అన్వేషించండి

Guppedantha Manasu December 22nd Episode: శైలేంద్రకి వసు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు , రిషి వచ్చేస్తున్నాడోచ్!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి కిడ్నాప్ డ్రామా ఇంకా నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 22nd Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 22 ఎపిసోడ్)

ఎండీ సీట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది వసుధార. రిషి విషయంలో నిన్ను ఎవరో బెదిరించడం వల్లే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని అర్థమైందంటాడు మహేంద్ర. ఇలాంటి నిర్ణయం సరికాదంటుంది ఫణీంద్ర...
మహేంద్ర: నువ్వు భయపడొద్దు..ఏం జరిగిందో చెప్పు..రిషి గురించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటావ్
వసు: ఏమీ లేదు..నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా తర్వాత కాలేజీని సమర్థవంతంగా నడిపించేది శైలేంద్ర భూషణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండీ పదవికి తనే అర్హుడు అనుకుంటున్నా
బోర్డ్ మెంబర్స్: తన అభిప్రాయం ఏంటో తెలియాలి కదా...
శైలేంద్ర: నాకు పదవులపై వ్యామోహం లేదు కానీ..వసుధార నమ్మకం పెట్టుకుంది కదా అందుకే కాదనలేకపోతున్నాను. ఇంతకుముందు రిషి వసుధారపై ఎలాంటి నమ్మకం పెట్టుకున్నాడు..వసుధార కూడా ఇప్పుడు నాపై నమ్మకం పెట్టుకుంది. కాలేజీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కాక ఎవరు ఆదుకుంటారు. ఇలాంటి టైమ్ లో రిషి నా పక్కన ఉంటే బావుండేది..తన సమక్షంలో నేను ఎండీ సీట్లో కూర్చుంటే చాలా సంతోషించేవాడు. ఇంతకుముందు కూడా తనే దగ్గరుండి ఆ సీట్లో కూర్చోబెట్టాడు..
బోర్డ్ మెంబర్స్: ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే పనైపోతుంది కదా...ఇంకా ఆలస్యం ఎందుకు...
వసు: సరే నేను డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను మీరు చర్చిస్తూ ఉండండి...
ఇక చర్చించేది లేదు ఏమీ లేదు..మనమే ఎండీ అని మురిసిపోతాడు శైలేంద్ర....
వసుధార వెనుకే మహేంద్ర వెళతాడు...శైలేంద్ర కూడా ఆ వెనుకే వెళతాడు...

Also Read: నేను యానిమల్ అన్న శైలేంద్ర, రిషి కోసం కీలక నిర్ణయం తీసుకున్న వసు!

ఎండీ సీట్లో కూర్చోబెడుతూ రిషి చెప్పిన జాగ్రత్తలు తలుచుకుని బాధపడుతుంది వసుధార.. ఆ వెనుకే వచ్చిన మహేంద్ర, అనుపమ ఇద్దరూ వసుపై ఫైర్ అవుతారు
అనుపమ: ఆ పదవిని వదిలేయడం ఏంటి
వసు: నేనున్న పరిస్థితుల్లో వదులుకోక తప్పడం లేదు
మహేంద్ర: ఆ శైలేంద్రగాడు నిన్ను బెదిరించి ఉంటాడు అంతేనా
వసు: ఈ విషయంలో నేను నిర్ణయం మార్చుకోను
అనుపమ: నేను చెప్పేది వినవా..పిచ్చి పిచ్చిగా మాట్లాడకు

