అన్వేషించండి

Guppedantha Manasu January 31st Episode: వసుధార ఎండీ సీటుకి ఎసరు - శైలేంద్ర అరాచకం పీక్స్!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 31st Episode:  (గుప్పెడంతమనసు జనవరి 31 ఎపిసోడ్)

రిషి ఏమ‌య్యాడో తెలియ‌క వ‌సుధార బాధపడుతుంది..కోపంగా తన రూమ్ లో ఉన్న వస్తువులు  కిందపడేస్తుంది. అక్కడకు వస్తారు మహేంద్ర, అనుపమ
వసుధార: నాకు రిషి కావాల‌ి, ఆయన ఎక్కడున్నారు, ఏమైపోయారో...నేను అవ‌స‌రంగా రిషిని కాలేజీకి తీసుకు ర‌మ్మ‌న్నాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. లేదంటే పెద్ద‌య్య ద‌గ్గ‌రే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సంతోషంగా ఉండేవారు.
మహేంద్ర: రిషి కాలేజీకి వ‌స్తే బాగుంటుంద‌ని నీతో పాటు అంద‌రూ అనుకున్నారు. కానీ మ‌నం ఒక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌లిచాడ‌ు
అనుపమ: రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్ర కాదు..ఫోన్లో వీడియో మిస్ అయింది.. ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు..
మహేంద్ర: ఒకవేళ దేవయాని వదిన అనుకుందాం అంటే..ఆమె ఆ టైమ్ లో కాలేజీలో లేరు, మరి ఫోన్లో వీడియో ఎవరు డిలీట్ చేసి ఉంటారు
వ‌సుధార‌, మ‌హేంద్ర‌, అనుప‌మ మాటాల్ని కిటికీ పక్కనుంచి వించాడు భద్ర
మహేంద్ర: నీ ఫోన్ ఎవరు తీశారు? నువ్వు చార్జింగ్ పెట్టినప్పుడు ఏమైనా ఎవరైనా డిలీట్ చేసి ఉంటారా..మనింట్లోకి వచ్చి ఎవరు చేసి ఉంటారు?
వసుధార: భ‌ద్ర‌నే త‌న ఫోన్‌లోని సాక్ష్యాల‌ను మిస్ చేసిన‌ట్లు వ‌సుధార ఫిక్స‌వుతుంది. త‌న‌కు ఎవ‌రూ లేర‌ని అంటుంటాడు. కానీ ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. భ‌ద్ర‌ ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే తను శైలేంద్ర మ‌నిషినేన‌ని అనిపిస్తోంది. 
వ‌సుధార మాట‌ల‌తో భ‌ద్ర షాక‌వుతాడు. వ‌సుధార‌కు త‌న‌పై అనుమానం బ‌ల‌ప‌డ‌టంతో వీలైనంత తొంద‌ర‌గా వ‌సుధార అడ్డు తొల‌గించుకుని ఇక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని అనుకుంటాడు.

Also Read: క్లైమాక్స్ చేరిన కథని మళ్లీ మలుపు తిప్పిన శైలేంద్ర, ఈ సారి రిషిని కిడ్నాప్ వెనుక!

శైలేంద్ర-భద్ర

శైలేంద్ర‌కు ఫోన్ చేసి వ‌సుధార వాళ్ల‌కు నాపై డౌట్ వ‌చ్చింద‌ని చెబుతాడు భ‌ద్ర‌. అనుమానం రాకుండా ఏది చేయ‌లేవా భ‌ద్ర‌కు అంటూ క్లాస్ పీకుతాడు. శైలేంద్ర‌. సినిమాలు చూసి నేర్చుకోమ‌ని స‌ల‌హాలు ఇస్తాడు. సినిమాలు వేరు, రియ‌ల్ లైఫ్ వేరు అంటూ శైలేంద్ర‌కు గ‌ట్టిగా రిప్లై ఇస్తాడు భద్ర. సీక్రెట్ ఏజెంట్స్ ఎలా ఉంటారన్న విషయంపై ఇద్దరూ డిస్కస్ చేసుకుంటూ సెటైర్స్ వేసుకుంటారు. ఇంట్లోనే ఉండి కిచెన్‌లో ఏం మాట్లాడుకుంటున్నార‌నే ప‌నులు సీక్రెట్ ఏజెంట్స్ చేయ‌రంటూ శైలేంద్ర‌కు కౌంట‌ర్ ఇస్తాడు. న‌న్ను ఇత‌రుల‌తో కంపేర్ చేసి త‌క్కువ చేయ‌ద్దు  అంటాడు. చిన్నమాట అంటే ఫీలైపోతావ్..మరి పనులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి కదా అని మరింత రెచ్చగొడతాడు. ఇప్పుడు నీపై వాళ్లకి అనుమానం వచ్చింది కదా... వ‌సుధార యాక్ష‌న్ తీసుకునేలోపు నువ్వే ఏదో ఒక రియాక్ష‌న్ తీసుకో ఈ రోజే వ‌సుధారను షినిష్ చేయ‌మ‌ని చెబుతాడు.  ఆల‌స్యం చేస్తే నువ్వే, నేను తోడు దొంగ‌లం అని ఈజీగా ప‌ట్టేసుకుంటార‌ని భ‌ద్ర‌కు చెబుతాడు శైలేంద్ర‌. ఇక వసుధారని చంపేయాలని ఫిక్సవుతాడు భద్ర. మరోవైపు త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్న భ‌ద్ర త‌న‌కే నీతులు చెబుతుండ‌టంతో శైలేంద్ర త‌ట్టుకోలేక‌పోతాడు. ప‌ని పూర్త‌య్యే వ‌ర‌కు సెలైంట్‌గా ఉండాల‌ని అనుకుంటాడు.

