అన్వేషించండి

Guppedantha Manasu December 28th Episode: శైలేంద్ర ఎండీ సీట్ కి చెక్ పెట్టేసిన వసు, సమాచారం అందించే ఆలోచనలో రిషి!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి కిడ్నాప్ డ్రామా ఇంకా నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 28th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 28 ఎపిసోడ్)

భద్ర షెల్టర్ గురించి మహేంద్ర, అనుపమ, వసుధార మాట్లాడుకుంటూ ఉండగా..అక్కడకు వచ్చిన భద్ర..నా అకామిడేషన్ గురించి ఆలోచించవద్దు ఓ చాప ఇస్తే ఈ వరండాలో పడుకుంటాను లేదంటే కార్లో పడుకుంటానని చెబుతాడు. అయినా ఫుట్ పాత్ మీద పడుకునేవాడిని కొత్తగా నాకు ఏ కంఫర్ట్స్ ఉంటాయి చెప్పండి అని అడుగుతాడు...

దేవయాని-శైలేంద్ర

మళ్లీ ఇంకో రౌడీని పురమాయించావా..ఇప్పటికే చాలామందిని పురమాయించావు కానీ మధ్యలోనే చేయెత్తెస్తున్నారని దేవయాని టెన్షన్ పడుతుంది. ఇప్పటివరకూ వేరు ఈ సారి వేరు నా ఆలోచన కన్నా నాలుగు అడుగులు ముందుగా ఉన్నాడు..కొంచెం లేటైనా కానీ అన్ని శాల్తీలు గల్లంతు అయిపోతాయని గ్యారంటీ అని చెబుతాడు. వాడి పేరేంటి వాడిని చూడాలి అని దేవయాని అడిగితే..వాడి గురించి చెప్పాలి అనుకోవడం లేదనేస్తాడు శైలేంద్ర. మహేంద్ర వాళ్లింటికి వెళతానని దేవయాని అడిగితే..ఎందుకు వెళ్లి నన్ను ఇరికించడానికా అంటాడు...దేవయాని ఏదో మాట్లాడబోతుంటే ధరణి వస్తోంది కదా అని ఆపుతాడు. నీకెలా తెలుసిందని అడిగితే తన చూపులు ఈ మధ్య గుచ్చుకుంటున్నాయ్ ఎందుకో తెలియడం లేదంటాడు శైలేంద్ర...

Also Read: శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన మహేంద్ర, మళ్లీ శైలేంద్రదే పైచేయి - రిషి వచ్చేదెప్పుడు!

ధరణి పంచ్

కాఫీ తీసుకొచ్చిన ధరణితో ఏంటిలి వాచ్చావ్ నేనేం కాఫీ అడగలేదే అంటుంది దేవయాని. నేను కూడా మీకు కాఫీ తీసుకురాలేదు అత్తయ్యా ఊరికే అటువైపు పెడదాం అని వచ్చానని రివర్స్ పంచ్ ఇస్తుంది. మీరు మాట్లాడకుంటా ఆపమని మావయ్య చెప్పారు కానీ మిమ్మల్ని ఆపడం నావల్ల కావడం లేదంటుంది. సరే మాట్లాడుకోండి అనేసి వెళ్లిపోతుంది. ధరణితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఈ సారి మాత్రం అంతా పకడ్బందీగా జరుగుతుంది కదా అని దేవయాని డౌట్ పడితే..ఫెయిల్యూర్స్ లెక్కపెట్టుకోవద్దు చేయాల్సిన టార్గెట్ దృష్టిలో పెట్టుకోవడమే అని క్లారిటీ ఇస్తాడు

వసుని భయపెట్టిన భద్ర

వసు మొబైల్ కి మెసేజ్ వస్తుంది...తొందరగా నిర్ణయం తీసుకోపోతే అందుకు ఫలితం అనుభవించాల్సి వస్తుందని మళ్లీ మెసేజ్ పెడతాడు శైలేంద్ర. అయితే అది కొత్త నంబర్ నుంచి వస్తుంది. మళ్లీ రిషిని గుర్తుచేసుకున్న వసుధార...ఎక్కడున్నారు సర్ అని బాధపడుతుంది. ఆ రాక్షసుడు మిమ్మల్ని అడ్డుపెట్టుకుని డీబీఎస్టీ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నాడు, మీరు నాకోసం త్వరగా రావాలి, ఈ ఊబిలోంచి నన్ను కాలేజీని కాపాడండి అంటుంది వసుధార. ఇంతలో వెనుక నుంచి నీడ పడుతుంది. ఆ నీడ ఎవరిదా అని వెళ్లి చూస్తుంది .. అక్కడ భద్ర ఉంటాడు. ఈ టైమ్ లో ఇక్కడేం చేస్తున్నావని అడిగితే వాటర్ కోసం అని రిప్లై ఇస్తాడు. వాటర్ కోసం అయితే కిచెన్లోకి వెళ్లాలి కానీ నా రూమ్ లోకి ఎందుకొచ్చారని అడుగుతుంది. వాటర్ బాటిల్ తెస్తాను ఉండు అని చెప్పి వెళుతుంది వసుధార. ఇంకోసారి ఇలా భయపెట్టకండి అని చెబుతుంది. నేను కాపలా ఉంటాను మీరు భయం లేకుండా పడుకోండని ధైర్యం చెబుతాడు. 

Also Read: వసుధారా అంటూ ఉలిక్కిపడి లేచిన రిషి - వసుని కాపాడినోడు కూడా శైలేంద్ర మనిషే!

వసుకి సమాచారం ఇచ్చే ప్రయత్నంలో రిషి

అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రిషి.. వసు, మహేంద్రని గుర్తుచేసుకుని బాధపడతాడు. నాకోసం ప్రతిక్షణం బాధపడుతుంటారు, నేను పక్కన లేకపోతే వసుధార ధైర్యంగా ఉండదు..తనను వెంటనే చూడాలి, మాట్లాడాలని నా మనసు ఆరాటపడుతోంది. నేను ఇక్కడున్న విషయం వసుధారకి చెప్పాలి అనుకుంటాడు. 

శైలేంద్ర అనుకుని ఫణీంద్రతో మాట్లాడిన వసు

రిషి కావాలా-ఎండీ సీట్ కావాలా అన్న మెసేజ్ గుర్తుచేసుకుని వసుధార ఆలోచనలో పడుతుంది. తన వీడియో నా దగ్గరున్నా కానీ ఏ ధైర్యంతో మెసేజ్ చేశాడు..అంటే నేను ముకుల్ కి ఆ వీడియో చూపించను అనుకుంటున్నాడా? అదేంటో ఇప్పుడే తెలుసుకుంటాను అనుకుంటూ కాల్ చేస్తుంది. శైలేంద్ర ఫోన్ రింగవుతుంటుంది అప్పుడే అక్కడకు వచ్చిన ఫణీంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు... అటు వైపు కాల్ లిఫ్ట్ చేసింది శైలేంద్ర అనే అనుకున్న వసుధార మాట్లాడుతుంటుంది. నువ్వు బెదిరిస్తే భయపడే రకంకాదు నేను, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నీకు ఎప్పటికీ ఎండీ సీట్ దక్కనివ్వను, నీలాంటి వాడి చేతిలో కాలేజీ పెడితే స్టూడెంట్స్ భవిష్యత్ నాశనం అయిపోతుంది...అయినా నేను ఇన్ని మాట్లాడుతున్నా ఒక్కమాట కూడా మాట్లాడలేదేంటి భయపడుతున్నావా అంటుంది. అట్నుంచి ఫణీంద్ర వాయిస్ వినిపించడంతో షాక్ అవుతుంది. కాల్ కట్ చేసేస్తుంది... 

