అన్వేషించండి

Jagadhatri Serial Today April 15th: దివ్యాంక బండారం బయటపెట్టించిన జగధాత్రి...మళ్లీ కలిసిపోయిన సురేశ్‌, కౌషికి

Jagadhatri Serial Today Episode April 15th: దివ్యాంక బండారం బయటపెట్టించిన జగధాత్రి...మళ్లీ కలిసిపోయిన సురేశ్‌, కౌషికి

Jagadhatri Serial Today Episode: కౌషికి రూమ్‌లోదొరికిన సొమ్ములు అనాథ ఆశ్రమానికి ఇవ్వనున్నట్లు చెప్పడంతో  దివ్యాంక పరుగున కౌషికి ఇంటికి బయలుదేరుతుంది.  ఇంతలో డబ్బులు బ్యాగ్‌ కొట్టేయడానికి నిషిక, వైజయంతి ప్లాన్ వేస్తుండగా...కౌషికి నగదు బ్యాగ్‌తో బయటకు రావడం చూసి బిత్తరపోతారు.ఇప్పుడు వదిన ఈ డబ్బుల బ్యాగ్‌ తీసుకుని ఎందుకు బయటకు వచ్చిందని అనుకుంటూ కిందకు వస్తారు. ఎందుకు ఈ డబ్బులు బ్యాగ్‌ తీసుకొచ్చారని నిషిక అడుగుతుంది. వదిన ఈ డబ్బులను  అనాథఆశ్రమానికి ఇవ్వబోతుందని జగధాత్రి చెప్పగానే వారు షాక్‌ తింటారు. అలా ఇవ్వడానికి వీల్లేదని నిషిక అంటుంది. ఇది కంపెనీ డబ్బు  కాదు, బిజినెస్‌లో సంపాధించింది కాదని...అలాంటప్పుడు ఈ డబ్బు ఎవరికి ఇవ్వడానికి మీ పర్మిషన్‌ అక్కకి  అక్కర్లేదని కేదార్ అంటాడు. అయినా ఎన్నిరోజులని ఆ డబ్బును నా దగ్గర ఉంచుకుంటానని...ఇంత  డబ్బు నా దగ్గర ఉంటే భయమేస్తుందని అందుకే డొనేట్‌ చేస్తున్నానని కౌషికి అంటుంది.మీకు అంతగా భయమేస్తే మాకు ఇవ్వండని నిషిక అంటుంది. అయినా వీళ్లతో మాటలేంటని డబ్బులు ఇవ్వమని జగధాత్రి చెప్పగానే...అనాథ ఆశ్రమం నుంచి వచ్చిన అతనికి డబ్బులు సంచి కౌషికి ఇవ్వబోతుండగా  దివ్యాంక అక్కడికి వస్తుంది. ఆ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని అంటుంది. మా వదిన డబ్బులు ఎవరికి ఇవ్వాలో నువ్వు చెప్పనక్కర్లేదని జగధాత్రి అంటుంది.అప్పుడే అక్కడికి సురేష్ వస్తాడు. ఈ డబ్బులు కౌషికివి కావని నాడబ్బులని చెబుతుంది.నేనే నిషిక ద్వారా  కౌషికి రూమ్‌లో పెట్టించానని చెబుతుంది.ఇదంతా మేం ఎందుకు నమ్మాలని ధాత్రి ప్రశ్నించగా....కౌషికి,సురేశ్‌ను విడీదయడానికి నేనే నాటకం ఆడానని చెబుతుంది. వెంటనే సురేష్‌ వచ్చి దివ్యాంక చెంప పగులగొడతాడు. డబ్బులు సంచి ఇచ్చి మళ్లీ ఈచుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వెళ్లగొడతాడు.
                      డబ్బులు గురించి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నిషిక అని ధాత్రి నిలదీస్తుంది.ఇంకా వీళ్లతో మాటలు వద్దని అందరినీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని సుధాకర్‌ అంటాడు. వెంటనే కలుగుజేసుకున్న యువరాజు....నిషిక కూడా నాకోసమే ఈ  పనిచేసిందని అంటాడు. లేకపోతే ఆ దివ్యాంక ఆ మర్డర్‌ కేసులో నన్ను ఇరికిస్తానని బెదిరించిందని చెబుతాడు.నేను జైలుపాలవుతానని భయపడే ఇలా చేసిందని ఈ ఒక్కసారికి క్షమించమని అంటాడు. అంటే అక్క జైలుకు వెళ్లినా పర్వాలేదు...నువ్వు మాత్రం వెళ్లకూడడని నీ భార్య అనుకుందా అని కేదార్ నిలదీస్తాడు.ఆ భార్యాభర్తలు విడిపోయినా పర్వాలేదు నా మొగుడు మాత్రం నాకు దక్కితే చాలనుకుందా అని అడుగుతాడు.నిషిక కూడా సారీ చెప్పి బ్రతిమాలడంతో ఇదే లాస్ట్‌ఛాన్స్‌ అని చెప్పి కౌషికి హెచ్చరిస్తుంది.
                            ఆస్పత్రిలో గౌతమ్‌ను చంపేందుకు మనుషులు ప్రయత్నించడంతో జేడీ, కేడీ వెళ్లిఅడ్డుకుంటారు.అప్పుడే అక్కడ కల్యాణి కనిపిస్తుంది. వెంటనే జేడీ కల్యాణ్‌ను అదుపులోకి తీసుుకుని ప్రశ్నిస్తుంది. సుజాత చనిపోయినరోజు నువ్వు తనతోనే ఉన్నావని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతుంది. దీంతో కల్యాణీ నిజం ఒప్పుకుంటుంది. రమేష్‌గారికి దగ్గరైన తర్వాత సుజాత చాలా విలాసవంతమైన జీవితం గడిపిందని అది చూసి నాకు ఈర్ష్య  కలిగి ఆమెను చంపి ఆ ప్లేస్‌లోకి నేను వెళ్లాలనుకున్నాని చెబుతుంది. నేను సుజాతతో గర్భవతినని వీడియో తీయించానని ఆ తర్వాత  సుజాతను చంపేశానని చెబుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్‌కు డబ్బు ఆశ చూపించానని నిజం ఒప్పుకుంటుంది. శవాన్ని మాయం చేసేందుకు గౌతమ్ మహేశ్ అనే వ్యక్తిని ఫోన్ చేయగా...ఆ వీడియో తనకు పంపిస్తే రెండుకోట్లు ఇస్తానన్నాడని చెబుతుంది. ఆ తర్వాత  అతను చెప్పిన దగ్గరే శవాన్ని పాతిపెట్టామని....ఆ స్థలం కౌషికిగారిదని కూడా మాకు తెలియదని చెబుతుంది. దీంతో గౌతమ్‌, కల్యాణినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ న్యూస్‌ చూసి దివ్యాంక అసహనంతో రగిలిపోతుండగా...జేడీ ఫోన్ చేస్తుంది.ఈ కేసులో నువ్వు డైరెక్ట్‌గా లేవని సంబరపడిపోకని....ఆ మహేశ్‌ను తీసుకొచ్చి నిన్ను దోషిగా నిలబెడతానని చెప్పడంతో  దివ్యాంక భయపడిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget