కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు పాండవుల యుద్ధ వ్యూహం పేరేంటి!



భగవద్గీత చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాల గురించి కొన్ని ప్రశ్నలు - సమాధానాలు



సర్పాల్లో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వాసుకి



గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
భీష్ముడు



మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహం పేరేమిటి?
వజ్ర వ్యూహం



ఆయుధాలలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వజ్రాయుధం



భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
దృష్టద్యుమ్నుడు.



భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
“ధర్మ” – శబ్దముతో గీత ప్రారంభమయినది.



మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
అనంతవిజయం



భగవద్గీత మొదటి అధ్యాయం పేరేంటి?
అర్జున విషాద యోగం



భగవద్గీత ఏ వేదంలోది?
పంచమ వేదం-మహాభారతం
Image Credit: Pinterest