అన్వేషించండి

T Mobile CEO: H-1B వీసా ఛార్జీలపై డోంట్ కేర్- సీఈవోగా ఇద్దరు భారతీయులకు అమెరికా కంపెనీలు ప్రమోషన్

H-1B Visa Charges Hike: అమెరికాలో భారతీయ ప్రతిభకు డిమాండ్ కొనసాగుతోంది. ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు పెంచినప్పటికీ, అమెరికా కంపెనీలు ఇద్దరు భారతీయులను సీఈవోలుగా నియమించాయి.

H-1B  Visa Fees Hike In America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాకు సంబంధించి తీసుకున్న నిర్ణయం భారత్‌లో ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు H-1B వీసాపై ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగిని అమెరికాకు తీసుకువస్తే, వారి పేరిట 100,000 అమెరికన్ డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే, ఇంతకు ముందు ఈ వీసా కోసం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.88 లక్షలకు పెంచేసింది. అదే సమయంలో అమెరికాలోని 2 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలో ఇద్దరు భారతీయులకు సీఈవోగా పదోన్నతి కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. వీరిలో ఒకరు శ్రీనివాస్ 'శ్రీని' గోపాలన్. మరొకరు రాహుల్ గోయల్‌. ట్రంప్ నిర్ణయాలకు అమెరికా కంపెనీలు భయపడేది లేదని ఈ తాజా మార్పులు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరీ శ్రీనివాస్ గోపాలన్..  

IIM- అహ్మదాబాద్‌లో చదుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టెలికాం రంగంలో దిగ్గజ అమెరికన్ కంపెనీ T-Mobile COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా 55 ఏళ్ల శ్రీనివాసన్ ను సీఈవోగా నియమించారు. నవంబర్ 1న శ్రీనివాస్ గోపాలన్ T-Mobile కొత్త CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపడతారు. 2020 నుండి కంపెనీని నిర్వహిస్తున్న మైక్ సీవర్ట్ స్థానంలోకి శ్రీనివాసన్ వస్తారు.

మైక్ ఇప్పుడు కంపెనీ కొత్త వైస్ ఛైర్మన్ స్థానంలో కొనసాగుతారు. శ్రీనివాసన్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయంపై కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. అతను ఇలా రాసుకొచ్చారు. "T-Mobile తదుపరి CEO కావడం చాలా గౌరవంగా ఉంది. నేను చాలా కాలం నుంచి కంపెనీ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నాను.  వినియోగదారులకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాను" అని పోస్ట్ చేశారు.

గోపాలన్ పేరు మీద అనేక విజయాలు 

గోపాలన్ హిందుస్థాన్ యూనిలీవర్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్, క్యాపిటల్ వన్, డాయిష్ టెలికాం వంటి అనేక పెద్ద కంపెనీలలో కీలక పదవుల్లో పనిచేశారు. ఈ క్రమంలో అనేక పెద్ద విజయాలను సాధించాడు. ఈ కంపెనీల్లో పనిచేస్తూ, అతను లక్షలాది ఇళ్లకు ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించిన ఘనత దక్కించుకున్నారు. జర్మనీలో రికార్డు మొబైల్ షేర్‌ను సాధించారు. T మొబైల్‌లో గోపాలన్ టెక్నాలజీ, కన్స్యూమర్ తో పాటు బిజినెస్ విభాగాలను గోపాలన్ విజయవంతంగా నిర్వహించారు. అలాగే 5G, AI, ఇతర డిజిటల్ మార్పులను కూడా చూసుకున్నారు.

మోల్సన్ కూర్స్ సీఈవోగా రాహుల్ గోయల్‌

హెచ్1బీ వీసాల చార్జీల పెంపు, విదేశీ ఉద్యోగులకు చెక్ పెడుతున్న సమయంలో చికాగోకు చెందిన బెవరేజ్ కంపెనీ మోల్సన్ కూర్స్ 49 ఏళ్ల రాహుల్ గోయల్‌ను సీఈవోగా నియమించింది. అక్టోబర్ 1 నుండి తమ కొత్త ప్రెసిడెంట్,  CEOగా రాయల్ గోయల్‌ను సంస్థ ఎంపిక చేసింది. అతను గెవిన్ హేటర్స్‌లీ స్థానంలోకి వస్తారు. వాస్తవానికి భారతదేశానికి చెందిన రాహుల్ గోయల్ మైసూర్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్ చదవడానికి డెన్వర్‌కు వెళ్లారు. అతను అమెరికా, బ్రిటన్, భారతదేశంలో కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లతో పనిచేశాడు.

తన కొత్త బాధ్యత గురించి రాహుల్ స్పందించారు. తాను కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గోపాలన్ లేదా రాహుల్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన చాలా మంది అమెరికాలోని పలు కంపెనీల్లో సీఈవో, పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌ కంపెనీలో సుందర్ పిచాయ్. ఇప్పుడు ఫార్చ్యూన్ గ్లోబల్ 500కి చెందిన ఇతర కంపెనీలు కూడా భారతీయులపై ఆసక్తి చూపుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget