అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద కన్నీరు పెట్టుకోవడానికి కారణమేంటి? వల్లీని చచ్చిపోమన్న చందు!

Illu Illalu Pillalu Serial Today Episode April 16th వల్లీ చందుకి కాల్ చేయడం చందు వల్లీని దారుణంగా తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద సాగర్‌కి ఇంటి నుంచి రావాలి అంటే ఉద్యోగం మానేయాలి అని కండీషన్ పెడుతుంది. నువ్వు జాబ్ వదిలేస్తే ఈ క్షణమే నీతో పాటు ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తా అని నర్మద చెప్తుంది. నేను జాబ్ వదిలేయను అది జరగని పని అని సాగర్ చెప్తాడు. అయితే నేను ఇంట్లో నుంచి బయటకు రాను ఇది కూడా జరగని పని అని అంటుంది. నోరు మూసుకొని రా అని సాగర్ అంటే మనం ఇంట్లో నుంచి వెళ్లిపోతే మీ అమ్మానాన్న ఎంత బాధ పడతారో ఒక్కసారి ఆలోచించు.. ఊరు వెళ్లిన మీ అమ్మ బాధ పడాలా.. గొడవ పడిన ప్రతీ సారీ ఇంట్లో నుంచి వెళ్లిపోతా అనడం కరెక్ట్ కాదు.. బుద్ధి పెట్టి ఆలోచించు అని నర్మద చెప్తే మా అమ్మ వచ్చిన వెంటనే చెప్పేసి వెళ్లిపోతా అని సాగర్ అంటాడు. 

నర్మద కాపురం తగలెట్టేశామ్ అంటూ వల్లీ, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ డ్యాన్స్‌లు చేస్తారు. నర్మద తెగ ఓవర్ చేసింది.. నా కూతురితో కాళ్లు పట్టించుకునేదే కాక.. నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వను అంటావా.. ఇప్పుడు ఆ నర్మదనే ఇంట్లో నుంచి పంపేలా చేశా అని భాగ్యం మురిసిపోతుంది. కాపురాలు కూల్చడంతో నీకు ఎవరూ సాటి రారు అని భాగ్యాన్ని భర్త పొగిడేస్తాడు. రెండు మూడు రోజుల్లో నిన్ను మీ అత్తారింట్లో అడుగు పెట్టేలా చేస్తానని భాగ్యం అంటుంది. ఏడుస్తున్న నర్మద ముఖచిత్రాన్ని నా కల్లారా చూడాలని ఉందే అమ్మా అని వల్లీ అంటుంది. 

నర్మద ఆరు బయట కూర్చొని చాలా బాధ పడుతుంది. ప్రేమ వచ్చి బాధ పడొద్దు అక్కా అని అంటే ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతాం అని అంటే బాధ పడకుండా ఎలా ఉంటాను ప్రేమ.. సాగర్ వెళ్లిపోదాం అంటే ఏదో ఒకటి చెప్పా కానీ అత్తయ్యా వచ్చిన మరుక్షణమే వెళ్లిపోతా అంటున్నాడు.. సాగర్ అలాంటి పరిస్థితి తీసుకొచ్చేలా ఉన్నాడు అని అంటుంది. అందరం ఉన్నాం కదా అక్క అంత వరకు వస్తే ఊరుకుంటామా అని ప్రేమ అంటే సాగర్ వినేలా లేడు ప్రేమ అని నర్మద బాధపడుతుంది. అత్త వచ్చే బావకి నచ్చచెప్తుంది నువ్వేం బాధ పడకు అని ప్రేమ అంటుంది. సాగర్ తండ్రి బట్టలు కాల్చేయడం గుర్తు చేసుకొని బాధ పడుతుంటే ధీరజ్ ప్రేమ గురించి ఆలోచించి బాధ పడతాడు. రామరాజు కూడా సాగర్‌ని గుర్తు చేసుకొని బాధ పడతాడు. ఇక చందు అయితే భార్య చేసిన మోసాన్ని తలచుకొని బాధ పడతాడు. 

వల్లీ ఫోన్ చూసి బావకి ఎప్పుడో మెసేజ్ చేసినా పట్టించుకోవడం లేదు అంటే నన్ను మర్చిపోతాడేమో.. పూర్తిగా వదిలేస్తాడేమో.. బావ వదిలేస్తే నేను బతకలేను.. మా అమ్మని నమ్ముకుంటే ఇప్పట్లో వెళ్లేలా లేను.. నేను బావని కూల్ చేసేయాలి అని అనుకుంటుంది. వెంటనే చందుకి రాత్రి వేళలో ఫోన్ చేస్తుంది. బా అని వల్లీ అనగానే చందు షాక్ అయి కోపంగా ఉంటాడు. వల్లీ ఎంత మాట్లాడినా.. లవ్యూ అని చెప్పినా నోరు మూసుకొని ఫోన్ పెట్టు అని చందు అంటాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను బావ అని వల్లీ చెప్తే బతకలేకపోతే చచ్చిపో నీ అబద్ధాలు నేను నమ్మలేను అని చందు ఫోన్ కట్ చేసి స్విఛ్ ఆఫ్ చేసేస్తాడు. ఇక బావ నన్ను ఏలుకోడు అని అర్థమైపోయింది అని వల్లీ బాధ పడుతూ చాకు తీసుకొని వచ్చి తల్లిదండ్రులను చంపేయాలని అనుకొని ఇడ్లీబాబాయ్‌ని పొడవబోతే ఇడ్లీబాబాయ్ చూసి తప్పించుకుంటాడు. కన్నతండ్రిని చంపాలి అనుకున్నావ్ బుద్ధిలేదా అని భాగ్యం తిడితే మరేం చేయను.. అని జరిగింది అంతా చెప్తుంది. ఇన్ని చేసిన నేను మీ ఆయన దగ్గరకు నిన్ను పంపలేనా అని భాగ్యం అంటే ఇప్పుడే పంపేయ్ అని అంటుంది. రేపు అద్భుతమైన ఐడియాతో నిన్ను మీ ఇంటికి పంపేస్తాను అని భాగ్యం అంటుంది. 

ప్రేమకి ధీరజ్ జడ వేస్తుంటే ప్రేమ ఫోన్‌లో రీల్స్ చూస్తూ పెద్దగా నవ్వుతుంది. కదలకుండా కూర్చొవే అని ధీరజ్ తిట్టి జడ వేస్తాడు. ప్రేమకి రెండు జడలు వేసి.. పెద్ద బొట్టు పెట్టి చిన్ని పిల్లలా రెడీ చేస్తాడు. అద్దంలో చూసి ప్రేమ బిత్తరపోతుంది. నీ సంగతి చెప్తా ఆగురా అని ధీరజ్‌ని పరుగులు పెట్టిస్తుంది. రామరాజు ఆలోచిస్తూ ఉంటే తిరుపతి పేపర్ చదువుతూ ఉంటాడు. అమూల్య చదువుతూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget