ఇంట్లో అద్దం పగిలితే!



అద్దం పగిలిందంటే ఇప్పటికీ చాలా మంది భయపడిపోతారు, ఏదో అరిష్టం జరిగిపోతుందని, మృత్యువు తరముకొస్తుందని



అప్పట్లో అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువులూలో ప్రతిబింబాన్ని చూసుకునేవారు.



ఈ ప్రతిబింబాలు మన ఆత్మలాగే మనతోనే ఉంటాయని నమ్మేవారు. ప్రతి బింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం అటూ ఇటూ అనిపించినా అశుభమనుకునేవారు.



అద్దాలు వచ్చాకా అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు.



లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం అని చాలామంది నమ్మకం



సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు



ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు..లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు



అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని చెబుతారు



ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు



వ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు Image Credit: Pixabay