Guppedantha Manasu october 19th: రిషిధార హనీమూన్, మహేంద్ర లైఫ్ లోకి కొత్త క్యారెక్టర్ - దేవయానికి ఫణీంద్ర క్లాస్!
Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన తర్వాత మహేంద్రతో కలసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 19 ఎపిసోడ్
వసుధార ఎండీగా చేరిన వెంటనే..స్టాఫ్ అంతా వచ్చి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తారు. జీతాలు పెంచితేనే ఉంటాం లేదంటే రిజైన్ చేస్తాం అని హెచ్చరిస్తారు. మేం పాఠాలు చెప్పడంతో పాటూ మిషన్ ఎడ్యుకేషన్ లాంటి మిగిలిన పనులు కూడా చేస్తున్నాం అని అంటారు
వసు: నేను ఈ రోజే ఎండీ పదవి చేపట్టాను.. చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి..అవన్నీ అయ్యాక బోర్డ్ మీటింగ్ పెట్టి ఫైనల్ చేస్తాను
లెక్చరర్స్: మీరు ఎండీ సీట్లో బాగానే కూర్చున్నారు కానీ మా సంగతేంటి...అయినా మీరు జీతం పెంచాకే పాఠాలు చెబుతాం అనేసి చెప్పేసి వెళ్లిపోతారు
లెక్చరర్స్ వెళ్లిపోయిన తర్వాత...ఇదంతా ఎవరైనా చేయిస్తున్నారా అని అనుమానపడుతుంది వసుధార... కెరక్టుగా అదే జరుగుతుంది.
లెక్చరర్స్ వెళ్లి ...శైలేంద్రను కలుస్తారు..మా జీతాలు గురించి ఆలోచించే మీలాంటి వాళ్లు ఎండీ అయితే మాలాంటి లెక్చరర్స్ కి మంచి జరుగుతుంది సార్ అనేసి వెళ్లిపోతారు..
Also Read: శైలేంద్ర మాటలు వినేసి రివర్సైన రిషి, వసు సేవలో తరిస్తోన్న ఈగోమాస్టర్!
బయటకు వెళ్లిన రిషి.. కారు రోడ్డు పక్కన ఆపి వసుకి కాల్ చేస్తాడు. వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా అడుగు అంటాడు. సరే అని ముక్తసరిగా అంటుంది వసుధార. ఎందుకలా ఉన్నావని అడిగితే.. లెక్చరర్స్ వచ్చి జీతం పెంచమన్న విషయం గురించి రిషికి చెబుతుంది. ఇప్పటికిప్పుడు ఈ విషయం గురించి బోర్డ్ మీటింగ్ పెట్టడం సరికాదుకదా అంటుంది
రిషి: ఇంత చిన్న సమస్యకే భయపడిపోతే ఎలా..ఇంతకన్నా పెద్ద సమస్యలు వస్తాయి..ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చూద్దాం..కాసేపట్లో క్యాబిన్ కి వస్తానని కాల్ కట్ చేస్తాడు..
కాలేజీలోకి ఎంటరైన రిషి..స్టూడెంట్ లీడర్స్ ని ఎండీగారి క్యాబిన్ కి రమ్మని చెప్పు అని ఫ్యూన్ కి చెబుతాడు..
లోపలకు వెళ్లి వసుధార ఎండీ సీట్లో కాకుండా పక్క సీట్లో కూర్చోవడంపై క్వశ్చన్ చేస్తాడు...ఆ సీట్లో కూర్చోవడం నా వల్లకాదు..ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టొద్దు..అయినా లెక్చరర్స్ శాలరీ ఇష్యూకి సంబంధించి ఏదో పరిష్కారం ఉందన్నారని అడుగుతుంది
రిషి: నేను లెక్చరర్ గా జాయిన్ అవుతున్నాను
వసు: కాలేజీ ఎండీగా చేసి ఇప్పుడు లెక్చరర్ గా
రిషి: నాకు ఇష్టమైన జాబ్
వసు: మీరు లెక్చరర్ గా జాయిన్ అవడం కరెక్టేనా
రిషి: నేనే కాదు ఎంతోమంది లెక్చరర్స్ వస్తారు..రిటైర్డ్ లెక్చరర్స్ చాలామంది ఖాళీగా ఉన్నారు..వాళ్ల రెస్యూమ్స్ వస్తాయి ఎవరు ఏ సబ్జెక్ట్ కి సరిపోతారో ఫైనల్ చేయి
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
ఇంతలో స్టూడెంట్ యూనియన్ సభ్యులు వస్తారు.
