ఐ పరీక్ష ఫెయిల్ అయినందుకు ధీరజ్ తిడతాడు అని ప్రేమ నాటకం ఆడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు తిరుపతితో టీ అయిందో లేదో కనుక్కో అని పంపిస్తాడు. తిరుపతి ప్రేమకి టీ అయిందో లేదో అని అడగటానికి వెళ్తూ ప్రణతి.. ప్రణతి అంటూ పాట పాడుతూ సైగలు చేస్తే ప్రేమ కూడా పాట కంటిన్యూ చేస్తూ సమాధానం చెప్తుంది. ఇద్దరూ పాట పాడుతూ టీ చేసి గ్లాస్‌లో పెట్టి తీసుకెళ్తారు. 

రామరాజు టీ తాగుతూ పాటలు పాడిన తిరుపతికి ఒక్కటిస్తాడు. ఇంతలో ధీరజ్ ప్రేమకి కాల్ చేసి ఎస్‌ఐ ఎగ్జామ్ ఎలా రాశావే అంటే సూపర్.. డూపర్ అని అంటుంది. ఆపవే ఎగ్జామ్ దొబ్బింది అని ధీరజ్ తిడతాడు. ప్రస్తుతం మీరు కాల్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నారు అని అంటుంది. రామరాజు ఎవరమ్మా పోలీస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అని అడిగితే అదో ఓటీటీ సినిమా మామయ్య అని ప్రేమ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం, ఇడ్లీబాబాయ్, వల్లీ గుడిలో ఓ బాబాని కలుస్తారు.

తమ బాధలకు దారి చూపించమని భాగ్యం అంటే ఆ బాబా బాత్రూంకి దారి చూపిస్తాడు. విషయం అది కాదు అని తమ కూతురి చుట్టూ అల్లుడు తిరిగేలా వశీకరణ చేయాలని అంటారు. బాబా సమస్య ఏంటి అని అడిగితే నువ్వు చెప్పాలి మేం చెప్తే నువ్వు ఎందుకు వీడు కూడా మనలా పెద్ద మడత పెట్టే బ్యాచ్ గాడు అని అంటుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వల్లీని ఒప్పించి విషయం మొత్తం చెప్తే  ఓ నీ అల్లుడు పెద్ద తాగుబోతు.. రోజు పెళ్లాన్ని కొట్టి హింసిస్తాడు.. పట్టించుకోడు కదా అని రివర్స్‌లో అర్థం చేసుకుంటాడు. దాంతో వల్లీ బాబాని తిడుతుంది. 

ఇడ్లీబాబాయ్ తన సమస్య మళ్లీ చెప్తాను అని అంటే అవసరం లేదు మీ దరిద్రం ఒక్కసారి వినడమే ఎక్కువ మీకు ఇప్పుడు మీ అల్లుడు మీ కూతురి వెనకాలే తిరగాలి అంటే కదా అందుకు తాయొత్తు ఇవ్వాలి కదా అంటాడు. తర్వాత తాయొత్తు ఇచ్చి ఇది మీ అల్లుడికి కడితే నీ కూతురి వెనక కుక్క పిల్లలా తిరుగుతాడు అని చెప్తాడు. ప్రేమ బయట ఆరేసిన బట్టలు వెనక ముఖం పెట్టి రోడ్డు వైపు తొంగి తొంగి చూస్తుంటుంది. ఇంతలో నర్మద చూసి వెళ్తుంది. ప్రేమ చాలా భయపడటం చూసి ఏమైంది ప్రేమ ఎందుకు అంత భయపడుతున్నావ్ అంటే .. ధీరజ్ వస్తున్నాడు అక్క ధీరజ్ నన్ను కొడతాడు అంటే ఎందుకు అని నర్మద అంటుంది. తప్పాను అక్కా అని ప్రేమ అంటే ప్రేమ నెల తప్పిందని నర్మద చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అంత సీన్ మా మధ్య జరగలేదులే అక్క అని ఎస్‌ ఐ పరీక్ష తప్పినట్లు చెప్తుంది. సర్లే ధీరజ్‌తో నేను మాట్లాడుతా,.. ముందు బట్టలు తీయ్ నేను మరో తాడు తీసుకొస్తా అని నర్మద వెళ్తుంది. 

ప్రేమ  తెగిపోయిన తాడు లాగుతూ ఉంటే ధీరజ్ చూసి ప్రేమ పరీక్ష ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకుంటుందేమో అని హడావుడిగా వెళ్లి ఒక పరీక్ష కాకపోతే మరొకటి.. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావ్ అని అనుకుంటాడు. వీడికి ఇలా అర్థమైందా అయితే తెగ నటించేద్దాం అని ప్రేమ అనుకుంటూ ఏడుస్తున్నట్లు నటించి నువ్వు నన్ను తీసుకెళ్లావురా.. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పొగొట్టేశాను.. ఇక నేను నా ముఖం నీకు చూపించలేనురా.. నువ్వే నీ చేతులతో నన్ను పైకి పంపించరా అని అంటుంది. పరీక్ష ఫెయిల్ అయితే నేను నిన్ను ఏమైనా అంటే కదా నువ్వు ఫీలవ్వడానికి.. నువ్వు నా బంగారం ఇలాంటి చిన్ని విషయాలకే కోపం రాదులే అని ధీరజ్ అంటాడు. ఎంత అర్థం చేసుకుంటున్నావ్‌రా లవ్‌యూ రా ధీరజ్ లవ్‌యూ సో మచ్ అని ప్రేమ ధీరజ్‌ని వాటేసుకుంటుంది.

ఇంతలో నర్మద వచ్చి ప్రేమ ఇదిగో మరో తాడు తీసుకొచ్చా ఇది అస్సలు తెగిపోదు.. స్ట్రాంగ్ తాడు అని అంటుంది. ఏంటి వదినా ఇది తప్పు అని చెప్పి అడ్డుకోవాల్సిన మీరే ఇలా చేయడం ఏంటి.. ఎక్కడైనా చెల్లి చనిపోవడానికి అక్క తాడు తీసుకొస్తుందా అని అడుగుతాడు. ఏంటి ధీరజ్ నువ్వేం మాట్లాడుతున్నావ్.. బట్టలు ఆరేసిన తాడు తెగిపోతే తాడు తీసుకొచ్చా చనిపోవడం అంటావేంటి అర్థం లేకుండా అని నర్మద అంటుంది. ఇదా విషయం అని ధీరజ్ అంటే ప్రేమ బుంగముఖం పెడుతుంది. నాతోనే ఆడుకుంటావా అని ధీరజ్‌ని తరుముతాడు. ప్రేమ తనని కాపాడమని నర్మద వెనక అమూల్య  వెనక పరుగులు పెడుతుంది. సాగర్ చిరాకుగా ఉంటే ఏమైందని నర్మద అడుగుతుంది. అన్నం తిందువు పదా అంటే సాగర్ చిరాకు పడతాడు. దేని మీద కోపం నా మీద చూపిస్తావేంటి సాగర్ నువ్వు అని నర్మద అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget