అన్వేషించండి

Guppedantha Manasu February 6th Episode: వసుని లాక్కెళుతున్న రాజీవ్ ను ఆపిన వ్యక్తి ఎవరు - రిషి వచ్చేశాడా!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు ఓ వైపు - రిషి కిడ్నాప్ డ్రామా మరోవైపు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu February 6th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 6 ఎపిసోడ్)

ఓ డెడ్ బాడీ దొరికింది..గుర్తించేందుకు రమ్మని చెప్పి మహేంద్రని తీసుకెళ్తాడు ముకుల్. మరోవైపు దేవయాని-శైలేంద్ర సంతోషిస్తారు. ఫణీంద్ర మాత్రం టెన్షన్ పడతాడు. ఇంతలో ఇంటికి వచ్చిన మహేంద్రని అడుగుతారు వసుధార, అనుపమ.  అది రిషి సర్ డెడ్ బాడీ కాదని చెప్పండి మావయ్యా అని వసు అంటే కరెక్టేనమ్మా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు మీరు అబద్ధం చెబుతున్నారని వసుధార అంటుంది. ఇది నిజమే అని చెబుతాడు మహేంద్ర...అది నా రిషి డెడ్‌బాడీనే, రిషి మ‌న‌కు ఇక లేడ‌ని క‌న్నీళ్ల‌తో కుప్పకూలిపోతాడు. అయినా రిషి క్షేమంగానే ఉన్నాడని వాదిస్తుంది వసుధార. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన ఫణీంద్ర ని చూసి మహేంద్ర మరింత ఏమోషనల్ అవుతాడు. ఆ మాట విన‌గానే దేవ‌యాని, శైలేంద్ర ఆనందం ఆపుకోలేక‌పోతారు. నిజాన్ని నేనే క‌ళ్ల‌తో చూస్తాన‌ని, హాస్పిట‌ల్ వెళ్దామ‌ని ముకుల్‌తో అంటుంది వ‌సుధార‌. మహేంద్ర వద్దని చెప్పినా వసుధార వినదు. 

Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!

శైలేంద్ర: రిషి చ‌నిపోయాడ‌నే నిజాన్ని నువ్వు జీర్ణించుకోలేక‌పోతున్నావ‌ని అర్థ‌మ‌వుతోంది. టెస్టుల్లో అది రిషిదే అని తేలింద‌ని చెబుతున్నారు క‌దా
వసు: కోపంగా శైలేంద్ర కాలర్ పట్టుకున్న వసుధార..టెస్టుల‌ది ఏముంది. నీలాంటి వెధ‌వ ఎవ‌డైనా మారుస్తాడు అని ఆన్స‌ర్ ఇస్తుంది. నువ్వే రిపోర్ట్స్ మార్చావు క‌దా. నిజం చెప్పు అని నిల‌దీస్తుంది.
దేవయాని:శైలేంద్రకు రిపోర్ట్స్ మార్చాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడ‌ు
వసు: వీడు ఎక్క‌డ ఉండైనా అక్ర‌మాలు చేయ‌గ‌ల‌డ‌ు
దేవయాని: పిచ్చిపిచ్చిగా మాట్లాడ‌కు . నా కొడుకు అమాయ‌కుడు. అన్నింటికి వాడిపై ప‌డితే..వాడు ఊరుకున్నా నేను ఊరుకోను 
వసు: నేరాలు చేసేది మీరే కాబ‌ట్టి మీపై నింద‌లు వేస్తున్నాన‌ు 
దేవయాని: రిషి చ‌నిపోయిన నిజాన్ని త‌ట్టుకోలేక వ‌సుధార మెంట‌ల్‌గా డిస్ట్ర‌బ్ అయ్యింది ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది
దేవ‌యానిపై ఫైర్ అయిన వసుధారని కంట్రోల్ చేస్తుంది అనుపమ. 
ముకుల్: మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా రిషి చ‌నిపోయాడ‌న్న‌ది నిజ‌ం 
అది అబ‌ద్ధం అందుకు నా ఊపిరే సాక్ష్యం. రిషి ఎక్క‌డున్నా నేను వెతికి మీ ముందుకు తీసుకొస్తాన‌ని వ‌సుధార కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కూతురిని ఆప‌డానికి చ‌క్ర‌పాణి ప్ర‌య‌త్నిస్తాడు. ఇంత‌లోనే రిషి చ‌నిపోయాడ‌నే నిజాన్ని త‌ట్టుకోలేక ఫ‌ణీంద్ర గుండెనొప్పితో కుప్ప‌కూలిపోతాడు.

Also Read: ఈ రాశివారు ఏ విషయంలోనూ రాజీపడేందుకు ఇష్టపడరు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు

ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వ‌సుధార ఓ చోట కూర్చుంటుంది. లోక‌మంతా ఏక‌మైనా, దేవుడే దిగి వ‌చ్చినా రిషి చ‌నిపోయాడంటే న‌మ్మ‌కూడ‌ద‌ని  ఫిక్స‌వుతుంది. అక్కడ రాజీవ్ ప్రత్యక్షమవుతాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు నిన్ను చూసే అదృష్టం ద‌క్కింది మై డియ‌ర్ మ‌ర‌ద‌లు పిల్లా అంటూ టార్చర్ మొదలెడతాడు. 
వసుధార: మ‌ళ్లీ ఎందుకొచ్చావ్‌, ఎందుకు నా వెంట ప‌డుతున్నావ్
రాజీవ్: క‌ష్టంలో ఉన్నావ‌ని అర్థ‌మైంది, ప్రేమ‌, ఆప్యాయ‌త‌తో నిన్ను ప‌ల‌క‌రిద్దామ‌ని వ‌చ్చాన‌ు. రిషి చ‌నిపోయాడంట క‌దా...బంగారం లాంటి మ‌నిషి అని 
వసు: రిషి చ‌నిపోలేదు. బ‌తికే ఉన్నారు
రాజీవ్: నువ్వు తోడు లేని ఒంట‌రిదానివి...నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి . నీ గుండెల్లో బాధ తీరిపోయేవ‌ర‌కు క‌న్నీళ్లు పెట్టుకో. కానీ ఒంట‌రిగా ఉండాల‌ని మాత్రం అనుకోకు. నీకు తోడుగా నేనుంటాన‌ు. నువ్వు ఓకే అంటే నీ మెడ‌లో తాళి క‌డ‌తా అంటూ తాళిబొట్టు తీసి చూపిస్తాడు 
వసు: నువ్వు మ‌నిషివేనా ఎదుటివాళ్ల ప‌రిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నావ్ . ఇంకోసారి ప్రేమ‌, గీమా అంటూ నా వెంట ప‌డకు వసు చేయి పట్టుకున్న రాజీవ్ చెంప పగలగొడుతుంది...అది పట్టించుకోకుండా వసుధారని లాక్కెళుతుంటాడు.. ఇంతలో కారులోంచి దిగిన ఓ వ్యక్తి రాజీవ్ ను ఆపుతాడు...తను ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్....
ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Embed widget