అన్వేషించండి

Guppedantha Manasu December 8th Episode: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 8th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 8 ఎపిసోడ్)

రిషి కనిపించకపోవడంతో మహేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అనుపమ కూల్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో ముకుల్ అక్కడకు వస్తాడు.
ముకుల్: నాకు ఈ విష‌యం ముందుగానే చెబితే బాగుండేద‌ని, ఇన్వేస్టిగేష‌న్ స్పీడ‌ప్ చేసేవాడిన‌ని మ‌హేంద్ర‌తో అంటాడు. జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మీ ఫ్యామిలీలో ఏదో కుట్ర జ‌రుగుతుంద‌ని, అది ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో ఏంటో అన్న‌ది అస‌లు అర్థం కావ‌డం లేదు. శైలేంద్ర మీద అనుమానం వ‌చ్చి ఇన్వేస్టిగేష‌న్ చేయాల‌ని అనుకున్న టైమ్‌లోనే అత‌డిపై ఎటాక్ జ‌ర‌గ‌డం, రిషి క‌నిపించ‌కుండాపోవ‌డం...ఈ రెండింటికి ఏదో లింక్ ఉంద‌ని అనిపిస్తుంద‌ని ముకుల్ అంటాడు. 
అనుపమ: శైలేంద్ర‌పై అనుమానం ఏంట‌ి
ముకుల్: జ‌గ‌తి మేడ‌మ్ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన అనుమానితుడు శైలేంద్ర‌నే ..తనని ఇంట‌రాగేష‌న్ చేయ‌డానికి హాస్పిట‌ల్‌కకు వెళ్లినా దేవ‌యాని అందుకు ఒప్పుకోలేద‌ని అనుప‌మ‌కు చెబుతాడు ముకుల్‌. 
ముకుల్; శైలేంద్ర కోలుకుంటేనే ఈ కుట్ర‌ల‌న్నింటిపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అత‌డి కండీష‌న్ ఎలా ఉందో క‌నుక్కొని చెప్ప‌మ‌ని మ‌హేంద్ర‌ను కోరుతాడు ముకుల్‌.
ఇప్పుడు హాస్పిటల్ కి వెళుతున్నాం...కనుక్కుని చెబుతాంటాడు మహేంద్ర...

Also Read: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!

మ‌హేంద్ర‌తో క‌లిసి హాస్పిట‌ల్‌కు వెళ్లిన అనుపమని చూసి కంగారుపడుతుంది దేవయాని.  వ‌చ్చి రావ‌డంతోనే శైలేంద్ర‌ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని దేవ‌యానిని అడుగుతుంది అనుప‌మ‌.ఎలా ఉన్నాడు? ఏమిటి, అత‌డి యోగ‌క్షేమాలు అడ‌గ‌కుండా డైరెక్ట్‌గా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నావ‌ని అడుగుతున్నావేంటి అని అనుప‌మ‌పై రుస‌రుస‌లాడుతుంది దేవ‌యాని.
అనుపమ: నేను బాగున్నాడా అని అడ‌గ్గానే బాగా లేని వాడు బాగ‌వుతాడా? బాగున్నావాడు బాగా లేకుండా పోతాడా? .. ఆ తర్వాత  డాక్టర్ తో శైలేంద్ర కండిషన్ గురించి మాట్లాడుతుంది...
డాక్టర్: శైలేంద్ర కండీష‌న్ బాగుంద‌ని ఈ రోజు డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంది
రిషి ఆచూకీ దొర‌క‌లేద‌ని, అత‌డు ఇంకా ఇంటికి తిరిగిరాలేద‌ని ఫ‌ణీంద్ర‌తో అంటాడు రిషి. దేవుడా ఏంటి నాకు ఈ ప‌రిస్థితి. నా ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను ఇలా ఎందుకు చేశావు. ఒక‌రు హాస్పిట‌ల్ బెడ్‌పై ఉన్నారు. మ‌రొక‌రు క‌నిపించ‌కుండాపోయావు అంటూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా నాట‌కం మొదలెడుతుంది దేవయాని.  రిషి కోసం వ‌సుధార వెతుకుతుంద‌ని ఫ‌ణీంద్ర‌తో చెబుతాడు మ‌హేంద్ర‌.
ఇంతలో మహేంద్రకి కాల్ చేసిన వసుదార...రిషికి తెలిసిన వాళ్లంద‌రికి ఫోన్ చేశాన‌ని, కానీ త‌మ ద‌గ్గ‌ర‌కు రిషి రాలేద‌ని వారంద‌రూ చెప్పార‌ని కంగారుప‌డుతుంది. రిషి క‌నిపించ‌డం లేద‌నే విష‌యం ముకుల్‌కు చెప్పాన‌ని, అత‌డి కూడా ఇన్వేస్టిగేష‌న్ చేస్తున్నాడ‌ని వ‌సుధార‌కు మ‌హేంద్ర ధైర్యం చెబుతాడు. శైలేంద్ర‌ను డిశ్చార్జ్ చేస్తున్నార‌ని, కిల్ల‌ర్‌తో అత‌డు మాట్లాడిన మాట‌ల‌పై ముకుల్ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌బోతున్నాడ‌ని, నువ్వు కూడా అక్క‌డికి వ‌చ్చేయ‌మ‌ని వ‌సుధార‌తో చెబుతాడు మ‌హేంద్ర‌.
శైలేంద్ర‌ను తీసుకుని ఇంటికి వెళతారు..గతంలో తనకు జరిగిన అవమానం తలుచుకుని మహేంద్ర లోపలకు అడుగుపెట్టడానికి ఆలోచిస్తాడు.  ఫ‌ణీంద్ర  లోపలకు రమ్మని పిలుస్తాడు

Also Read:  రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!

దేవయాని: ఎవ‌రు నా కొడుకు నాశ‌నం కోరుకున్నారో...ఏ పాడు క‌ళ్లు ప‌డ్డాయో ఏమో వాటి వ‌ల్ల నా కొడుకు హాస్పిట‌ల్ పాల‌య్యాడ‌ని దిష్టి తీసి లోప‌లికి ఆహ్వానిస్తే మంచిద‌ని దేవ‌యాని అంటుంది. ధ‌ర‌ణి చేతికి దెబ్బ త‌గ‌ల‌డంతో వ‌సుధార‌ను దిష్టి తీసియ‌మ‌ని దేవ‌యాని అంటుంది.
ఫణీంద్ర కూడా చెప్పడంతో వసుధార ఏమీ మాట్లాడలేక సరే అంటుంది...
వసుధార: జ‌గ‌తి మేడ‌మ్ ప్రాణాలు తీసిన నువ్వు మ‌ట్టి కొట్టుకొని పోతావ్ అంటూ హార‌తి ప‌ళ్లెంలోని అగ్రి సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాన‌ని మ‌న‌సులో అనుకుంటుంది వ‌సుధార‌. హార‌తి ప‌ళ్లెంలోని దిష్టి నీళ్లు కావాల‌నే దేవ‌యానిపై పోస్తుంది. కాలు తడబడ్డాయంటూ క్ష‌మాప‌ణ‌లు చెబుతుంది. 
దేవయాని: నువ్వు కావాల‌నే నాపై దిష్టి నీళ్లు పోశావ‌ని నాకు తెలుసు.. నా కొడుకు అంతు చూస్తాన‌ని, మా కుట్ర‌లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నావు. అలాంటి నువ్వే నా కొడుకుకు హార‌తి ఇచ్చి స్వాగ‌తం ప‌లికావు. ఇది శాంపిల్ మాత్ర‌మే ముందు ముందు చాలా జ‌రుగుతుంది. ప‌రిస్థితి మొత్తం మా కంట్రోల్‌లోనే ఉంది
వసు: ఎన్నాళ్లు త‌ప్పించుకుని తిరుగుతారు. తొంద‌ర‌లోనే మీ దుర్మార్గాలు మొత్తం బ‌య‌ట‌ప‌డాతాను
దేవయాని: రిషి క‌నిపించ‌డం లేద‌ట‌గా  అస‌లు ఎక్క‌డికి వెళ్లిన‌ట్లు...24 గంట‌ల గ‌డ‌చిని రాలేదంటే కొంప‌దీసి జ‌గ‌తికి జ‌రిగిన‌ట్లు రిషికి కూడా అంటూ ..
వసు: ఆమె మాట పూర్తిచేయ‌క‌ముందే వ‌సుధార ఫైర్ అవుతుంది. దేవ‌యానిని కొట్ట‌డానికి చెయ్యేత్తుతుంది. కానీ మా మేడ‌మ్ నేర్పిన సంస్కారం వ‌ల్ల చెయ్యి ఆగిపోయింది. నా భ‌ర్త గురించి ఇంకోసారి అప‌శుకునం మాట్లాడినా, కీడు కలిగిన మాటలు మాట్లాడినా నేను ఊరుకోను.  న‌న్ను ఏమైనా అంటే త‌ట్టుకుంటాను కానీ నా భ‌ర్త‌ను అంటే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇస్తుంది. ముకుల్ వ‌స్తున్నాడ‌ు..తన వద్ద సాక్ష్యం ఉంది. మీకు శిక్షపడే టైమ్ దగ్గరపడింది..
ఎపిసోడ్ ముగిసింది..

Also Read: రిషి ఎక్కడికి వెళ్లాడో క్లారిటీ వచ్చేసింది - అనుపమ గురించి మహేంద్ర టెన్షన్ - శైలేంద్ర అరాచకత్వం పీక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget