Horoscope Today 1st March 2024: మార్చి నెల ఆరంభం ఈ రాశులవారికి అదిరింది!
Horoscope March 1st 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
1st March 2024 Today Horoscope
మేష రాశి (Aries Horoscope Today)
ఈ రోజు మీకు శుభదినం. ఆఫీసులో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. వృత్తి జీవితంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని సులభంగా అధిగమిస్తారు. కార్యాలయంలో మీ నెట్ వర్క్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి జాగ్రత్త. అనవసర చర్చలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి (Taurus Horoscope Today)
ఈ రోజు వృషభ రాశి వారు తమ అన్ని పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. సోమరితనానికి దూరంగా ఉండండి. ఏదైనా వ్యాపార ఒప్పందంపై సంతకం చేసే ముందు పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలను పొందవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
మిథున రాశి (Gemini Horoscope Today)
కెరీర్‌లో పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పని పూర్తవుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కొత్త ఆర్థిక ప్రణాళికను రూపొందించండి. కొంతమంది ఈరోజు ఉద్యోగాలు మారాలని నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబంతో కొనసాగుతున్న ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోర్టు కేసుల వరకూ వెళ్లడం మంచిది కాదు.
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు విజయం సాధించేందుకు మరింత కష్టపడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
సింహ రాశి (Leo Horoscope Today)
సింహ రాశివారు జీవితంలో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి. మీరు ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆఫీసు రాజకీయాల వల్ల పనిలో ఆటంకాలు పెరగవచ్చు. వ్యాపారస్తులు బకాయిలు తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి
Also Read: జీవితంలో ఏ మనిషి చేయకూడని 5 పాపాలు ఇవే!
కన్యా రాశి (Virgo Horoscope Today)
వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి. ఈరోజు ఆఫీసులో సహోద్యోగులతో కలిసి చేసే పనిలో అపారమైన విజయం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం పాటించండి. కోపాన్ని తగ్గించుకోవాలి. మీ భాగస్వామి అభిప్రాయాలు గౌరవించాలి. మారుతున్న వాతావరణం వల్ల కొందరికి అనారోగ్య సమస్యలు రావచ్చు.
తులా రాశి (Libra Horoscope Today)
ఉద్యోగ రీత్యా ప్రయాణాలు సాధ్యమవుతాయి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. సమాజంలో గౌరవం పెరుగుతుంది కానీ డబ్బు విషయంలో కుటుంబం వివాదాలు ఉండవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
ఆదాయం పెరిగే కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. ఉద్యోగులు పనిలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపార భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీ అభిప్రాయాలు చెప్పడమే కాదు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించాలి.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులుగా ఉంటారు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. ఆఫీసులో మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. పనిలో అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండండి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
మకర రాశి (Capricorn Horoscope Today)
ఏదో విషయంలో బాధపడతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు పొందుతారు. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రోజు సవాళ్లు ఉన్నప్పటికీ, అన్ని పనులలో అపారమైన విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపండి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది.
Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!
కుంభ రాశి (Aquarius Horoscope Today)
వ్యాపారంలో ధనలాభం వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం వస్తుంది. చేయాల్సిన పనుల విషయంలో తొందరపడొద్దు. అంకితభావంతో పనిచేస్తే తప్పనిసరిగా విజయం వరిస్తుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి
మీన రాశి (Pisces Horoscope Today)
ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రణాళికను రూపొందించండి. వ్యాపారానికి సంబంధించి ఈరోజు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి
Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.