అన్వేషించండి

Horoscope Today 2nd March 2024: ఈ రోజు ఈ రాశులవారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, ఉద్యోగులకు గుడ్ న్యూస్

Horoscope March 2nd ,2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Today Horoscope 2nd March 2024

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రాశివారికి సామాజిక హోదా పెరుగుతుంది.  మీరు మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు.  ఆకస్మికంగా ప్రయాణించవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.  స్నేహితుని సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు శుభవార్త అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

వృషభ రాశి వారు ఈరోజు విజయాన్ని సాధించేందుకు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. పని బాధ్యతలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో ఏర్పడే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు.  లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. ఆఫీసులో పని బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు ఉండవచ్చు  ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. అప్పులు ఇవ్వొద్దు మీరు తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఎదురయ్యే  సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. కొంతమంది ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!

సింహ రాశి (Leo Horoscope Today)

కుటుంబ సభ్యులు, బంధువులతో ఉన్న అపార్థాలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో అదనపు బాధ్యతలు పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. కొంతమంది ఈరోజు  ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు.  

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈరోజు మీకు శుభదినం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబం  స్నేహితుల సహకారంతో ఈరోజు పనిలో అడ్డంకులు తొలగిపోతాయి.

  Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా సవాళ్లు ఎదురవుతాయి.  వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించాలి. ఏదో తెలియని భయం వల్ల మనసు చికాకుగా ఉంటుంది.   పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడవద్దు 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత ,వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. కార్యాలయంలో నూతన బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

 వృత్తి జీవితంలో ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. మీ పనిపై దృష్టి పెట్టండి. ఆఫీసు కబుర్లకు దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఓపికపట్టండి  మీరు కచ్చితంగా విజయాన్ని పొందుతారు

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

మకర రాశి (Capricorn Horoscope Today) 

జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు ఉంటాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా అందాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆర్థిక సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి. మనసులో ఆశ, నిస్పృహలు ఉంటాయి. తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. ఈరోజు లావాదేవీలకు దూరంగా ఉండండి.  మీ భాగస్వామితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత వహించడానికి వెనుకాడరు.  

Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!

మీన రాశి (Pisces Horoscope Today) 

ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. పెట్టుబడి ఎంపికలపై నిఘా ఉంచండి నిపుణుల సలహా లేకుండా తొందరపాటు నిర్ణయం వద్దు. వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అన్నీ సర్దుకుంటాయి.  కొంతమందికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.