(Source: ECI/ABP News/ABP Majha)
Guppedantha Manasu February 27th Episode: టామ్ & జెర్రీ లా వసు , మను - రిషి కర్మకాండలు జరగకుండా మను అడ్డుకోగలడా!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 27th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 27 ఎపిసోడ్)
రిషికి కర్మకాండలు జరిపించాలని ఫణీంద్ర నిర్ణయిస్తాడు. అన్నయ్య నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించిన మహేంద్ర...ఆ తర్వాత ఒప్పుకుంటాడు. కాలేజీకి వచ్చిన మహేంద్రని అనుపమ, వసుధార ప్రశ్నించినా నిజం చెప్పడు. అన్నయ్యకు హెల్త్ బాలేదని వెళ్లనాని అబద్ధం చెబుతాడు. మహేంద్ర అబద్ధం చెబుతున్నాడని వసుధారకి అర్థమవుతుంది...ధరణికి కాల్ చేస్తే నిజం తెలుస్తుందని ఫిక్సవుతుంది. కానీ ధరణి ఫోన్ శైలేంద్ర లాగేసుకుంటాడు కదా...ధరణి ఫోన్ కాలేజీలో రింగ్ అవడంతో వెనక్కు తిరిగి చూస్తే శైలేంద్ర కనిపిస్తాడు. ఏంటి ఎందుకు కాల్ చేశావని అడుగుతాడు.
వసు: వేరేవాళ్లకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకూడదన్న సెన్స్ తెలీదా
శైలేంద్ర: మా ఆవిడ ఫోనే కదా ..ఇంతకీ మా ఆవిడకు ఎందుకు ఫోన్ చేశావ్..ఏవైనా వంటింటి చిట్కాలు తెలుసుకుందామని కాల్ చేశావా ఏవైనా వంటింటి చిట్కాలు తెలుసుకుందామని కాల్ చేశావా..అవే అయితే ధరణి ఖచ్చితంగా చెబుతుంది
వసు: మళ్లీ ఏం ప్లాన్ చేస్తున్నారు
శైలేంద్ర: ప్లాన్ అయితే బాబాయ్‌తో ఎందుకు డిస్కస్ చేస్తాం..అయినా ఎందుకు పిలిపించామో బాబాయ్ మరోసారి అడగలేకపోయావా.. ఓ అడిగినా బాబాయ్ చెప్పడు కదా అని విషయం దాచిపెడుతూ వసుధార టెన్షన్ పెంచుతాడు.
వసు: మళ్లీ ఎవరి ప్రాణాలను తీయాలని అనుకుంటున్నారు...మామయ్యను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా
శైలేంద్ర: ప్రాణాలు పోయిన వాళ్ల గురించి ఆలోచిస్తాం కానీ ఉన్నవాళ్ల ప్రాణాలు తీయం అని చెప్పేసి వెళ్లిపోతాడు...
Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషికి కర్మకాండలు జరిపిస్తానన్న ఫణీంద్ర - వసుధారను ఇరకాటంలో పెట్టిన మను
మహేంద్ర, వసుధార మధ్య మనస్పర్థలు సృష్టించడానికి దేవయాని, శైలేంద్ర చేస్తోన్న కుట్రలను ధరణి తట్టుకోలేకపోతుంది. రిషి కర్మకాండలు జరిగితే వసుధార, మహేంద్ర మధ్య గొడవలు జరగడం ఖాయమని భయపడుతుంది. వసుధారకు ఈ విషయం చెప్పాలని అనుకున్నా తన దగ్గర ఫోన్ లేకపోవడంతో కుదరదు. దేవయాని ఫోన్ హాల్‌లో కనిపిస్తుంది. దేవయాని ఫోన్ తీసుకుని వసుధారకు అన్ని విషయాల చెప్పాలని ధరణి అనుకుంటుంది. ఫోన్‌లో నంబర్ డయల్ చేయబోతుండగా సడెన్‌గా దేవయాని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ధరణి చేతులోని ఫోన్ లాక్కుంటుంది.
దేవయాని: నువ్వు దొంగచాటుగా వసుధారకు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. అందుకే ఫోన్ ఇక్కడ పెట్టాను. నీకు కొంచెం కూడా భయం లేదా? మా మాట అంటే లెక్కలేదా
ధరణి: రిషికి కర్మకాండలు జరిపిస్తే వసుధార తట్టుకోలేదు చాలా గొడవలు అవుతాయి
దేవయాని: గొడవలు జరగాలనే మేము ఇదంతా చేస్తున్నాం
ధరణి: రిషి కోసమే వసుధార బతుకుతోంది..తనకి కర్మకాండలు జరిపిస్తే వసుధార గుండె పగిలిపోతుందని ధరణి ఎమోషనల్ అవుతుంది. రిషి కర్మకాండలు జరిపించకుండా చేయండి
దేవయాని: ఈ దెబ్బతో వసుధార ఛాప్టర్ క్లోజ్ కావడం ఖాయమని సంబరపడుతుంది
ధరణి: అత్తయ్యా అని గట్టిగా అరుస్తుంది
దేవయాని: నోరు ఎత్తావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నా కొడుకు కోసం నువ్వు ఎన్ని వెటకారాలు అడినా నిన్ను భరిస్తున్నాను. దేవయాని ఒక్కసారి కన్నెర్ర చేసింది అంటే భస్మమైపోతావు. ఇక నుంచి అయినా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు. హద్దు మీరి మా విషయంలో జోక్యం చేసుకుంటే కోడలివి అని కూడా చూడను
ధరణి వెనక్కు తగ్గుతుంది...
Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
మను-వసు
ఏం డిసైడ్ అయ్యారని మనుని అడుగుతుంది వసు. ఆ విషయంలో డిసైడ్ అయ్యేది ఏముంది నా పాయింట్ ఏంటో క్లియర్ గా చెప్పాను. మీరు సంతకం పెట్టారంటే ఆ ఫైల్లో ఏ సమస్యా లేదని అర్థం చేసుకోగలను అందుకే మీరు సంతకం పెట్టాకే నేను సంతకం పెడతాను అంటున్నా. అందులో వేరే ఆలోచించేది లేదని క్లారిటీ ఇస్తాడు మను. మీ రీజన్ కరెక్టుగా లేదనే కదా మళ్లీ ఆలోచించుకోమని చెప్పానని గుర్తుచేస్తుంది వసు. మీరు చేసింది తప్పని రియలైజ్ అయితే సరిపోతుంది నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదంటే...నేనుకూడా మీకు సారీ చెప్పాలని అనుకోవడం లేదంటాడు మను... వసు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది...
మహేంద్ర - వసుధార
ఫణీంద్ర చెప్పిన మాటలు పదే పదే గుర్తురావడంతో మహేంద్ర బాధపడుతుంచాడు. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార.. ఫణీంద్ర ఇంటికి వెళ్లినప్పటి నుంచి మీలో మార్పు కనిపిస్తుందని మహేంద్రతో అంటుంది. మీరు దేని గురించి బాధపడుతున్నారని, భయపడుతున్నారని, ఆ నిజం ఏమిటో నాకు తెలియాలని అంటుంది. నాకు తెలిస్తే నేను ఏమైపోతాననో మీరు కంగారు పడుతున్నారని, తనకేం కాదని వసుధార అంటుంది. ఎంత అడిగినా మహేంద్ర మాత్రం నిజం చెప్పడు. శైలేంద్ర తనతో మాట్లాడిన విషయాలు మహేంద్రకి చెబుతుంది వసుధార. అంటే తనని ఇరికించేందుకు కావాలనే శైలేంద్ర అలా చేశాడని మహేంద్రకి అర్థమవుతుంది. నీకు, నాకు మధ్య మనస్పర్థలు రావాలని, గొడవలు జరగాలని శైలేంద్ర నాటకాలు ఆడుతున్నాడని, నేను ఏం చేసినా అది నీ కోసం రిషి కోసం...అది నువ్వు నమ్మితే చాలని వసుధారతో అంటాడు మహేంద్ర. తన దగ్గర ఏదో దాస్తున్నారని మాత్రం వసుధార ఫిక్సవుతుంది...
Also Read: ఈ రాశులవారు పని ఒత్తిడి తగ్గించుకోవాలి, ఫిబ్రవరి 27 రాశిఫలాలు
ఫణీంద్ర అవేదన
రిషి కర్మకాండలను సవ్యంగా పూర్తిచేయాలని దేవయానితో చెబుతాడు ఫణీంద్ర. ఆ ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూసుకోమని అంటాడు. రిషిని తలుచుకుని ఫణీంద్ర ఎమోషనల్ అవుతాడు. పిల్లపాపలతో సంతోషంగా కళకళలాడాల్సిన ఇళ్లు...ఇలా శోకంలో మునిగిపోయిందని అంటాడు. రిషి మన ఫ్యామిలీకి అండ. సమాజంలో మన కుటుంబానికి పేరుప్రఖ్యాతుల ఉండటానికి, డీబీఎస్‌టీ కాలేజీ ఈ స్థాయికి చేరుకోవడానికి రిషి చేసిన కృషి కారణం.. ఎప్పుడూ ఇతరుల సంతోషమే తన సంతోషం అనుకున్నాడని చెబుతూ ఫణీంద్ర ఏమోషనల్ అవుతాడు. రిషి ఎంతో మంది స్టూడెంట్స్‌కు బంగారు భవిష్యత్తు కల్పించాడు. ఎన్నో మంచి పనులు చేశాడని రిషి గొప్పతనం గుర్తుచేసుకుంటాడు ఫణీంద్ర. రిషి లేడనే బెంగతో తాను ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టడం ఖాయమని అంటాడు. ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన ధరణి...రిషి చావుకు శైలేంద్ర, దేవయాని కారణమని చెప్పాలని అనుకుంటుంది. కానీ అది గమనించిన దేవయాని అడ్డుకుంటుంది...రిషి పోయిన దగ్గర నుంచి నా బాధ మొత్తం ధరణి దగ్గర వెళ్లగక్కుకున్నానని, ఆ విషయమే మీతో చెప్పాలనిధరణి అనుకుంటుందని టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...