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మరోసారి రిషి కిడ్నాప్ - స్పృహ తప్పి పడిపోయిన వసుధార

కాలేజీలో స్టూడెంట్స్ గొడవ

రిషి రావాలి, క్లాస్‌లు చెప్పాలి అంటూ కాలేజీ గ్రౌండ్‌లోకి వ‌చ్చి స్టూడెంట్స్ గొడవ చేస్తారు. రిషి వ‌చ్చే వ‌ర‌కు తాము క్లాస్‌ల‌కు అటెండ్ అయ్యేది లేద‌ని చెబుతారు. శైలేంద్ర అక్క‌డే ఉన్నా గొడ‌వ‌ను ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డు. స్టూడెంట్స్‌ను ఎంక‌రేజ్ చేస్తూ గొడ‌వ‌ను పెద్ద‌ది చేస్తుంటాడు.
మిగిలిన లెక్చ‌ర‌ర్స్ గొడ‌వ‌ను ఆపేందుకు ప్ర‌య‌త్నించి త‌మ వ‌ల్ల కాక‌పోవ‌డంతో మ‌హేంద్ర‌కు ఫోన్ చేసి చెబుతారు. వ‌సుధార, మ‌హేంద్ర కాలేజీకి వ‌చ్చి స్టూడెంట్స్‌కు స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ వారి మాట‌ల‌ను స్టూడెంట్స్ విన‌రు. రిషి కాలేజీకి రావాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ‌తారు. సిల‌బ‌స్‌ కంప్లీట్ చేయ‌లేద‌ని, ల్యాబ్స్ క్లోజ్ అయ్యాయ‌ని త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం కావాలంటే రిషి రావాల్సిందేన‌ని అంటారు.

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

వసుధారపై మినిస్టర్ ఫైర్

గొడ‌వ గురించి తెలిసి మినిస్ట‌ర్‌, ఫ‌ణీంద్ర కూడా అక్క‌డికి వ‌స్తారు. వ‌చ్చి రావ‌డంతోనే వ‌సుధారకు క్లాస్ ఇస్తాడు మినిస్ట‌ర్‌. ఒక‌ప్పుడు ర్యాంకుల‌తో పేప‌ర్ల‌లో ఉన్న కాలేజీ ఇప్పుడు గొడ‌వ‌ల నిండిపోయింది. కాలేజీ చాలా ప‌త‌న‌మైపోయింది. అసలు రిషి రావడానికి ఏమైంది? అంతకుముందంటే సీక్రెట్ వర్క్ లో ఉన్నాడని చెప్పారు..ఇప్పుడెందుకు రాలేదు? కాలేజీ యూత్ ఫెస్టివల్ కి వస్తాడని చెప్పి ఎందుకు రాలేదు? ముందు రిషి ఎక్కడున్నాడో చెప్పు నేను మాట్లాడతాను? రిషికి కాల్ చేయి అని అడిగితే..ఆయన టచ్ లో లేరని చెపుతుంది వసుధార. ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు అంత సింపిల్ గా మాట్లాడుతున్నావేంటి అంటాడు మినిస్టర్. ఫ‌స్ట్ టైమ్ యూత్‌ఫెస్టివ‌ల్ ఫెయిలైంది...నువ్వు ఎండీగా ఉన్న‌ప్పుడే ఇలా జ‌రిగిందంటూ ఫైర్ అవుతాడు. 

మినిస్ట‌ర్ మాట‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా వ‌సుధార మౌనంగా ఉండిపోతుంది.
గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget