Guppedantha Manasu December 26th Episode: వసుధారా అంటూ ఉలిక్కిపడి లేచిన రిషి - వసుని కాపాడినోడు కూడా శైలేంద్ర మనిషే!
Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి కిడ్నాప్ డ్రామా ఇంకా నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu December 26th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 26 ఎపిసోడ్)
హాస్పిటల్ కి వెళ్లిన వసుధార, అనుపమ, మహేంద్రలు అది రిషి డెడ్ బాడీ కాదని తెలిసి హమ్మయ్య అనుకుంటారు. ఆ తర్వాత రిషి సర్ ఎక్కడున్నారో అనుకుంటుంది వసుధార...
గాయాలతో రిషి
అదే సమయానికి వేరే ప్లేస్ లో ఇద్దరు మసలాళ్లు పసరు మందులు నూరుతూ ఉంటారు. ఆ పక్కనే రిషి పడుకుని ఉంటాడు. సడెన్ గా లేచి వసుధార అని కలవరిస్తుంటాడు. అబ్బాయికి మెలకువ వచ్చిందంటూ మరింత పసరు మందు తాగిస్తారు. వసుధార అంటే ప్రేమించిన అమ్మాయి అయినా అయిఉండాలి. లేదంటే భార్యనైనా అయిఉండాలని రిషికి ట్రీట్‌మెంట్ ఇస్తున్న వృద్ధులు అనుకుంటారు. రిషి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.
మహేంద్ర-ముకుల్
మరోవైపు మహేంద్ర...ముకుల్ కి కాల్ చేసి..హాస్పిటల్ కి వచ్చిన సంగతి చెబుతాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి ఫొటోను సీక్రెట్ గా తీసి ముకుల్ కి పంపిస్తాడు. తన గురించి ఇన్వేస్టిగేషన్ చేస్తానని మహేంద్రకు మాటిస్తాడు ముకుల్.
Also Read: వసుధార, అనుపమలను కాపాడిన అజ్ఙాత వ్యక్తి – రిషి డెడ్ బాడీ హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసిన వార్డు బాయ్
శైలేంద్ర-ఫణీంద్ర
రెండురోజుల్లో రిషిని తనకు క్షేమంగా అప్పగించాలని వసుధార ఇచ్చిన వార్నింగ్ గురించి శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. రిషిని తానే కిడ్నాప్ చేసినట్లు వసుధార వద్ద ఉన్న వీడియో సాక్ష్యాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందోనని కంగారు పడుతుంటాడు శైలేంద్ర. ఇంతలో అక్కడకు వచ్చిన ఫణీంద్ర.. కాలేజీ ఎండీ సీట్ నీకు దక్కడం కంటే ముందు రిషి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవడం ముఖ్యమని శైలేంద్రకు చెబుతాడు. రిషి విషయంలో మహేంద్ర పడుతోన్న బాధను నువ్వే తీర్చాలని అంటాడు. నీపై మహేంద్ర, వసుధారలకు ఉన్న అనుమానాలు తొలగిపోవాలంటే రిషి ఎక్కడున్నాడో నువ్వే తెలుసుకుని వాళ్లకు అప్పగించమని చెబుతాడు. అసలు రిషి ఎక్కడున్నాడో తనకు తెలియదని అబద్ధం చెబుతాడు. తెలుసుకో అది నీ బాధ్యత, కచ్చితంగా నువ్వు ఈపని చేయాలి...వాళ్లు నిన్ను అనుమానించడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు నిజాయితీ నిరూపణ కావాలంటే రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఈ క్షణం నుంచే రిషి కోసం నువ్వు వెతకాలి అని చెబుతాడు. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటాడు శైలేంద్ర.
Also Read: తప్పించుకున్న రిషి, వసుధారపై అటాక్ ను అడ్డుకున్న కొత్తవ్యక్తి ఎవరు!
వసుధార - మహేంద్ర - అనుపమ ఆవేదన
రిషిని తలుచుకుని వసుధార, మహేంద్ర ఎమోషనల్ అవుతారు. మార్చురీలో రిషి డెడ్‌బాడీ ఎక్కడ కనిపిస్తుందోనని కంగారు పడిన విషయం గుర్తుతెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. రిషి దూరమైతే తన ఊపిరి ఆగిపోయేది అని వసుధార తల్లడిల్లిపోతుంది. మరోవైపు జగతి ఫొటోకు తన మనసులోని బాధ మొత్తం చెప్పుకుంటుంటాడు మహేంద్ర. అసలు రిషి ఎక్కడున్నాడు? ఎందుకు తిరిగిరావడం లేదని ఆవేదనకు లోనవుతాడు. నువ్వు ఎక్కడున్న రిషిని కాపాడుతావనే ధైర్యం నాకు ఉందని జగతి ఫొటోతో అంటాడు మహేంద్ర. అనుపమ కూడా అదే ఆలోచనలో ఉంటుంది. వసుధార రిషికోసం పడుతున్న బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది..జగతి ఇన్ని బాధలు నువ్వెలా తట్టుకున్నావ్ ఇన్ని చూశాక నీకున్న శక్తి నాకు లేదనిపిస్తోంది. రిషి వచ్చేవరకూ నా గుండె కొట్టుకుంటుందనే నమ్మకం నాకు లేకుండా పోతోందని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర. సర్ మీరు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారని నా మనసు చెబుతోంది..అతి త్వరలోనే మనిద్దర్నీ పైనున్న మేడం కలుపుతారు అనే నమ్మకం ఉందనుకుంటుంది వసుధార. నిన్ను ప్రాణంగా ప్రేమించిన వసుధార ప్రేమ-నీ తండ్రి ప్రేమ నిన్ను కాపాడుతుంది రిషి అనుకుంటుంది అనుపమ... ఎవరికి వారే వేర్వేరు ప్లైసెస్ లో రిషి ఆలోచనల్లో మునిగితేలుతారు.
Also Read: శైలేంద్రకి వసు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు , రిషి వచ్చేస్తున్నాడోచ్!
వసుని కాపాడిన భద్ర శైలేంద్ర మనిషే!
వసుధారను చంపమని తాను డీల్ కుదుర్చుకున్న వ్యక్తి కోసం శైలేంద్ర ఎదురుచూస్తుంటాడు. అప్పుడే అక్కడికి వసుధారను కాపాడిన భద్ర వస్తాడు. తానే ఆ కిల్లర్ అని చెబుతాడు భద్ర. వసుధారను చంపకుండా ఎందుక వదిలివేశావని సీరియస్ అవుతాడు శైలేంద్ర. నాతో పాటు బేరం కుదుర్చుకున్న వాళ్లు పోలీసులకు దొరక్కుండా మర్డర్స్ చేయడమే తన స్టైల్ అంటూ శైలేంద్రకు చెబుతాడు భద్ర . ప్లాన్ ప్రకారమే ముందు వసుధారకు దగ్గరయ్యానని అంటాడు. తాను ఇప్పుడు చేయబోయేది 101వ హత్య అని వివరిస్తాడు. త్వరగా వసుధార అడ్డు తొలగించమని భద్రను రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత వసుధారతో కలిసి తాను హాస్పిటల్ వెళ్లిన విషయం శైలేంద్రకు చెబుతాడు. మార్చురీలో రిషి ఫోన్ దొరికిన డెడ్‌బాడీ ఫొటోను శైలేంద్రకు చూపిస్తాడు భద్ర. ఆ ఫొటో చూసి శైలేంద్ర షాకవుతాడు. రిషిని కిడ్నాప్ చేయమని తాను డీల్ కుద్చుకున్న రౌడీ ఫొటో కావడంతో టెన్షన్ మరింత పెరుగుతుంది. రౌడీ చనిపోయాడంటే రిషి తప్పకుండా బతికే ఉంటాడని అనుకుంటాడు. రిషిని కూడా చంపమని భద్రతో చెప్పి ఫొటో ఇస్తాడు. ఆ డీల్ కి ఒప్పుకుని.. ఆ తర్వాత తన కాలర్ పట్టుకున్నందుకు వార్నింగ్ ఇస్తాడు. గతంలో ఒకడు కుడిచేస్తే నా కాలర్ పట్టుకున్నాడు..అప్పటి నుంచి వాడు అన్నం కూడా ఎడం చేత్తో తింటున్నాడు...మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఎపిసోడ్ ముగిసింది...