OG Movie - Subhash Chandra Bose: 'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్... క్యూరియాసిటీ పెంచిన గేమ్... ఈ లింక్స్, అసలు కథ ఏంటి?
Subhash Chandra Bose in OG: 'ఓజీ' సినిమాలో సుభాష్ చంద్రబోస్ ఉన్నారా? ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే... దర్శకుడు సుజీత్ అండ్ కో రూపొందించిన గేమ్. అందులో విజువల్స్ కథపై మరింత క్యూరియాసిటీ పెంచాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ' (OG Movie). ఓ ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపిస్తాడు? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా సుజిత్ విజన్‌లో పవన్ కళ్యాణ్ చేయబోతోన్న విధ్వంసమే 'ఓజీ'. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అంచనాలను ఆకాశమంత ఎత్తులోకి చేర్చాయి. ఇక తమన్ మ్యూజిక్ అయితే అందరినీ హంట్ చేస్తూనే ఉంది. తమన్ ఇచ్చిన బీజీఎంకి థియేటర్లో బాక్సులు బద్దలు అయ్యేలానే ఉన్నాయి.
థియేటర్లలో 'ఓజీ' విధ్వంసం జరగబోతోందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ ఫైర్ స్ట్రోమ్ దెబ్బకు కలెక్షన్ల వర్షం కురిసేలా ఉంది. ఇప్పటికే ఒక్క టికెట్ ముక్క కూడా దొరకడం లేదు. అన్ని షోలు, అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక ఇది వరకు కొన్ని చోట్ల 'ఓజీ' టికెట్లను వేలం వేస్తే లక్షలు కుమ్మరించి మరీ కొనేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. చూస్తుంటే ఓజీ డే వన్ విషయంలో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసేలా ఉంది.
రికార్డుల గురించి ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఆలోచిస్తుంటే... 'ఓజీ' మీద మరింత హైప్ క్రియేట్ చేసేలా ఓ గేమ్‌ను డిజైన్ చేశారు. ఈ గేమ్‌లో మూడు లెవెల్స్‌ను పెట్టారు. కటారా, విల్లు ఇలా మూడు స్టేజ్‌లు పెట్టారు. ఇందులో మొదటి స్టేజ్‌లో ఒజాస్ అనే గురువు.. గంభీరా అనే శిష్యుడి మధ్య సంభాషణ జరుగుతుంది. ఓజీ అంటే ఓజాస్ గంభీరా అన్న సంగతి తెలిసిందే. ఒజాస్ అనే గురువు పేరును తన పేరులో పెట్టుకున్నాడు అనే లీక్ ఇది వరకే వచ్చింది.
Also Read: నాగార్జున వందో సినిమా దర్శకుడితో... OG Heroine ప్రియాంక సినిమా... థియేటర్లకు కాదు, ఎందుకో తెలుసా?
#OGGame Shocks Fans:
— MOHIT_R.C (@Mohit_RC_91) September 23, 2025
The theme game showed Freedom fighter Netaji Subhash Chandra Bose.
Naturally, this has triggered a storm of theories online. The burning questions: Whose eyes flash in the game? And what does Subash Chandra Bose have to do with this story? pic.twitter.com/Y7HrU6KVNd
'ఓజీ' టీం రిలీజ్ చేసిన ఆటలో సుభాష్ చంద్రబోస్ గురించి కూడా ఉంది. అసలు ఈ కథకు ఆయనకు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో చూపించిన విజువల్స్‌కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? కటారాపై చూపించిన ఆ కళ్లు ఎవరివి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ గేమ్‌ను డిజైన్ చేశారు. మొత్తానికి ఓజీ టీం మాత్రం సినిమా మీద చివరి వరకు హైప్ పెంచుతూ వెళుతోంది. ఈ హైప్‌తో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ మీమ్స్, ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ హైప్‌తోనే పోయేలా ఉన్నాం కదా అంటూ తమన్ ట్విట్టర్ ఖాతాపై కామెంట్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోనూ సుభాష్ చంద్రబోస్ లింక్ ఉంటుందా? లేదంటే గేమ్ వరకు పరిమితం అవుతుందా? అనేది కొన్ని గంటల్లో తెలుస్తుంది.
Also Read: ఎక్స్‌క్లూజివ్... ఇంజ్యూరీ తర్వాత రోజు షూటింగ్ - దటీజ్ ఎన్టీఆర్, డెడికేషన్‌కు మారు పేరు





















