మార్చిలో కర్కాటక రాశివారిపై అష్టమ శని ప్రభావం అష్టమ శని ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు పూర్తిచేయడానికి చాలా కష్టపడతారు. వాహన ప్రమాదాలు, గృహచలనం ఉండొచ్చు. ఏదో విషయంలో కలత చెందుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. పాత వ్యాధులు తిరగబెట్టే అవకాశం ఉంది. నెల మధ్యలో విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. Images Credit: Pixabay