అన్వేషించండి

Guppedantha Manasu December 21st Episode: నేను యానిమల్ అన్న శైలేంద్ర, రిషి కోసం కీలక నిర్ణయం తీసుకున్న వసు!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి కిడ్నాప్ డ్రామా ఇంకా నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 21st Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 21 ఎపిసోడ్)

వసు కాలేజీకి బయలుదేరుతుండగా ఓ లెటర్ వస్తుంది. ఆ లెటర్లో చెప్పిన ప్లేస్ కి రమ్మని ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఉంటుంది. వసుధార ఆ లెటర్లో ఉన్న ప్లేస్ కి వెళుతుంది. అక్కడ శైలేంద్రని చూసి షాక్ అవుతుంది.
శైలేంద్ర: ఏంటి షాక్ అయ్యావా? ఊహించి ఉండవు కదా
వసు: అంటే ఈ బ్రేస్ లెట్ పంపించింది నువ్వేనా 
శైలేంద్ర: ఇంకా అందులో డౌట్ ఏముంది? బ్రేస్ లెట్ చూస్తుంటే రిషిని చూసినట్టుగా ఉందా? బాగా గుర్తుకు వస్తున్నాడా? రిషి విషయంలో ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు కదా? మీరు ముగ్గురు చాలా తెలివిగా అనుకుంటున్నారు కదా. రిషి నా దగ్గర ఉన్నాడా లేదా అని అనుమానం ఉంది కదా. అందుకే మీకు నమ్మకం కలగడం కోసం బ్రేస్ లెట్ తీసుకొచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా రిషి నా దగ్గరే ఉన్నాడని అంటాడు.
వసు: రిషి ఎక్కడున్నాడు
శైలేంద్ర: అంత సింపుల్ గా ఎలా చెప్తాను . ఎండీ సీట్ కావాలి. నేను మృగాన్ని అందుకే వాడు నా తమ్ముడైన వాడి గురించి పట్టించుకోను. నాకు ఎండీ సీట్ కావాలని చెప్తున్నా.. నీకు రిషి కావాలి తీసుకోమని చెప్తున్నా. తొందరగా నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నావ్. ఒకటి కావాలని అనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా. నీకు రిషి కావాలంటే ఎండీ సీట్ వదిలేయ్. తను ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాను. రిషి దగ్గరకి నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు.
వసు: రిషి సర్ ఎక్కడ ఉన్నారో ఏం చేశావో చెప్పు 
శైలేంద్ర: నేను అడిగింది చేయడం తప్ప మరొక దారి లేదు. నీకు నీ భర్త కావలంటే ఎండీ సీట్ వదిలేయ్. ఈరోజు కొరియర్ లో బ్రేస్ లెట్ వచ్చింది. రేపు ఆ బ్రేస్ లెట్ పెట్టుకున్న చెయ్యి కూడా రావచ్చు 
వసు కోపంగా వెళ్ళి శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది. 
శైలేంద్ర: ఆవేశం వద్దు నువ్వు ఆవేశపడితే నీకే నష్టం. అక్కడ ఉన్న రిషికి నష్టం. ఎండీ సీట్ ఇస్తావా? ఏదో ఒకటి త్వరగా చెప్పు లేదంటే అక్కడ రిషి ప్రాణాలు కోల్పోతాడు. నీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా నీకు నాకు అనుకూలమైన నిర్ణయం తీసుకో. రిషి నాదగ్గర ఉన్నాడని నీకు చెప్తే బాబాయ్ కి చెప్పావ్. ఆయన వచ్చి రచ్చ రచ్చ చేశాడు. ఇప్పుడు బ్రేస్ లెట్ పంపించిన విషయం చెప్తే రిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వార్నింగ్ ఇస్తాడు.
వసు మౌనంగా వెళ్ళిపోతుంది

Also Read: వసు చేతికి రిషి బ్రాస్‌లెట్, విశ్వరూపం చూపించబోతున్న శైలేంద్ర

కాలేజ్ లో బోర్డ్ మెంబర్స్ ఇంకా వసుధార రాలేదు ఏంటని మహేంద్రని నిలదీస్తారు. దేవయాని కావాలని వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తను వస్తుంది కదా వెయిట్ చేస్తే సరిపోతుందని మహేంద్ర సర్ది చెప్తాడు. ఎండీ పదవిలో ఉండి ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారని అనుకోలేదు.  వసుధార సారథ్యం అంత ఇంప్రెసివ్ గా లేదు. మేం విసిగెత్తిపోయాం. దీని గురించి మేడమ్ సంజాయషీ చెప్పాలని చెప్పి లెటర్ పెట్టేసి అందరూ వెళ్లిపోతారు.
వసుధార ఇలా చేసింది ఏంటని ఫణీంద్ర అంటాడు. ఏదో జరిగి ఉంటుంది లేకపోతే ఇలా చేయదు ఏం జరిగిందో తెలుసుకుంటానని మహేంద్ర వెళ్ళిపోతాడు. 

