H1b Visa Charges: భారతీయుల ఎఫెక్ట్.. H-1B వీసాల ఛార్జీలపై వెనక్కి తగ్గుతున్న ట్రంప్.. వారికి మినహాయింపు !
Indian charged for H 1b Visa to America |డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్1బి వీసా ఛార్జీలు పెంచారు. డాక్టర్లు లాంటి కొన్ని విభాగాలలో భారతీయులకు ఫీజులో మినహాయింపులు ఇవ్వాలని అమెరికా భావిస్తోంది.

H 1b Visa Charges Hike | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) H-1B వీసా ఫీజును లక్ష డాలర్లు చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం సైతం చేయడంతో సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. హెచ్1బీ వీసాలపై ఛార్జీల విషయంలో ట్రంప్ ఒక్కో మెట్టు దిగొస్తున్నారు. మొదట అమెరికాలో పనిచేస్తున్న విదేశియులు అందరిపై ఫీజు వసూలు చేయాలని భావించారు. అయితే అక్కడి ఐటీ కంపెనీల నుంచి వచ్చిన రిక్వెస్ట్ తరువాత కేవలం కొత్తగా హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రంగాలు, విభాగాల వారికి లక్ష డాలర్ల హెచ్1బీ వీసా ఛార్జీల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయని సమాచారం.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజు నుంచి డాక్టర్లకు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ఛార్జ్ 100,000 డాలర్లుగా ఉంది. అయితే డాక్టర్లతో పాటు వైద్య పరిశోధనలు, ఫిజీషియన్లు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, స్టెమ్ కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ విభాగాల వారికి హెచ్1బీ చార్జీల మోత నుంచి ఉపశమనం లభించవచ్చు. కొన్ని రంగాల్లో అప్పటికప్పుడు అమెరికా నిపుణులను తయారుచేయడం కష్టం. ఆయా విభాగాల్లో కొరత, అమెరికాలో నెలకొన్న డిమాండ్ కారణంగా ఈ నిర్ణయాలపై ట్రంప్ సంతకం చేస్తారని సమాచారం.
ట్రంప్ ప్రకటన తర్వాత భారత ఐటీ రంగంలో కలకలం రేగింది. H-1B వీసాలను ఎక్కువగా ఉపయోగించే దేశం భారతదేశం. మేయో క్లినిక్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ , సెయింట్ జూడ్ హాస్పిటల్ సహా అనేక పెద్ద ఆసుపత్రులు H-1B వీసాలపై ఆధారపడి వర్క్ చేస్తున్నాయి. నివేదికల ప్రకారం, మేయోలో 300 కంటే ఎక్కువ వీసాలు ఆమోదించారు. అందువల్ల, దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్ సహా పలు దేశాల వైద్యులకు వీసా ఫీజులో మినహాయింపు లభించవచ్చు.
అమెరికాలో వైద్యుల కొరత
వీసాపై భారీ ఫీజు పెంపు డాక్టర్ల కొరతను పెంచుతుందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. అనేక అమెరికన్ ఆరోగ్య వ్యవస్థలు, మెడికల్ రెసిడెంట్స్ ను తీసుకురావడానికి ఎక్కువగా H-1B వీసాలపై ఆధారపడతారు . వైట్ హౌస్ ప్రతినిధి టైలర్ రోజర్స్ మాట్లాడుతూ, "చట్టం వైద్య సిబ్బంది, వైద్యులతో సహా కొన్ని విభాగాలకు మినహాయింపులను అనుమతిస్తుంది. వీసా ఫీజు తగ్గించకపోతే, అమెరికాలో వైద్య సిబ్బంది కొరత పెరగవచ్చు’ అన్నారు.






