Also Read: వసుధార, అనుపమలను కాపాడిన అజ్ఙాత వ్యక్తి – రిషి డెడ్ బాడీ హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసిన వార్డు బాయ్

శైలేంద్ర ఉండు నీపని చెబుతాను అంటూ ఆవేశంగా వెళతాడు ఫణీంద్ర...
ఫణీంద్ర: ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి
శైలేంద్ర: నువ్వు కాలేజీకి ఎందుకు వస్తున్నావ్
ఫణీంద్ర: కాలేజీకి ఎందుకు వస్తున్నావ్... దేవయాని మాట్లాడబోతుంటే నువ్వు మాట్లాడకు ఆగు అని గద్దిస్తాడు. 
శైలేంద్ర: కాలేజీ అడ్మినిస్ట్రేషన్ లెక్కలు చూసుకునేందుకు వస్తున్నాను
ఫణీంద్ర: ఇందాక ఓ నీకో కాల్ వచ్చిందకి..ఎవరు చేశారో, ఎందుకు చేశారో చెప్పను. డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండాలని నీకు ఆశగా ఉందా? 
ఆ ప్రశ్నకు షాక్ అవుతారు దేవయాని, శైలేంద్ర...మన కాలేజీకి నువ్వు ఎండీగా ఉండాలని అనుకుంటున్నావా
ధరణి: కోరుకున్నట్టున్నారు మావయ్య..అంటే..ఇంతకుముందు మీరు అన్నట్టు గుర్తొచ్చింది అందుకే చెప్పాను
శైలేంద్ర: నేనెప్పుడు అన్నాను...
ధరణి: అయితే నేనేదో భ్రమపడి ఉంటాను
ఫణీంద్ర: నువ్వు సూటిగా సమాధానం చెప్పు..నీకు ఎండీ సీట్ పై ఆశ ఉందా లేదా...
శైలేంద్ర: లేదు డాడ్...నన్ను నమ్మొచ్చు..అప్పడు ముకుల్ కి కూడా ఇదే చెప్పాను..మీరు అప్పగించిన పని చెప్పడం తప్ప నాకు వేరే ఆశ లేదు
ఫణీంద్ర: నా కొడుకు నిజమే చెబుతున్నాడని అనుకుంటున్నాను..నా రక్తం ఎవ్వరికీ ద్రోహం చేయదు
ధరణి: మీరు అమాయకుడిలా మాట్లాడుతున్నారు..ఆయనలో మీరక్తం మాత్రమే కాదు..స్వార్థపరురాలైన అత్తయ్య రక్తం కూడా ఉంది
దేవయాని: అయినా వాడికి ఆ సీట్ పై హక్కులేదా
ఫణీంద్ర: నీకు ఉంటే మాత్రం నీకు ఎలా అప్పగిస్తాను అనుకుంటున్నావ్..రిషిని వెతికి పట్టుకోవడం మన బాధ్యత.. ఆ విషయాన్ని పేపర్ పై రాసి ఇవ్వు...మాటైతే మారిపోతుంది కానీ రాసినది అయితే మారిపోదు కదా...
శైలేంద్రలో రాయించి సైన్ చేయింది..ఆ లెటర్ తీసుకుంటాడు ఫణీంద్ర....

Also Read: ఈ రాశివారు గతాన్ని వదిలిస్తేనే సంతోషకరమైన జీవితాన్ని చూడగలరు, డిసెంబరు 28 రాశిఫలాలు

వసుధార సీట్లో కూర్చుని టెన్షన్ పడుతుంటుంది. అక్కడకు వస్తాడు ఫణీంద్ర...టెన్షన్ పడుతుంటుంది...ఈయన శైలేంద్రతో మాట్లాడే ఉంటారు ఆయన ఏం సమాధానం చెప్పాడో ఏంటో అనుకుంటుంది.. లోపలకు వచ్చిన ఫణీంద్రని కూర్చోమని చెబుతుంది వసుధార...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Game Changer Pre Release Event LIVE: 'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
'గేమ్ చేంజర్' ఎన్నికలకు ముందొస్తే వైసీపీకి ఆ 11 వచ్చేవి కాదు - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Indian Army: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - నలుగురు సైనికులు దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడ్డ సైనిక వాహనం - నలుగురు సైనికులు దుర్మరణం
Embed widget