Guppedantha Manasu Serial Going To End : మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!
సీరియస్ లెక్చరర్-సెల్ఫ్ రెస్పెక్ట్ స్టూడెంట్ మధ్య అందమైన ప్రేమకథగా మొదలైన గుప్పెడంత మనసు ప్రస్తుతానికి కిడ్నాప్ మిస్టరీగా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. 1000 ఎపిసోడ్ తో శుభం కార్డ్ ఖాయమా!
Guppedantha Manasu Serial Going To End
జెంటిల్మెన్ లా ఉండే లెక్చరర్ రిషి
తెలివైన ఆత్మవిశ్వాసం నిండిన స్టూడెంట్ వసు
ఇద్దరి మధ్యా గిల్లి కజ్జాలు, పోటాపోటీ తగాదాలు...
కాలేజీ నుంచి ఎలాగైనా పంపించాలని లెక్చరర్ - ఇక్కడే ఉండి తీరాలని స్టూడెంట్... ఆ ప్రయత్నాల్లోనే ప్రేమలో పడిపోతారు.. కానీ ఆ విషయం ఇధ్దరికీ తెలియదు.
అప్పటి నుంచి మొదలైన అల్లరి తగాదాలు రాను రాను చిలిపి తగాదాలుగా మారాయ్..
ఇష్టాన్ని ఎలా బయటపెట్టుకోవాలో తెలియక సతమతం అవుతారు
ఎట్టకేలకు లెక్చరర్ తన మనసులో మాట బయటపెడితే...మీకు ఈగో ఎక్కువ మీ మాట నమ్మను మీకు క్లారిటీ లేదని కొట్టిపడేస్తుంది స్టూడెంట్
ఆ తర్వాత తనూ ప్రేమలో ఉన్న విషయం తెలుసుకుని ఎలా బయటపెట్టాలో అర్థంకాక తిప్పలు పడుతుంది
ఎన్నో ట్విస్టుల మధ్య ప్రేమను చెప్పుకుంటే..పెళ్లివెనుక వరుస ట్విస్టులు... ఎట్టకేలకు జగతి చావుతో ఇద్దరి పెళ్లి జరిగింది...
కార్తీకదీపంలో డాక్టర్ బాబు-వంటలక్క కలవాలని ఎంతమంది ప్రేక్షకులు కోరుకున్నారో రిషి-వసుధార ఒక్కటవ్వాలని అలానే కోరుకున్నారు.
Also Read: రొమాంటిక్ స్టోరీని క్రైమ్ స్టోరీ చేసిపడేశారు - రిషి ఇక రాడా!
కార్తీకదీపం లానే చేస్తారా!
కార్తీకదీపం తర్వాత ఆ రేంజ్ లో వెలిగిన మరో సీరియల్ గుప్పెడంత మనసు. కానీ ఈ వెలుగు ఇప్పుడు పూర్తిగా మసకబారిందంటున్నారు ప్రేక్షకులు. ఓ రేంజ్ లో వెలిగిన కార్తీకదీపం సీరియల్ ని ఓ సరైన ఎండింగ్ లేకుండా మళ్లీ కలుద్దాం అని క్లోజ్ చేసేశారు. గృహలక్ష్మి, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ క్లైమాక్స్ కూడా మమ అనిపించాయి. అప్పట్లో వచ్చిన కంటే కూతుర్నే కనాలి, మల్లీశ్వరి, సంచలనం సృష్టించిన ఆమెకథ సీరియల్ ది ఇదే పరిస్థితి. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా అదే తప్పేలా లేదేమో అంటున్నారు ప్రేక్షకులు .
రిషి లేకుండా అస్సలు కుదరదు
సీరియల్ కి రిషీంద్రభూషణ్, వసుధార క్యారెక్టర్స్ ప్రాణం...ఆ తర్వాత జగతి,మహేంద్ర..విలన్ ఎలాగూ ఉండాలి కాబట్టి దేవయాని ఆమెను కంట్రోల్ చేసే క్యారెక్టర్లో ఫణీంద్ర. ఇక మధ్య మధ్యలో వెళ్లిపోయిన గౌతమ్, సాక్షి, ఏంజెల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నన్ని రోజులు మాత్రం అదుర్స్ అనిపించాయి. సీరియల్ లోకి ఎవరొచ్చినా వెళ్లినా రిషి-వసుధార స్క్రీన్ పై కనిపిస్తే చాలన్నది గుప్పెడంత మనసు అభిమానుల ఫీలింగ్. కానీ దాదాపు 3 నెలలుగా రిషి క్యారెక్టర్ కనిపించడం లేదు. ఆ మధ్య జిమ్ లో ఏదో గాయపడ్డాడు అందుకే బ్రేక్ తీసుకున్నాడనే వార్తలొచ్చాయి...ఆ తర్వాత ఓ సినిమాతో బిజీగా ఉన్నాడంటున్నారు. ఇంతకీ రిషి వస్తాడా రాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్
Also Read: వసుధార ఎండీ సీటుకి ఎసరు - శైలేంద్ర అరాచకం పీక్స్!
