Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
![Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్! Guppedantha Manasu Serial December 7th Episode 940 Written Update Today Episode Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/bf42e72aa14ed672df031516aed575ca1701916405169217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedantha Manasu December 7th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 7 ఎపిసోడ్)
రిషి కనిపించడం లేదు. ఫోన్ స్విఛాఫ్ కావడం, అచూకీ గురించి ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఎమోషనల్ అవుతుంది వసుధార. వారిద్దరి పరిస్థితి అర్థం చేసుకోకుండా వసుధారను ప్రశ్నలతో అనుపమ ఇబ్బంది పెడుతుంది. అది చూసి మహేంద్ర ఫైర్ అవుతాడు. రిషి కనిపించకపోతే కూల్‌గా ఎలా ఉన్నావని మహేంద్రతో అంటుంది అనుపమ. పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. రిషి చిన్నపిల్లాడేం కాదు.. అప్పుడప్పుడు ఇలానే వెళ్లిపోయి రెండు మూడు రోజుల తర్వాత తిరిగొచ్చేవాడని...ఈ రోజు రాత్రికి వస్తాడేమో చూసి ఆ తర్వాత కంప్లైంట్ ఇద్దాం అంటాడు మహేంద్ర.
అనుపమ: జగతి లేని టైమ్‌లోనే అలా జరిగి ఉంటుంది జగతి ఉంటే రిషిని అలా బయటకు వెళ్లనిచ్చేది కాదు. వెళ్లినా అంత ఈజీగా వదలిపెట్టేది కాదు. బయటకు వెళ్లిన వాడు వస్తాడని ఆశతో ఎదురుచూడటం వేరు అని అంటుంది. ఎప్పుడస్తాడో అని కంగారుగా ఎదురుచూడటం వేరు. జగతి ఉన్నప్పుడు రిషి కోసం తను పడిన తాపత్రయం చూసి ఉంటే తన బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం ఏమిటో అర్థమయ్యేది . వసుధార చాలా టెన్షన్ పడుతోంది..ఆమె కోసమైనా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదని వసుధారతో అంటుంది. చాలా ధైర్యంగా మాట్లాడుతుంటావ్. ఎలాంటి సిట్యూవేషన్‌లోనైనా చాలా పాజిటివ్‌గా ఉంటావు. కానీ రిషి కనిపించకపోయేసరికి ఇలా దిగాలుపడటం నాకు నచ్చలేదని వసుధారకు ధైర్యం చెబుతుంది అనుపమ.
వసుధార: హాస్పిటల్ కి వెళ్లాడేమో అనే ఆలోచనలో పడిన వసుధార..మెసేజ్ మళ్లీ చదువుతుంది. ఎలాంటి క్లూ లభించదు. శైలేంద్రను చూడటానికి రిషి ఏమైనా హాస్పిటల్‌కు వెళ్లారా అనుకుని ఆలోచించి ధరణికి కాల్ చేసి అడుగుతుంది. కానీ అక్కడ రిషి లేడని తెలిసి మరింత కంగారు పడుతుంది.
Also Read: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!
రిషి కనిపించకుండా పోవడానికి, శైలేంద్ర మీద ఎటాక్ జరగడానికి ఏదైనా సంబంధం ఉందా అని మహేంద్రను అడుగుతుంది అనుపమ.
మహేంద్ర: నీతో ఏం మాట్లాడితే ఎలాంటి గొడవలు వస్తాయో. ఏదైనా తెలిస్తే నువ్వు కుదురుగా ఉండవని క్లాస్ పీకుతాడు. ఏ విషయమైనా ముందు వెనుక ఆలోచించి అడుగులు వేస్తే మంచిది
అనుపమ: అందుకేనా నన్ను హాస్పిటల్‌కు రావద్దని చెప్పావు. అందుకేనా శైలేంద్ర గురించి నాకు చెప్పలేదని మహేంద్రను నిలదీస్తుంది . ముకుల్‌కు ఫ్యామిలీ మెంబర్ అని నన్ను పరిచయం చేసి కేసు విషయాలు చెప్పద్దని ఎందుకు అన్నావని మహేంద్రను గట్టిగా అడుగుతుంది అనుపమ.
మహేంద్ర మౌనంగా ఉండిపోతాడు. రిషి మిస్సింగ్ గురించి ఆలోచించి అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి అనుపమ అక్కడినుంచి వెళ్లిపోతుంది.
దేవయాని - ఫణీంద్ర
ఫణీంద్ర దీర్ఘంగా ఆలోచించడంతో దేవయాని టెన్షన్ పడుతుంది. జగతి కేసు విషయంలో శైలేంద్ర వాయిస్ దొరకడం గురించే ఆలోచిస్తున్నాడేమోనని భయపడుతుంది. ఆమె ఊహించినందే జరుగుతుంది.జగతి మర్డర్ కేసు విషయంలో శైలేంద్ర వాయిస్ దొరకడం కలవరపెడుతుందని దేవయానితో అంటాడు ఫణీంద్ర. శైలేంద్ర హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అంటూ ఆలోచనను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంది. చట్టానికి నమ్మకాలతో పని లేదని సాక్ష్యాలు మాత్రమే కావాలని అంటాడు ఫణీంద్ర. ఇంతలో ధరణి వచ్చి రిషి కనిపించడం లేదని చెప్పడంతో కంగారు పడతాడు ఫణీంద్ర
ఉదయం లేవగానే రిషి వచ్చాడేమోనని ఇంట్లో వెతుకుతాడు మహేంద్ర. రిషితో పాటు వసుధార కూడా కనిపించదు. అప్పుడే అనుపమ ఎంట్రీ ఇస్తుంది. రిషి ఇంటికి రాలేదు. ఇప్పుడు వసుధార కూడా కనిపించడం లేదని మహేంద్ర భయపడతాడు. వసుధారకు ఫోన్ చేస్తాడు మహేంద్ర. వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి రిషి కోసం వెతుకుతున్నానని బదులిస్తుంది. నువ్వ కనిపించకుండాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా...గుండె ఆగినంతపనైందని మహేంద్ర అంటాడు. రిషి కోసం కాలేజీకితో పాటు కొన్ని ప్లేస్‌లకు వెళ్లానని ఎక్కడ కనిపించడం లేదని వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషి మిస్సింగ్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే మంచిదని మహేంద్ర కూడా నిర్ణయించుకుంటాడు. ముకుల్‌కు ఫోన్ చేస్తాడు. రిషి ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ స్విఛాఫ్ అని వస్తోందని ముకుల్‌తో చెబుతాడు మహేంద్ర. ఆ మాటలు విని ఆలోచనలో పడిన ముకుల్ ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు రిషి కోసం వెతుకుతుంటుంది వసుధార. తనకు తెలిసినవాళ్లందరికీ కాల్ చేసి కనుక్కుంటుంది వసుధార...ఎక్కడా రిషి ఉండడు...మరింత కంగారు పడుతుంది వసుధార...
Also Read: డైలమాలో రిషి - క్లారిటీ ఇచ్చేందుకు వసు ప్రయత్నం - మొత్తం మార్చేసిన శైలేంద్ర!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)