రిషి: సిలబస్ కంప్లీట్ అవ్వాలి..ఇలాంటి టైమ్ లో సిలబస్ పై దృష్టి పెట్టాల్సిన లెక్చరర్స్ మానేస్తామంటున్నారు...అయితే జీతాలు పెంచడానికి ప్రాబ్లెమ్ లేదు కానీ అస్సలు టైమ్ ఇవ్వడం లేదు.. సడెన్ గా ఆ డిమాండ్స్ తీర్చడం సాధ్యం అయ్యే పనికాదు. అందుకే మీ సిలబస్ కంప్లీట్ చేసేందుకు ఓ పరిష్కారం ఆలోచించాను. ఏ జీతాలు ఆశించకుండా మాకున్న విద్య పదిమందికి పంచాలనే ఉద్దేశంతో రిటైర్డ్ లెక్చరర్స్ ముందుకొచ్చారు. నేను మిషన్ ఎడ్యుకేషన్ కింద నేను అరెంజ్ చేస్తున్నాను..దీన్ని ఎవ్వరూ కాదనే ఛాన్స్ లేదు.. వాళ్లు వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ల డ్యూటీలోకి రావొచ్చు..ఇప్పుడున్న లెక్చరర్స్ రానంతవరకూ వీళ్లు పాఠాలు చెబుతారని క్లారిటీ ఇస్తాడు...ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగితే..స్టూడెంట్స్ అంతా ఏం లేదని చెబుతారు.. నేను కూడా లెక్చరర్ గా జాయిన్ అవుతున్నాను మీకు మళ్లీ పాఠాలు చెప్పబోతున్నానని అనౌన్స్ చేస్తాడు...
స్టూడెంట్స్ వెళ్లిపోయిన తర్వాత వసుధార కన్నీళ్లతో రిషిని హగ్ చేసుకుంటుంది. ప్లాబ్లెమ్ సాల్వ్ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తుంది
రిషి: నువ్వు ఎండీ సీట్లో ఉండగా నీపై ఎలాంటి మచ్చా పడకూడదు అందుకే ఇలా ఆలోచించాను. నాకు రెండు ప్రాణాలు రెండు బాధ్యతలు డీబీఎస్టీ కాలేజీ, నువ్వు నా ప్రాణం....మిషన్ ఎడ్యుకేషన్ డాడ్ నా బాధ్యత..సెమిస్టర్ హాలీడేస్ అయ్యేసరికి అన్నీ సెట్టవుతాయని ధైర్యం చెబుతాడు..
Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్
మహేంద్ర మాత్రం జగతి ఫొటో దగ్గరే ఉంటాడు.. ఆ ఇంటికి వచ్చిన దేవయాని, శైలేంద్ర, ఫణీంద్ర...రిషివాళ్లని ఇంటికి రమ్మని అడుగుతారు..
అక్కడి వచ్చేస్తే జాగ్రత్తగా చూసుకుంటాను రండి...పెద్దదాన్ని అప్పుడొకమాట అన్నాను ఇంకా అది మనసులో పెట్టుకోవాలా మీ డాడ్ గురించి ఆలోచించు అంటుంది దేవయాని. నేను ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానంటాడు ఫణీంద్ర. శైలేంద్ర కూడా డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఫైర్ అయిన మహేంద్ర నేను రానని చెబుతున్నాను కదా..నువ్వు పో అసలు అని శైలేంద్రపై మండిపడతాడు..
మహేంద్ర: దేవయాని అన్న మాటలన్నీ గుర్తుచేసిన మహేంద్ర..ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు వెళ్లాలి జగతి
దేవయాని: నువ్వు తాగుడు మానాలని అన్నాను
మహేంద్ర: నేను అక్కడకు వెళ్లను జగతి
ఫణీంద్ర: నాకోసం రా మహేంద్ర
రిషి: డాడ్ అక్కడకు వస్తే అమ్మ జ్ఞాపకాల్లోనే ఉంటారని ఇక్కడకు తీసుకొచ్చాను...ఇక్కడా అలాగే ఉన్నారు...దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకుంటున్నా
నేను వస్తానని దేవయాని, మరోవైపు శైలేంద్ర వస్తానంటారు... ఫణీంద్ర ఫైర్ అవుతాడు..వాళ్ల మధ్యలో మీరెందుకు అని క్లాస్ వేస్తాడు.. వాళ్లని ప్రశాంతంగా వదిలేయండి చాలు అనేసి..మహేంద్ర దగ్గరకు వెళతాడు.. అన్నయ్యా నువ్వు చాలా మంచోడివి అన్నయ్యా, నువ్వు బావుండాలి అన్నయ్యా, జగతి చచ్చిపోయింది అన్నయ్యా అని బాధపడతాడు...
గుప్పెడంత మనసు అక్టోబరు 20 ఎపిసోడ్ లో
రిషి, వసు, మహేంద్ర లాంగ్ టూర్ వెళతారు. ఫుల్ గా ఎంజా చేస్తారు.. ఓ చెట్టుకింది కూర్చుని జగతిని తల్చుకుంటూ మహేంద్ర తాగుతుంటాడు.. ఇంతలో ఓ కొత్త క్యారెక్టర్ మహేంద్రా అని పిలుస్తుంది... నువ్వా అని షాక్ అవుతాడు మహేంద్ర.. ఆమె ఎవరో చూపించలేదు కానీ..కథని మలుపుతిప్పనున్న క్యారెక్టర్ మాత్రం అర్థమవుతోంది..