1000 ఎపిసోడ్స్ తో శుభం కార్డ్
ఫిబ్రవరి 1 వ తేదీకి గుప్పెడంత మనసు 988 ఎపిసోడ్...అంటే మరో 12 ఎపిసోడ్స్ తో 1000 అవుతాయి. ఆ రోజులో గుప్పెడంత మనసుకి శుభం కార్డ్ వేస్తారన్నది టాక్. అయితే ఈ లోగా రిషి వస్తాడా రాడా అన్నదే ప్రేక్షకుల డిస్కషన్. రిషి ప్లేస్ లో కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారనే ప్రచారం జరిగింది కానీ అలా జరిగితే సీరియల్ కి ఇప్పటికే తగ్గిన ఫాలోవర్స్ ఇంకా తగ్గిపోతారన్నది మాత్రం పక్కా. ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి లుక్, స్టైల్, ఆటిట్యూడ్, డిగ్నిటీ ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. రిషి లేకుండా ఒక్క రోజు కూడా నడపడం కష్టమే ... అందుకే లేడు అనకుండా రీప్లేస్ చేయకుండా రెండు నెలలుగా కిడ్నాప్ డ్రామా మొదలెట్టారు. అది కూడా ప్రస్తుతానికి ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది.
జగతిని చంపేసినప్పటి నుంచి పతనం ప్రారంభం
‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కి ఆడియన్స్‌కి అంత చేరువైందంటే రిషి, వసుల ప్రేమకథతో పాటు.. జగతి మదర్ సెంటిమెంట్ కూడా కీలకం. కార్తీకదీపం సౌందర్య తర్వాత ఆ రేంజ్ లో ప్రేక్షకులకు చేరువైన క్యారెక్టర్ జగతి. ఆమె వెబ్ సిరీస్, సినిమాలతో బిజీ అవడంతో సడెన్‌గా జగతి పాత్రను చంపేసి కథ నుంచి తప్పించేశారు. ఎప్పుడైతే జగతి పాత్రను ‘గుప్పెడంత మనసు’ తప్పించారో.. అప్పటి నుంచి ఈ సీరియల్ పతనం ప్రారంభమైంది. అలా అలా ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నానికి టైమ్ మారింది.
Also Read: క్లైమాక్స్ చేరిన కథని మళ్లీ మలుపు తిప్పిన శైలేంద్ర, ఈ సారి రిషిని కిడ్నాప్ వెనుక!
కథ కాదు క్యారెక్టర్సే ప్రధానమైన సీరియల్ ఇది
ఏ సీరియల్ కి అయినా కథ ప్రధానం అయితే..గుప్పెడంత మనసుకి క్యారెక్టర్ ప్రధానం. రిషి-వసుధార అనే క్యారెక్టర్స్‌లో వాళ్లిద్దర్నీ తప్ప వేరే వాళ్లని ఊహించుకోలేం. మిగితా సీరియల్స్ లా వీళ్లను తీసేసి వేరేవాళ్లని పెడతామంటే కుదరదు..అంత బలంగా నాటుకుపోయాయి ఆ రెండు పాత్రలు. అందుకే రిషి ప్లేస్ లో కొత్త కుర్రాడు వచ్చేదే లే...ఎప్పటికైనా రిషి వస్తాడని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. రొమాంటిక్ గా నడిచిన కథని ఇప్పుడు కిడ్నాప్ డ్రామాగా, క్రైమ్ మిస్టరీగా మార్చేశారు. పరిస్థితి చూస్తుంటే మరో 12 ఎపిసోడ్స్ లాగించి...ఆఖర్లో రిషిని ఇలా చూపించి అలా కథకు శుభం కార్డ్ వేస్తారని టాక్. కాదు కూడదు అని రిషి ప్లేస్ లో కొత్త క్యారెక్టర్ దింపితే మరికొన్నాళ్లు సాగదీత తప్పదు...ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. గొప్పగా వెలిగి తుస్సుమన్న జాబితాలో గుప్పెడంతమనసు సీరియల్ చేరిపోవడమూ తప్పదు... వెయిట్ అండ్ సీ...