అన్వేషించండి

Guppedantha Manasu March 2nd Episode: ఒక్కటైన వసు-మను, గుప్పెడంత మనసులో సరికొత్త ప్రేమకథ మొదలు - గుప్పెడంత మనసు మార్చి 2 ఎపిసోడ్

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu March 2nd Episode:  (గుప్పెడంతమనసు  మార్చి 2nd ఎపిసోడ్)

DBST కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు.. ఈ ప్రాజెక్ట్ గురించి డీటేల్డ్ గా తెలుసుకోవాలని ఉందన్న మనుకి మొత్తం వివరిస్తుంది వసుధార..

కాలేజీలోకి వచ్చిన ఏంజెల్ ను చూసి అనుపమ షాక్ అవుతుంది.
అనుపమ: స‌డెన్‌గా కాలేజీకి వ‌చ్చావు ఏమైంది..మనసులో ఏదో ఆందోళనతో వచ్చినట్టున్నావ్...
ఏంజెల్: రిషి ఎక్కడున్నాడు..ఏమయ్యాడు..
అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది
ఏంజెల్: రిషి లేడు క‌దా...ఈ లోకంలోనే లేడుక‌దా . రిషి లేడ‌ని తెలిసింది. ఆ విష‌యం విన‌గానే నా గుండె ఆగిపోయినంత ప‌నైంది. అది నిజ‌మో, అబ‌ద్ధ‌మో తెలుసుకోవాల‌ని వ‌చ్చాన‌ు.  రిషి నా బెస్ట్ ఫ్రెండ్ అని నీక తెలుసుకదా..వాళ్లంటే చెప్పలేదు నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు అత్తయ్యా
అనుపమ: ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి..అసలు ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయో చెప్పలేం. ఇక్క‌డ కుట్ర‌లు, కుతంత్రాల మ‌ధ్య రిషి ఫ్యామిలీ న‌లిగిపోతుంది. అందుకే నీకు ఏం చెప్పాలో తెలియ‌లేద‌ు . ఓ స‌మ‌స్య ప‌రిష్కారం కాగానే మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది
ఏంజెల్: అసలు ఏం జరిగింది..రిషి చ‌నిపోలేద‌ని నా మ‌న‌సు చెబుతోంది
అనుపమ:  రిషి క‌నిపించ‌క‌పోవ‌డం నిజం. కానీ రిషి బ‌తికి ఉన్నాడా? చ‌నిపోయాడా అన్న‌ది తేల్చుకోలేక‌పోతున్నాం. జ‌గ‌తి హంత‌కుల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో రిషి మిస్స‌య్యాడ‌ు..ధైర్యంతో క‌ష్ట‌ప‌డి రిషి ఆచూకీని వ‌సుధార క‌నిపెట్టింది. ఆ త‌ర్వాత కాలేజీ ఫెస్ట్‌కు అటెండ్ కావ‌డానికి వ‌స్తుండగా మళ్లీ కనిపించకుండా పోయాడు. గుర్తుతెలియ‌ని డెడ్‌బాడీ పోలీసుల‌కు దొరికింది ఆ డెడ్‌బాడీకి చేసిన డీఎన్ఏ టెస్ట్‌లో అది రిషిదేన‌ని తేలింది. రిషి లేడంటే వసుధార నమ్మడం లేదు
ఇంతలో వసుధార వస్తుంది....

Also Read: బాహుబలి రేంజ్ లో మాటిచ్చిన మను, మారిన వసు - మళ్లీ వచ్చిన ఏంజెల్ - గుప్పెడంత మనసు మార్చి 1 ఎపిసోడ్

ఏంజెల్-వసుధార
కన్నీళ్లతో కనిపించిన ఏంజెల్ ను చూసిన వసుధార.. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. రిషి  సర్ ఉన్నారు..ఎక్కడోచోట క్షేమంగా ఉన్నారు.. 3 నెలల్లో రిషి సర్ ని తిరిగి తీసుకొస్తాను. అంద‌రు నా మాట న‌మ్ముతున్నారు. నువ్వు కూడా న‌మ్ము అని ఏంజెల్‌తో అంటుంది . అత్తయ్య జరిగినదంతా చెప్పింది అంటుంది ఏంజెల్..
అత్తయ్యనా అంటోందేంటని మను ఆలోచనలో పడతాడు... ఇంతలో ఏంజెల్ మనుని చూసి ఈయన ఎవరు అని అడుగుతుంది...
వసుధార: మను..మన కాలేజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. కాలేజీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కాపాడారు, రిషి  సర్ విష‌యంలో  నాకు స‌పోర్ట్ చేస్తున్నారు... మను తను రిషి సర్ ఫ్రెండ్. 
ఏంజెల్: రిషికే కాదు నీక్కూడా ఫ్రెండ్ నే మర్చిపోయావా
అదేం లేదు ఏంజెల్ అంటుంది వసుధార.... 

Also Read: చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!

మను-ఏంజెల్
అక్కడి నుంచి వెళ్లిపోయిన మను... అనుపమని ఏంజెల్ అత్తయ్య అని ఎందుకు పిలిచిందనే ఆలోచనలో పడతాడు... ఇంతలో ఏంజెల్ అక్కడకు వచ్చి... వ‌సుధార‌కు సాయం చేస్తున్నందుకు మ‌నుకు థాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత రిషి-వసుధార ప్రేమ గురించి, వాళ్లు పడిన ఇబ్బందుల గురించి చెబుతుంది. నాకు నమ్మకం ఉందండీ వసుధార కచ్చితంగా రిషిని తీసుకొస్తుంది...వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారని, ఎప్పటిలానే సంతోషంగా ఉంటారని...

మను- ఏంజెల్ ని చూసి అనుపమ కంగారుపడుతుంది...ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అనుకుంటుంది... అనుపమ వాళ్లని కంగారుగా గమనించడం వసుధార చూస్తుంది. 

మను: మీరు రిషి సర్ బెస్ట్ ఫ్రెండ్ కదా..మరి అనుపమ‌ మేడంను అత్త‌య్య అని ఎందుకు పిలిచార‌ు
ఏంజెల్: అత్తయ్యను అత్తయ్య అంటారు కదా.. త‌ను నాకు మేన‌త్త అవుతుంది ( అంటే ‌ఏంజెల్ - మను బావామరదలు అన్నమాట)
ఏంజెల్ ఫ్యామిలీ గురించి మ‌ను ఆరా తీస్తుంటే...మా అమ్మా నాన్న చనిపోయారు మా తాతయ్య దగ్గరుంటానని చెబుతుంది.. మాతాతయ్య పేరు అని చెబుతుండగా అనుపమ అడ్డుపడుతుంది.  టాపిక్ డైవ‌ర్ట్ చేసి అక్కడి నుంచి ఏంజెల్‌ను పంపించేస్తుంది. అనుప‌మ కావాల‌నే ఇదంతా చేసింద‌ని మ‌ను అర్థం చేసుకుంటాడు...వసుధార కూడా అనుపమ ప్రవర్తనను వింతగా చూస్తుంటుంది. మహేంద్ర సర్ ఎక్కడున్నారని అడిగిన ఏంజెల్ చిన్న పని ఉంది చూసుకుని మళ్లీ వస్తానంటుంది. నువ్వు రిషిపై బెంగపెట్టుకోకు తను క్షేమంగా ఉంటాడు...మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది ధైర్యంగా ఉండు..బై అనేసి వెళ్లిపోతుంది ఏంజెల్...

Also Read: ఈ రోజు ఈ రాశులవారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, ఉద్యోగులకు గుడ్ న్యూస్

శైలేంద్ర-రాజీవ్
మ‌ను ఇచ్చిన వార్నింగ్ తలుచుకుని శైలేంద్ర-రాజీవ్ రగిలిపోతారు. ఇప్పటివరకూ ఎంతోమందిని దెబ్బకొట్టాను కానీ వాడి విషయంలో లెక్క తప్పుతోంది అంటాడు రాజీవ్... శైలేంద్ర ఆవేశ పడుతుంటాడు. వాడిపై ఉన్న కోపంతో ఇంతకుముందే నీ వళ్లంతా నుజ్జు చేసుకున్నావ్ అవసరమా నీకు అని కంట్రోల్ చేస్తాడు రాజీవ్.  వ‌సుధార కోసం వెధ‌వ‌లా మారిపోయాను...తనకోసం నా భార్యను కూడా చంపేశానని రాజీవ్ చెప్పడంతో ఆ మాటలు విని షాక్ అవుతాడు శైలేంద్ర. నువ్వు నాలాగే దుర్మార్గుడివి అనుకున్నాను కానీ నీచుడివి అనుకోలేదంటాడు. ఇకపై ఇద్దరం కలసి కొత్త స్కెచ్ లు వేసి కలసి పనిచేద్దాం అనుకుంటారు.

కాలేజీ నుంచి వ‌సుధార ఇంటికి వెళుతోండ‌గా కారు రిపేర్ అవుతుంది. అప్పుడే మ‌ను అక్క‌డికి వ‌స్తాడు. కారు రిపేర్ చేస్తాన‌ని అంటాడు. ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది..

గుప్పెడంత మనసు మార్చి 3 ఎపిసోడ్ లో మను-వసు ఫ్రెండ్షిప్ మరింత బలపడనుందన్నమాట...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
Bathukamma Festival: తెలంగాణలో బతుకమ్మ చుట్టూ రాజకీయాలు! తల్లిని దూరం చేస్తున్నదెవరు.!?
తెలంగాణలో బతుకమ్మ చుట్టూ రాజకీయాలు! తల్లిని దూరం చేస్తున్నదెవరు.!?
T Mobile CEO: H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్
H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్
OG Movie - Subhash Chandra Bose: 'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్... క్యూరియాసిటీ పెంచిన గేమ్... ఈ లింక్స్, అసలు కథ ఏంటి?
'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్... క్యూరియాసిటీ పెంచిన గేమ్... ఈ లింక్స్, అసలు కథ ఏంటి?
Advertisement

వీడియోలు

రికార్డుల రారాజు.. బ్యాటంబాంబ్ అభిషేక్
ఇంకో పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. వీళ్ల బుద్ధి మారదురా బాబూ..!
పీసీబీకి అంపైర్ ఫోబియో.. మరో రిఫరీపై ఐసీసీకి కంప్లైంట్
పాకిస్తాన్ ఫ్యూచర్ తేలేది నేడే.. ఓడితే ఇంటికే
Moon Water Wars : VIPER, Blue Origin & NASA సీక్రెట్ పాలిటిక్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Politics: తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
తండ్రికి షాక్, కూతురికి టీడీపీ పగ్గాలు! రాజోలులో ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయం..
Bathukamma Festival: తెలంగాణలో బతుకమ్మ చుట్టూ రాజకీయాలు! తల్లిని దూరం చేస్తున్నదెవరు.!?
తెలంగాణలో బతుకమ్మ చుట్టూ రాజకీయాలు! తల్లిని దూరం చేస్తున్నదెవరు.!?
T Mobile CEO: H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్
H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్
OG Movie - Subhash Chandra Bose: 'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్... క్యూరియాసిటీ పెంచిన గేమ్... ఈ లింక్స్, అసలు కథ ఏంటి?
'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్... క్యూరియాసిటీ పెంచిన గేమ్... ఈ లింక్స్, అసలు కథ ఏంటి?
కొత్త Thar నుంచి Tata Punch Facelift వరకు - రూ.10 లక్షల్లో రాబోతున్న టాప్‌ 5 SUVs
రూ.10 లక్షల లోపు న్యూ లాంచ్‌లు - కొత్త Thar, Punch Facelift సహా టాప్‌-5 SUVల లిస్ట్‌
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాలలో తాగునీటి సరఫరా బంద్
CAG Report: రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ, లోటు రాష్ట్రాల్లో ఏపీ- 2022-23 ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి సర్ప్రైజ్... మిడ్ వీక్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్... హౌస్‌లోకి ముగ్గురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ
Embed widget