అన్వేషించండి

Guppedantha Manasu December 23rd Episode: తప్పించుకున్న రిషి, వసుధారపై అటాక్ ను అడ్డుకున్న కొత్తవ్యక్తి ఎవరు!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి కిడ్నాప్ డ్రామా ఇంకా నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 23rd Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 23 ఎపిసోడ్)

కాలేజీ ఎండీ సీట్ ఇస్తానని చెప్పినట్టే చెప్పి..రిషి సర్ వచ్చిన తర్వాత సైన్ చేస్తానంటుంది వసుధార. ఆవేశంతో వసుధారని బెదిరించి వెళ్లిపోతాడు శైలేంద్ర. ఆ తర్వాత వసుధార-మహేంద్ర-అనుపమ మాట్లాడుకుంటారు. ఏ చిన్న పొరపాటు చేసినా శైలేంద్ర ఎంతకైనా తెగిస్తాడని అనుకుంటారు. ఆ తర్వాత అనుపమ ముకుల్ కి కాల్ చేసి...అసలు విషయం చెబుతుంది. శైలేంద్ర మొత్తం చేశాడని చెప్పిన అనుపమ వాడిని ఫాలో అయితే రిషి ఎక్కడున్నాడో తెలిసే అవాకశం ఉంది కదా అంటుంది. ఆల్రెడీ వాడి ఫోన్ ట్యాప్ చేశాను, ఇప్పుడు వాడు ఎన్ని ప్లాన్స్ చేసినా వాడి ఆటలు సాగవు, మహేంద్ర సర్ ని వసుధార మేడంని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ముకుల్...

Also Read: శైలేంద్రకి వసు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు , రిషి వచ్చేస్తున్నాడోచ్!

తప్పించుకున్న రిషి

శైలేంద్ర...రౌడీలకు కాల్ చేసి...వాడిని చంపొద్దు. తిండి, నీళ్లు ఇవ్వండి. వాడు అక్కడ సేఫ్ గా ఉన్నంతసేపే నేను ఇక్కడ క్షేమంగా ఉంటానంటాడు. సార్ పంజరంలో చిలుక ఎగిరిపోయింది..రిషి తప్పించుకున్నాడని చెబుతాడు. వాడి మాటలు విని ఫైర్ అవుతాడు. ఇంతలో వేరేవాడు వచ్చి నా ఫోన్ ఇవ్వండి అని అడుగుతాడు... వాడికి కొంత డబ్బిచ్చి పంపించేస్తాడు. ముందు వాడు ఎక్కడున్నాడో పట్టుకోండి అని చెప్పి..నాకు మీరు కాల్ చేయకండి ట్యాప్ లో ఉందని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వాడిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుదాం అనుకుంటే వాడు ఇలా చేశాడేంటి అనుకుంటాడు. ఇంతలో మళ్లీ వచ్చి నా ఫోన్ ఇవ్వండి అంటాడు ఆ వ్యక్తి...మీ చెంప ఎర్రగా ఉందేంటని అడిగితే...వసుధార కొట్టిన విషయం గుర్తుచేసుకుని రగిలిపోయిన శైలేంద్ర ఎదురుగా ఉన్నవాడిని కొడతాడు. 

Also Read: నేను యానిమల్ అన్న శైలేంద్ర, రిషి కోసం కీలక నిర్ణయం తీసుకున్న వసు!

రిషి ఆలోచనలో వసు

మరోవైపు బ్రాస్‌లేట్ చూస్తూ రిషిని తలుచుకుని ఏమోషనల్ అవుతుంది వసుధార. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాను, జీవితంలో ఏదో కోల్పోయినట్టుంది...ఐ లవ్ యూ సర్..నేను అతి తొందర్లోనే నేను వస్తాను, మీరే నా దగ్గరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నా శ్వాస ఆడుతోంది కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారని అర్థం చేసుకుంటాను అనుకుంటుంది. ఇక శైలేంద్ర ఆటలు సాగవు...మిమ్మల్ని అడ్డుపెట్టుకుని కాలేజీని ఏలాలి అనుకుంటున్నాడు...కానీ వాడంతట వాడే మిమ్మల్ని తీసుకొచ్చి అప్పగించేలా చేశాను. మిమ్మల్ని కాపాడుకుంటాను సర్ అనుకుంటుంది వసుధార...

ఇంటికి చేరిన శైలేంద్రకు...ధరణి వచ్చి టవల్ ఇస్తుంది. చెంప బాగా వాచిపోయింది. ఎవరైనా కొట్టారా. మిమ్మల్ని ఎవరు కొడతారు. వసుధారకు కూడా ధైర్యం లేదు అని ధరణి కావాలనే అంటుంది. దాంతో శైలేంద్ర విసుక్కుంటాడు.ఇంతలో దేవయాని వచ్చి  చెంప ఎందుకు వాచింది అని అడుగుతుంది. వసుధార కొట్టింది. అవమానంగా ఉంది అని శైలేంద్ర అంటాడు. 
దేవయాని: రిషిని ఏదో ఒకటి చేయి
శైలేంద్ర: వాడు నా దగ్గర ఉంటే కదా. నేనే కిడ్నాప్ చేయించాను. కానీ, వాడు తప్పించుకున్నాడు 
దేవయాని: షాక్ అయి...వాడు నేరుగా ఇంటికి వస్తాడు. వస్తే అందరి పని అయిపోతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు..వాడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాడిని చంపేయ్. 
శైలేంద్ర: వాడు చస్తే మనం చస్తాం. వాడు నా దగ్గర ఉన్నట్లు వసుధార దగ్గర పక్కా ఆధారం ఉందని వీడియో గురించి చెబుతాడు శైలేంద్ర. ఇప్పుడు ఏం చేద్దామని దేవయాని అంటే.. ఆ వసుధారను చంపేద్దాం. అదొక్కటే దారి. రిషి వస్తే అప్పుడు వాడిని ఏం చేయాలో చూద్దాం అని శైలేంద్ర అంటాడు. సరే అలాగే చేయు అని దేవయాని అంటుంది.

Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి

కొత్త క్యారెక్టర్ ఎంట్రీ 

ఫేస్ కనిపించలేదు కానీ...ఓ డీల్ వచ్చినట్టు ఓ అబ్బాయి చెబుతాడు. మంచి డీల్ అని. డబ్బు బాగా ఇస్తారని  ఆ కుర్రాడు చెబుతాడు. 

అనుపమ -వసుధార-ముకుల్

ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎలాగైనా శైలేంద్ర దొరుకుతాడు. ఇంతవరకూ వాడు చేతికి మట్టి అంటుకోకుండా అన్నీ చేశాడు కానీ మీరు ఇప్పుడు బాగా ఇరికించారంటాడు. అందుకే మాక్కూడా అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ అంటుంది అనుపమ. ఇకపై ఈ కేసుకి సంబంధించిన డీటేల్స్ అన్నీ షేర్ చేస్తాను మేడం అని రిప్లై ఇస్తాడు ముకుల్. తన ఫోన్ ట్యాప్ చేసినట్టే తనపై నిఘా పెడుతున్నా.. తనువేసే ప్రతి అడుగు తన పాపాల చిట్టాను బయటపెడుతుందని ధీమాగా చెబుతాడు ముకుల్. ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతోంది..త్వరలోనే రిషిని కలుస్తాననే నమ్మకం వచ్చింది అంటుంది. అయితే మీ మీద అటాక్ చేయించినా చేయిస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని ముకుల్ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు. 

వసుధారపై అటాక్

వసుధార, అనుపమ వెళ్తున్న కారును టైర్ పంచర్ అయ్యేలా చేస్తారు. కిందకి దిగిన వసుధార మేకులు చూసి అనుపమకు చూపిస్తుంది. కావాలనే ఎవరో టైర్ పంచర్ చేశారని అనుకుంటారు. మపై అటాక్ చేయాలనే ప్లాన్ చేశారు..తప్పించుకోవాలి అంటుంది అనుపమ. కానీ రౌడీలు చుట్టు ముట్టేస్తారు. వారిలో  ఒకడు కత్తి తీస్తాడు. వసుధారను కత్తితో పొడవబోతుంటే ఒక వ్యక్తి వచ్చి అడ్డుకుంటాడు. వచ్చిన వ్యక్తిని వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంతకుముందు డీల్ వచ్చిందని చెప్పింది వసుధారను కాపాడేందుకా? ఇంతకీ వసుధారని కాపాడింది రిషినా? ఎవరన్నది సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget