అన్వేషించండి

Guppedantha Manasu December 5th Episode:రిషి ఎక్కడికి వెళ్లాడో క్లారిటీ వచ్చేసింది - అనుపమ గురించి మహేంద్ర టెన్షన్ - శైలేంద్ర అరాచకత్వం పీక్స్!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 5th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 5 ఎపిసోడ్)

హాస్పిటల్లో ఉన్న మహేంద్రకు అనుపమ కాల్ చేస్తుంది. ఫస్ట్ కట్ చేసినా మళ్లీ లిఫ్ట్ చేస్తాడు. హాస్పిటల్లో ఎందుకున్నారని అడుగుతుంది కానీ మహేంద్ర చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించడు. తర్వాత చెబుతానేలే అని మహేంద్ర అంటే..అనుపమ ఇప్పుడే చెప్పాలని గట్టిగా అడుగుతుంది. 
మహేంద్ర: శైలేంద్రపై అటాక్ జరిగిందంట
అనుపమ: జరిగిందంట అంటావేంటి
మహేంద్ర: నేను చూడలేదు కదా..అందుకే జరిగిందంట అంటున్నాను..అప్పుడు ధరణి అక్కడే ఉంది..నీ ప్రశ్నలతో నన్ను విసిగించకు  అని కాల్ కట్ చేస్తాడు.. 
ముకుల్ కేసు డీల్ చేస్తున్నాడని తెలియడంతో తనని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటాను అనుకుంటుంది అనుపమ..

Also Read: డైలమాలో రిషి - క్లారిటీ ఇచ్చేందుకు వసు ప్రయత్నం - మొత్తం మార్చేసిన శైలేంద్ర!

శైలేంద్రతో మాట్లాడేందుకు వెళ్లిన దేవయాని తను నిద్రపోతున్నాడు అనుకుని వెళ్లిపోబోతుంటే...కూర్చో మామ్ అని ఆపుతాడు. నిద్రపోయావ్ అనుకున్నా అంటే..ఇదంతా నటన అని క్లారిటీ ఇస్తాడు శైలేంద్ర
దేవయాని: నీకేదో జరిగిందని భయంతో ఊపిరి బిగపట్టిఉన్నా..నువ్వు మాట్లాడిన తర్వాతే నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది..నీకేమైనా అయితే నేను బతకలేను
శైలేంద్ర: నాకేం కాలేదని చెప్పి..అదంతా తన డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తాడు...నువ్వు అందరకీ అనుమానం వచ్చేలా ప్రవర్తించకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను..అందరి ముందూ తొందరపడి నోరు జారకు. ఏదేదో మాట్లాడకు..నువ్విప్పుడు చేయాల్సింది కేవలం నాకోసం ఏడవడం తప్ప మరో పని చేయకు.నేను ఇంటికి వచ్చేవరకూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు..
దేవయాని: నీకు ఇంత జరిగినా కూడా రిషి రాలేదు..ఏదో పనిమీద బయటకు వెళ్లాడంట...నువ్వంటే చాలా ఇష్టం..నీకు ఇంత పెద్ద గాయాలయ్యాయని తెలిసి కూడా నిన్ను చూడకుండానే బయటకు వెళ్లాడంటే చాలా భయంగా ఉంది. ఆ వాయిస్ గురించి తెలుసుకునేందుకు వెళ్లాడేమో అనిపిస్తోంది. ఆ వాయిస్ నీదని తెలిసి రిషి షాక్ లోకి వెళ్లిపోయాడు..తన నోటి వెంట ఒక్కమాట కూడా రాలేదు..కచ్చితంగా నిజం తెలుసుకునేందుకే వెళ్లినట్టున్నాడు..జగతిని చంపింది నువ్వేఅని తెలిస్తే నిన్ను చంపేస్తాడు అనిపిస్తోంది..రోజులు దగ్గరపడ్డాయేమో అనిపిస్తోంది
శైలేంద్ర: పనిమీద బయటకు వెళ్లాడా..అయినా ప్రతి రోజూ మనదే..మనకు బ్యాడ్ టైమ్ ఎదురైనా దాన్ని గుడ్ టైమ్ గా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు..నువ్వు కంగారుపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు..ఏదిఏమైనా నువ్వు కోరుకున్నట్టే నేను ఎండీ సీట్లో కూర్చుంటాను..
దేవయాని: అసలు నీపై అటాక్ చేసిందెవరు
శైలేంద్ర: వాడు నాకే కాదు..నీక్కూడా తెలుసు...వాడిపేరు శైలేంద్ర..అని దేవయానికి షాక్ ఇస్తాడు. తన ఆడియో బయటకు వచ్చిందని తెలిసిందని..అందుకే నాపై నేనే అటాక్ చేయించుకుని అందర్నీ రూట్ మార్చానని చెబుతాడు.
ఇది దేవయానికి నిజంగా షాకే...
ధరణి మాత్రం శైలేంద్రని పూర్తిగా నమ్మేసింది... అప్పుడే అక్కడకు వచ్చి సారీ చెబుతుంది... ధరణి తమమాటలు వినలేదని క్లారిటీ రావడంతో దేవయాని కూడా లేని ప్రేమ నటిస్తుంది.. నేను అప్పటికీ బయటకు వెళ్లొద్దని చెప్పాను కానీ శైలేంద్ర నా మాటవినలేదంటుంది. నేను సంతోషంగా ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా అని ధరణి ఏమోషనల్ అవుతుంది... నేను ఆయన దగ్గరే ఉంటానంటుంది...దేవయాని వద్దు అని చెబుతుంటే...తను ఉంటానంటోంది కదా ఉండనివ్వు అంటాడు శైలేంద్ర.  ధరణి అక్కడే కూర్చుంటుంది.

