Guppedantha Manasu February 1st Episode: రొమాంటిక్ స్టోరీని క్రైమ్ స్టోరీ చేసిపడేశారు - రిషి ఇక రాడా!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు ఓ వైపు - రిషి కిడ్నాప్ డ్రామా మరోవైపు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 1st Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 1 ఎపిసోడ్)
రిషి రావాలంటూ కాలేజీ స్టూడెంట్స్ గొడవ చేస్తారు. శైలేంద్ర మరింత ఆజ్యం పోస్తాడు. మినిస్టర్ కూడా ఫస్ట్ టైమ్ వసుధారపై సీరియస్ అవుతాడు. అనుపమ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతానికి స్టూడెంట్స్ ని క్లాస్ కి పంపించండి..దీని గురించి డిస్కస్ చేద్దాం...ఓ నిర్ణయం తీసుకుని నోటీస్ బోర్డులో పెట్టిద్దాం అని మినిస్టర్ హామీ ఇస్తాడు. నినాదాలు చేయడానికి, వివాదాలు చేయడానికి ఇది సమయం కాదు స్టూడెంట్స్ అంటూ శైలేంద్ర ఓవరాక్షన్ చేస్తాడు. రిషి సర్ కోసం మీకు గొడవ చేయాలని ఉంటుంది, అల్లర్లు సృష్టించాలని ఉంటుంది కానీ సంయమనం పాటించండి ప్లీజ్ వెళ్లండి అంటాడు..స్టూడెంట్స్ అందరూ వెళ్లిపోతారు.
Also Read: వసుధార ఎండీ సీటుకి ఎసరు - శైలేంద్ర అరాచకం పీక్స్!
అందరూ కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చుంటారు..
రిషి కనిపించనప్పటి నుంచీ చాలామంది స్టాఫ్ కాలేజీకి రావడం లేదు..ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోకుంటే ఎలా, మంత్రిగా నాకు చాలా బాధ్యతలున్నాయి అవన్నీ వదిలేసి ఇక్కడకు ఎందుకొచ్చాను..డీబీఎస్టీ కాలేజీ మళ్లీ ఎప్పటిలా ఉండాలని అని క్లాస్ వేస్తాడు. అందరూ సరే అంటారు. మళ్లీ శైలేంద్ర స్టాఫ్ ద్వారా వసుధార ని నిందించే ప్రోగ్రామ్ పెడతాడు. కొందరు లెక్చరర్లను రెచ్చగొట్టి వసుని బ్లేమ్ చేస్తారు. అసలు వసుధార ఎండీగా వచ్చినప్పటి నుంచే ఈ సమస్యలు అని హడావుడి చేస్తారు. అనుపమ , మహేంద్ర ఏదో చెబుతారు కానీ లెక్చరర్లు పట్టించుకోరు. స్టూడెంట్స్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు సరే ...ఎగ్జామ్స్ సమయంలో గొడవ చేస్తే ఎలా? అసలు మనం పరీక్షలు సరిగ్గా నిర్వహించగలమా? ఎండీ బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఏం పట్టనట్టు ఉంటే ఎలా అని హడావుడి చేస్తారు.
అనుపమ: చిన్న చిన్న పొరపాట్లు ఏవో జరిగి ఉండొచ్చు మీరు వాటినిపెద్దవి చేసి తనని నిరుత్సాహపరచొద్దు
లెక్చరర్లు: ఇక్కడ లేడీస్, జెంట్స్ అని మేం ఆలోచించడం లేదు..స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాం అని మరింత రచ్చ చేస్తారు
ఒకప్పుడు కాలేజీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేదానిపై బోర్డ్ మీటింగ్స్ జరిగేవి...ఇప్పుడు గొడవలపై మాత్రమే బోర్డ్ మీటింగ్స్ జరుగుతున్నందుకు బాధగా ఉంది అనుకుంటుంది
Also Read: క్లైమాక్స్ చేరిన కథని మళ్లీ మలుపు తిప్పిన శైలేంద్ర, ఈ సారి రిషిని కిడ్నాప్ వెనుక!
మీరంతా వసుధార గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది. తను ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాలేజీపరువు మొత్తం పోయింది నాకు తెలుసు..
ఫణీంద్ర: శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావ్
శైలేంద్ర: వసుధార మేడం వల్ల నష్టం జరిగిందా అంటే నేనైతే ఎంతోకొంత జరిగిందనే చెప్పాలి..కానీ మనం తనవైపు నుంచి కూడా ఆలోచించాలి. ఇంతకు ముందు ఆమెకు ఎక్స్ పీరియన్స్ లేకపోవచ్చు, కేవలం మా ఫ్యామిలీ మెంబర్ అనే ఆసీట్లో కూర్చోబెట్టి ఉండొచ్చు, తనకి మనం సపోర్ట్ గా ఉండాలి
లెక్చరర్లు: ఇక కాలేజీ పరువు ప్రతిష్టలు పోతాయి
మహేంద్ర: వసుధార ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా చేసింది
లెక్చరర్లు: అసలు రిషి సర్ ని పిలిపిస్తే సమస్యలన్నీ పోతాయి కదా..ఓసారి రిషి సర్ ని పిలిపించమనండి...
మినిస్టర్: రిషి ఎక్కడున్నాడు..అసలు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లో లేడో చెప్పు..మహేంద్ర గారూ మీరు చెప్పండి..
మహేంద్ర: ఏమైపోయాడో తెలియదు సర్..మొన్నటి వరకూ మీ ప్రాజెక్టుపై వర్క్ చేశాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడో తెలియదు, తనచుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాటినుంచి తప్పించుకునే క్రమంలో మాక్కూడా కాంటాక్ట్ లో లేకుండా పోయాడు
మినిస్టర్: రిషి ఫోన్ కి డయల్ చేస్తారు మినిస్టర్..కానీ స్విచ్చాఫ్ అని వస్తోంది...సరే నేను డిపార్ట్ మెంట్ కి కాల్ చేసి కనుక్కుంటాను.రిషి వస్తే కానీ ఈ సమస్య ఓ కొలిక్కి రాదు
అప్పటి వరకూ ఎండీ బాధ్యతలు వేరేవాళ్లకి అప్పగిస్తే మంచిది సార్ అంటారు లెక్చరర్లు...
నీకు వేరే ఆప్షన్ లేదు వసుధార...ఆ సీట్ నాదే అనుకుంటాడు శైలేంద్ర...
Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం
శైలేంద్ర: రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ సరిగా జరగకపోవచ్చు, కాలేజీలో గొడవలు పెరగొచ్చు, కాలేజీ పరువు పేపర్ కి ఎక్కొచ్చు అంటూ.. తాను చేయబోయే అరాచకాలను ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తాడు
ఆమాటలు విని భయపడిన లెక్చరర్లు...వసుధారని ఎండీ సీట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు...
మినిస్టర్: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండీగా వసుధార కన్నా సమర్థులు నాకు ఎవ్వరూ నాకు కనిపించడం లేదు..ఇది నా అభిప్రాయం.. ఏమంటావ్ శైలేంద్ర...
శైలేంద్ర: షాక్ అయి..లోలోపల మండిపోతూ..బయటకు మాత్రం అదే కరెక్ట్ అంటాడు..
మినిస్టర్: రిషి గురించి నేను ఎంక్వైరీ చేస్తాను..రిషి వారం రోజుల్లో వస్తాడని నోటీస్ పెట్టండని జాగ్రత్తలు చెప్పి మినిస్టర్ వెళ్లిపోతారు...
శైలేంద్ర-రాజీవ్
ఎందుకు పిలిచావ్ అని రాజీవ్ అడిగితే..జాగ్రత్త అని చెబుదాం అని పిలిచానంటాడు. వెధవలకి, దొంగలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా అని రాజీవ్ అంటే..నీకు ఆ రెండి క్వాలిటీస్ తో పాటూ రొమాంటిక్ క్వాలిటీ కూడా ఉంది కదా అందుకే చెబుతున్నా అని హెచ్చరిస్తాడు. నా మరదలని చూడకుండా ఉండలేనని రాజీవే అంటే...అదే తగ్గించుకోమంటున్నా అని శైలేంద్ర...తగ్గేదే లే అని రాజీవ్ చెబుతాడు. అసలు అన్నీ అడిగాడు కానీ రిషి గురించి అడగలేదేంటి..అసలు వాడేమయ్యాడు అని రాజీవ్ అనుకుంటే.... ఇంతసేపూ మాట్లాడాడు కానీ రిషి గురించి చెప్పలేదు ఇంతకీ రిషిని ఎవరు తీసుకెళ్లారని శైలేంద్ర అనుకుంటారు..
మహేంద్ర-అనుపమ-వసు
కాలేజీలో జరిగిన రచ్చ గుర్తుచేసుకుని బాధపడతారు. రిషి కనిపించడం లేదని తెలిసి బాధపడకుండా బోర్డు మెంబర్స్ అందరూ ఎండీ పదవి గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. వాళ్ల మైండ్ ని శైలేంద్ర పొల్యూట్ చేస్తున్నాడు అంటుంది. ఆ శైలేంద్రకి కావాల్సింది ఎండీ సీట్ దానికోసం వాడు ఎంతకైనా దిగజారుతాడు అంటుంది వసుధార
ఎపిసోడ్ ముగిసింది....