అన్వేషించండి

Guppedantha Manasu March 1st Episode: బాహుబలి రేంజ్ లో మాటిచ్చిన మను, మారిన వసు - మళ్లీ వచ్చిన ఏంజెల్ - గుప్పెడంత మనసు మార్చి 1 ఎపిసోడ్

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu March 1st Episode:  (గుప్పెడంతమనసు  మార్చి 1st ఎపిసోడ్)

మ‌ను స‌హాయంతో రిషికి కర్మకాండలు జరగకుండా అడ్డుకుంటుంది వసుధార. ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర బాధగా కూర్చుంటాడు. అసలేంటి నువ్వు చేసింది అని అనుపమ నిలదీస్తుంది. కానీ వసుధార మాత్రం మహేంద్రని సపోర్ట్ చేస్తుంది. 
వసుధార: రిషి సర్ కి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించే విష‌యంలో మామ‌య్య త‌ప్పేం లేద‌ు ఇదంతా శైలేంద్ర కుట్ర...ఆచారాలు, సంప్ర‌దాయాల పేరుతో ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర‌ల‌ను న‌మ్మించి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించే ప్ర‌య‌త్నం చేశార‌ంటుంది. ఫ‌ణీంద్ర‌ మాట‌ల‌కు ఎదురుచెప్ప‌లేక మామ‌య్య రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌డానికి ఒప్పుకున్నారు
మహేంద్ర:  క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. నేను త‌ప్పు చేశాను...కానీ అది త‌ప్ప‌క చేశాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని అంటాడు. మహేంద్రపై ఫైర్ అవుతున్న అనుపమను కంట్రోల్ చేస్తుంది వసుధార..నన్ను నా ప్రేమను నమ్మండి నిజంగా మూడు నెలల్లో రిషిని తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనుపమ కూడా వసుధారని నమ్ము మహేంద్ర అంటుంది.  రిషి ఫొటో చూసి మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు...వ‌సుధార అన్న‌ట్లు నువ్వు బ‌తికే ఉన్నావా, అది నిజం అవుతుందా ..డాడ్ అనే పిలుపు విని చాలా రోజులైంద‌ని, ఆ పిలుపు వినాల‌ని త‌న మ‌న‌సు ప‌రిత‌పిస్తోంది అనుకుంటాడు.

Also Read: రిషి బతికే ఉన్నాడోచ్.. ఇప్పటివరకూ ఓ లెక్క అంటూ ప్రభాస్ స్టైల్లో శైలేంద్రకి మను వార్నింగ్ - గుప్పెడంతమనసు ఫిబ్రవరి 29 ఎపిసోడ్

శైలేంద్ర రూమ్‌లోకి రాగానే  బెడ్‌పై నాలుగు బెల్టులు క‌నిపిస్తాయి. అవి మీకోస‌మే పెట్టాన‌ని, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయ‌ని  సెటైర్ వేస్తుంది ధ‌ర‌ణి. వెన్న‌కూడా రెడీగా ఉంద‌ని, మీరు బెల్టుతో కొట్టుకోవ‌డ‌మే ఆల‌స్య‌ం అంటుంది. ధ‌ర‌ణి వెట‌కారాన్ని సహించలేకపోయిన శైలేంద్ర‌తో  దేవ‌యాని ... ఫైర్  అవుతారు. ప్ర‌తిసారి లాగే ఈ సారి కూడా చివ‌రి నిమిషంలో ప్లాన్ ఫెయిల‌వ్వ‌డం త‌ట్టుకోలేక‌పోతారు. మ‌ను వ‌ల్లే త‌మ ప్లాన్ బెడిసికొట్టింద‌ని శైలేంద్ర కోపంగా ఉంటాడు.
దేవయాని: రిషి బ‌తికిలేక‌పోయినా మూడు నెల‌ల్లో తీసుకొస్తాన‌ని వ‌సుధార ఎందుకు ఛాలెంజ్ చేసిందో
శైలేంద్ర: అదే అర్థం కావడం లేదు...
దేవయాని: నిజంగానే తీసుకొస్తుందా
శైలేంద్ర: చ‌నిపోయిన వాడిని ఎక్క‌డి నుంచి తీసుకొస్తుంది...
దేవయాని: అసలు రిషి బతికి ఉన్నాడని అంత నమ్మకం ఏంటి?
తను మీలా ఆలోచించదు కాబట్టి అంటూ ఎంట్రీ ఇస్తాడు ఫణీంద్ర...నీకు కొంచెం కూడా బుద్ధి లేదా.. రిషి ఉన్నాడ‌ని వ‌సుధార న‌మ్ముతుంది. మీరు కూడా న‌మ్మండి అని అంద‌రికి చెప్పాను. అయినా మీరు నా మాట‌ల‌ను లెక్క‌చేయ‌డం లేద‌ని క్లాస్ ఇస్తాడు. మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు.. రిషి గురించి మీకేమైనా తెలుసా? మీ మాటల వెనుకున్న అర్థం ఏంటని నిలదీస్తాడు?
దేవయాని: అర్థాలు, ప‌ర‌మార్థాలు ఏం లేవ‌ని, రిషి గురించి మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు 
వాళ్లు ఏదో దాస్తున్నారని గమనించిన ఫణీంద్ర..మీరు మారరు అని చీదరించుకుంటాడు...మీరు మార‌క‌పోయిన ప‌ర్వాలేదు కానీ వ‌సుధార‌ను ఇబ్బందిపెట్టే ప‌నులు చేస్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇస్తాడు.

Also Read: రిషి బతికే ఉన్నాడోచ్.. ఇప్పటివరకూ ఓ లెక్క అంటూ ప్రభాస్ స్టైల్లో శైలేంద్రకి మను వార్నింగ్ - గుప్పెడంతమనసు ఫిబ్రవరి 29 ఎపిసోడ్
మ‌ను కోసం క్యాబిన్‌కు వ‌స్తుంది వ‌సుధార‌.  మ‌ను క్యాబిన్‌లో కనిపించకపోవడంతో వసు వెతుకుతుంది..ఇంతలో మను వస్తాడు
వసు: థ్యాంక్స్ అండీ
మను: ఎందుకు
వసు: మీ వల్ల నాకు ఇంకో సహాయం జరిగింది. రిషి సర్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు.సర్ బతికి ఉన్నారని నేను చాలాసార్లు చెప్పాను కానీ ఎవ్వరూ నన్ను నమ్మలేదు..నిన్న నేను చెప్పినదానికి వాళ్లు ఒప్పుకున్నారు, నాకు 3 నెలలు టైమ్ ఇచ్చారు..అందుకు మీ మాటలు కూడా ఉపయోగపడ్డాయి. మీరు సపోర్ట్ గా నిలబడ్డారు...
మను: మీ ప్రేమ చాలా గొప్పది..రిషి సర్ బతికి ఉన్నారని నేను నమ్మాను..ఆయనపై మీకున్న ప్రేమని అర్థం చేసుకున్నాను.. దాన్ని గౌరవించాలి అందుకే మీ ప్రేమను నిలబెట్టాలని మీ నమ్మకాన్ని నిలబెట్టాలని సపోర్ట్ గా నిలబడ్డాను.. అంతకు మించి ఇంకేం లేదు...
వసు: ఇన్నాళ్లూ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను...చాలా సీరియస్ గా మాట్లాడాను..తప్పుగా మాట్లాడాను..
మను: మీరు ఇలా మాట్లాడినందుకు నేను నొచ్చుకోలేదు..మీరు నాపై కోపంతో అలా మాట్లాడలేదు..కాలేజీకి నష్టం కలిగిస్తారనే ఉద్దేశంతో అలా మాట్లాడారు...
వసు: నా ఉద్దేశం కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు థ్యాంక్యూ అనేసి వెళ్లిపోతుంది...

అనుపమకు ఏంజెల్ కాల్
అనుపమకు కాల్ చేసిన ఏంజెల్..ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చానని చెప్పి నేను డీబీఎస్‌టీ కాలేజీకి వ‌స్తున్న‌ట్లు చెబుతుంది. ఎందుకు వ‌స్తున్నావ‌ని అనుప‌మ అడిగిన ప్ర‌శ్న‌కు అక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాతే స‌మాధానం చెబుతాన‌ని ఏంజెల్ ఫోన్ క‌ట్ చేస్తుంది. 

Also Read: మార్చి నెల ఆరంభం ఈ రాశులవారికి అదిరింది!

మనుని చూస్తూ నిల్చుంటుంది అనుపమ...అంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర..మనుతో మాట్లాడాలి రా అని పిలుస్తాడు. నువ్వెళ్లు అనేస్తుంది అనుపమ. మహేంద్ర వెళతాడు.

మనులో రిషిని చూసుకున్న మహేంద్ర
నిన్ను చూస్తుంటే నాకు ఏదో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోందంటూ మొదలు పెట్టిన మహేంద్ర..ఇంత‌కుముందు నేను బాధ‌లో ఉన్న‌ప్పుడు నేను ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండిండి అని నా కొడుకు అండ‌గా నిల‌బ‌డేవాడు. ఆ ధైర్యం చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ నిన్ను చూసిన త‌ర్వాతే వ‌చ్చింద‌ని మ‌నుతో అంటాడు.
మను: నేను మీ ఫ్యామిలీ మెంబ‌ర్‌నే అని మీరు అన్నారు...మ‌న అనుకున్న‌వాళ్లు క‌ష్టాల్లో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాన‌ు
మహేంద్ర: రిషి ఉన్నాడ‌ని వ‌సుధార ఎంత గ‌ట్టిగా న‌మ్ముతుందో ...ఆమె న‌మ్మ‌కాన్ని నువ్వు బ‌లంగా న‌మ్ముతున్నావ‌ని అర్థ‌మైంది
మను:  వ‌సుధార చెబుతుంది నిజ‌మేమోన‌ని అనిపిస్తోంది
మహేంద్ర: రిషి విష‌యంలోఈ కాలేజీ విష‌యంలో వ‌సుధార‌కు సాయం చేయ‌మ‌ని, ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌మ‌ని మ‌నును రిక్వెస్ట్ చేస్తాడు మ‌హేంద్ర‌ వ‌సుధార‌కు ప్ర‌తి విష‌యంలో సాయం చేస్తాన‌ని మ‌హేంద్ర‌కు మాటిస్తాడు మ‌ను..

ఆ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ జరుగుతుంది...
గుప్పెడంతమనసు మార్చి 1 ఎపిసోడ్ ముగిసింది...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Embed widget