Also Read: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - శైలేంద్ర నిజస్వరూపం మొత్తం రిషికి తెలిసిపోయింది

అనుపమ..ముకుల్ ని కలుస్తుంది...
శైలేంద్రపై ఎవరు అటాక్ చేశారని అడిగితే..మీకెవరు చెప్పారని అడుగుతాడు ముకుల్. వేరేవాళ్లు చెప్పారన్న అనుపమతో వాళ్లనే అడిగి తెలుసుకోండి. కేసు ఓ కొలిక్కి వచ్చేవరకూ బయటకు చెప్పకూడదు అనేస్తాడు. మీరెవరు అని అడిగితే నేను జర్నలిస్ట్ అంటుంది. అయితే మీరే తెలుసుకోండి అంటాడు కానీ క్లారిటీ మాత్రం ఇవ్వడు.
అనుపమ: మహేంద్ర, రిషి నాకు బాగా కావాల్సినవాళ్లు..వాళ్లింట్లో ఇలాంటి ఇన్సుడెంట్ జరిగిందంటే కచ్చితంగా తెలుసుకోవాలి.. కావాలంటే మీరు మహేంద్ర వాళ్లని అడగండి వాళ్ల పర్మిషన్ తోనే చెప్పండి
ముకుల్ వెంటనే మహేంద్రకి కాల్ చేసి అనుపమ గురించి చెబుతాడు..తను నాకు తెలుసు అని చెబుతాడు మహేంద్ర.  ఏంటి సార్ ఈవిడ డీటేల్స్ అడుగుతున్నారు చెప్పమంటారా అని ముకుల్ అడిగితే... తను మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన మనిషి..కానీ తను ఏం అడిగినా చెప్పొద్దు , ఆవిడ మిమ్మల్ని కలుస్తానన్నా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వొద్దని చెప్పేస్తాడు మహేంద్ర. 
ముకుల్: సార్ చెప్పొద్దు అన్నారు...సో నేను కూడా చెప్పదలుచుకోవడం లేదు..థ్యాంక్యూ అనేసి వెళ్లిపోతాడు..
అనుపమ ఫ్రస్టేట్ అవుతుంది... మీరు చెప్పినా చెప్పకపోయినా నేను కనుక్కునేది కనుక్కుంటా అనుకుంటుంది అనుపమ....
రిషిపై అరకులో అటాక్స్ జరిగాయి...రిషిని కాపాడే ప్రయత్నంలో జగతి ప్రాణాలు కోల్పోయిందిఅన్నారు...ఇప్పుడు శైలేంద్రపై అటాక్ జరిగింది.. దీనికి కారణం ఒక్కరేనా...
అటు మహేంద్ర...ఇందులో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే నీ ప్రాణానికే ప్రమాదం అనుపమా..జగతి నాకు భార్య మాత్రమే కాదు మంచి ఫ్రెండ్ కూడా...ఇప్పుడు నిన్ను కూడా కోల్పోలేను అనుకుంటాడు..
ఇంతలో ఫణీంద్ర వచ్చి జ్యూస్ ఇస్తాడు...నువ్వు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో అన్నా కానీ..మహేంద్ర ఉంటానంటాడు.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget