ఉచితంగా ఏదీ ఇవ్వొద్దు, తీసుకోవద్దన్న శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత హస్తినకు వచ్చిన శ్రీ కృష్ణుడు అక్కడ వండి వార్చిన గంజి కాలువలా ప్రవహించడం చూసి ఇదేంటని అర్జునుడిని అడిగాడు తన అన్న ధర్మరాజు నిత్యం వేలమందికి అన్నదానం చేస్తుననాడని బదులిచ్చాడు అర్జునుడు నిత్యం ఉచితంగా అన్నదానం చేసి ప్రజలు ఆధారపడేలా చేసేబదులు..అదే డబ్బుతో ఏదైనా పని కల్పిస్తే వాళ్లని వాళ్లే పోషించుకుంటారు కదా అన్నాడు శ్రీ కృష్ణుడు ధర్మరాజు పరిపాలనలో ఐశ్వర్యానికి కొదవేం ఉందని బదులిచ్చాడు అర్జునుడు అర్జునుడిలో గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణుడు..బలిచక్రవర్తి పాలించే సుతల లోకానికి తీసుకెళ్లాడు బలి పాలనలో అందరూ క్షణం తీరిక కూడా లేకుండా ఏదో పనిలో నిగమ్నమై ఉన్నారు శ్రీ కృష్ణుడు...ఓ వ్యక్తిదగ్గరకు వెళ్లి ఇక్కడ అన్నదానం ఎక్కడ చేస్తారని అడిగాడు బలి చక్రవర్తి రాజ్యంలో ఏదీ ఉచితంగా ఇవ్వరు..ఇచ్చినా తీసుకోరు కష్టపడి సంపాదించుకోవమే.. బలి పాలనలో పేదరికం, ఆకలి అనేదే ఉండదు అందరూ ఐశ్వర్యవంతులే అని బదులిచ్చాడు ఆ వ్యక్తి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాలి అనుకున్నాడో అర్జునుడికి అప్పుడు అర్థమైంది Image Credit: Pixabay