మహేంద్ర-వసుధార
ఏం జరిగింది, బోర్డు మీటింగ్ కి ఎందుకు రాలేదని మహేంద్ర అడుగుతాడు. రిషి సర్ కోసం వెళ్లానని చెప్తుంది. వెంటనే శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి విషయం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావ్.. రిషి కోసం అయితే మేం కూడా వస్తాం కదా మీటింగ్ అయిన తర్వాత వెళ్ళే వాళ్ళం కదా అంటాడు. రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి ఒక నిర్ణయం తీసుకోబోతున్నానని చెప్తుంది. ఏం నిర్ణయమని అంటే ఇప్పుడు తనని ఏమి అడగొద్దని తాను తీసుకునే నిర్ణయాన్ని మాత్రం గౌరవించమని చెప్తుంది. 

వసు-శైలేంద్ర
వసు శైలేంద్రకి ఫోన్ చేసి బోర్డు మీటింగ్ కి రమ్మని చెప్తుంది. నిర్ణయం తీసుకున్నావా అంటే తీసుకున్నానని చెప్తుంది. ఏం నిర్ణయమని అడుగుతాడు. మీరు దేని కోసం అయితే ఆరాచకాలు చేస్తున్నారో అదే దక్కుతుంది. రేపు మీకు అందరి సమక్షంలో ఎండీ సీట్ అప్పగిస్తానని చెప్తుంది. నిజంగా ఇస్తావా అంటే అవునని అంటుంది. ఈ శైలేంద్ర భూషణ్ ఎండీ అవబోతున్నాడని సంబరపడిపోతాడు. రిషి సర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి ఆయన్ని అప్పగించాలి. సర్ కి ఏం జరిగినా నేను ఊరుకోనని అంటుంది. నాకు ఎండీ సీట్ ఇస్తానని అంటే నాకు రిషి ఎందుకు ఇచ్చేస్తాను. నీ నిర్ణయంలో మార్పు ఉండదు కదా అని డౌట్ పడతాడు. ఇదే ఫైనల్ అని చెప్పడంతో ఆనందపడతాడు.

శైలేంద్ర-దేవయాని
దేవయాని అప్పుడే రావడంతో...వసు ఫోన్ చేసిన విషయం చెప్పి..రేపు నీ కొడుకు జీవితం మారబోతుందని అంటాడు. ఎండీ సీట్ నీకు దక్కబోతుందా అని దేవయాని అడుగుతుంది. తొందర ఎందుకు రేపు తెలుస్తుందనేస్తాడు. ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు భరించాను రేపు ఎండీ అయి అందరికీ యముడిని అవుతానని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.

Also Read: రిషిని కిడ్నాప్ చేసింది సాక్షినా, శైలేంద్ర-దేవయానిని బయటకి గెంటేసిన వసుధార!

కాలేజ్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల రాలేకపోయానని చెబుతుంది వసుధార...

మహేంద్ర: మీటింగ్ కి రాకపోవడానికి సంజాయిషీ ఇవ్వమని లెటర్స్ పెట్టిన విషయం చెబుతాడు
ఫణీంద్ర: ఎండీ సీట్ లో ఉండి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు
వసుధార: వీటిలో అడిగినట్టుగా నేను ఈ మధ్య ఎండీ బాధ్యతలు నిర్వహించడంలో తడబడ్డాను. మొదట్లో తీసుకున్నట్టుగా ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నా. కానీ ఏ నాడు అశ్రద్ధ చేయలేదు. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పకుండా దాచి పెట్టాను. రిషి సర్ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వెళ్లారని నోటీసు ఇచ్చాను కదా అది అబద్ధం. నిజానికి రిషి సర్ కనిపించకుండా పోయారు. సర్ కనిపించడం లేదంటే అల్లకల్లోలం ఏర్పడుతుందని మహేంద్ర, ఫణీంద్ర సర్ కి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది. 
బోర్డ్ మెంబర్స్: అసలు రిషి సర్ కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్లారు
వసుధార: శైలేంద్ర సర్ హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి కనిపించడం లేదు
శైలేంద్ర: ఇవన్నీ ఎందుకు చెబుతోంది..రివర్స్ డ్రామా ప్లే చేస్తోందా అని టెన్షన్ పడతాడు...
వసు: రిషి సర్ కనిపించకపోవడంతో ఎండీ పదవి మీద కూడ శ్రద్ధ చూపించలేకపోతున్నాను. అందుకే నేను ఈ ఎండీ పదవి నుంచి తప్పుకుందామని అనుకుంటున్నాను. ఆ మాటకి దేవయాని-శైలేంద్ర సంతోషపడతారు. 
మహేంద్ర: ఏంటి వసుధార నువ్వు మాట్లాడేది ఎండీ సీటు వదిలేయడం ఏంటని మహేంద్ర కోపంగా అడుగుతాడు.
వసు: తన నిర్ణయానికి అడ్డు తగలొద్దంటుంది వసుధార. 
మహేంద్ర: ఏం జరిగిందని అడిగితే ఏమీలేదనేస్తుంది. మహేంద్ర కోపంగా శైలేంద్ర వైపు చూసి లేదు ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పమని కోపంగా అడుగుతాడు.
ఎపిసోడ్ ముగిసింది.

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Embed widget