దేవయాని-శైలేంద్ర
నాకు చాలా సంతోషంగా ఉందని దేవయాని అంటే..సాధించాను మామ్ నాకు తిరుగులేదంటాడు శైలేంద్ర. ఇకపై కాలుపై కాలు వేసుకుని కూర్చుని చక్రం తిప్పుతాను..ఇక కాలేజీలో ఏ ఫైల్ కదలాలన్నా నా సంతకం ఉండాల్సిందే. ఈ దేవయాని కొడుకువి అనిపించావ్..ఆ వసుధార డాక్యుమెంట్స్ తెచ్చి ఉంటుంది సంతకాలు పెట్టించుకుంటే ఓ పనైపోతుంది పద అంటుంది. 
ముందు బోర్డ్ మెంబర్స్ సైన్ చేశాక మీరు ఫైనల్ గా సైన్ చేయండి వసుధార గారూ..అప్పుడు శైలేంద్ర ఎండీ అయినట్టే అంటారంతా. మహేంద్ర అయిష్టంగానే సైన్ చేస్తాడు. బోర్డ్ మెంబర్స్ అందరూ సైన్ చేస్తారు. వసుధార సైన్ చేయడానికి ఆలోచిస్తుంటే.. పెట్టమ్మా సంతకం అంటుంది దేవయాని. వసుధార పెన్ పక్కన పడేస్తుంది...
దేవయాని: ఏంటమ్మా పెన్ను వదిలేశావ్..సంతకం పెట్టు..నీకే చెప్పేది..
వసు: సారీ మేడం..నేను పెట్టలేను..
శైలేంద్ర: నీ అంతట నువ్వే ఎండీ సీట్ అప్పగిస్తానన్నావ్ కదా..ఇప్పుడేంటి ఇదంతా
వసు: ఇందాక మీరొక మాట అన్నారు కదా అప్పుడు నా ఆలోచన మారింది. రిషి సార్ సమక్షంలో ఎండీ సీట్లో కూర్చుంటే బావుండేది అన్నారు కదా..అందుకే రిషి సార్ ఉన్నప్పుడే ఈ ఫైల్ మీద సంతకం పెట్టి శైలేంద్ర గారికి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నా.
దేవయాని: అదేదో మామూలుగా అన్నాడు
వసు: లేదు బలంగానే అన్నారు. ఆయన కోరిక కాదనడం ఎందుకు..రిషి సార్ వచ్చినప్పుడే ఎండీ సీట్ అప్పగిస్తాను. శైలేంద్ర సార్ మౌనంగా ఉన్నారంటే ఇదే ప్రొసీడ్ అవమని అర్థం
బోర్డ్ మెంబర్స్: రిషి సార్ వచ్చిన తర్వాతే ఇది జరిగితే బావుంటుంది...
వసు: సర్ నేను చెబితే కాదనరు..వచ్చిన మరుక్షణమే సంతకం పెట్టి శైలేంద్రగారిని ఎండీగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరకీ ఇది ఓకేనా 
దేవయాని: చివరి వరకూ వచ్చి ఆపడం ఏంటి...మా అబ్బాయిని ఎండీని చేస్తే ఏమైందని ఫైర్ అవుతుంది...
మహేంద్ర: అందరి ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకోలేం కదా
ఫణీంద్ర: రిషి వచ్చిన తర్వాత దానిగురించి మాట్లాడుదాం...
అది కాదండి అని దేవయాని ఏదో చెప్పబోతుంది.....మీటింగ్ ఈజ్ ఓవర్ అనేసి వసుధార వెళ్లిపోతుంది... మహేంద్ర కూడా సంతోషంగా వెళ్లిపోతాడు...

Also Read: వసు చేతికి రిషి బ్రాస్‌లెట్, విశ్వరూపం చూపించబోతున్న శైలేంద్ర

దేవయాని-శైలేంద్ర రగిలిపోతారు...వసుధారా వస్తున్నాను అంటూ కోపంగా వెళతాడు...
శైలేంద్ర: నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా..పిచ్చి పిచ్చిగా ఉందా..నవ్వుతున్నావేంటి వెటకారంగా ఉందా..రిషి నా కంట్రోల్ లోనే ఉన్నాడని చెప్పినా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే ఏం చేయాలి. రిషిని చంపేస్తాను..నువ్వు అతి తొందర్లోనే రిషి చావు వార్త వింటావ్ చూడు
వసు: అంతకన్నా ముందు నువ్వు చచ్చిపోతావ్
శైలేంద్ర: ఏం చేస్తావ్ నువ్వు..ఏం చేయగలవు..నేను ఒక్క ఫోన్ కొడితే అక్కడ రిషి ఫినిష్ అయిపోతాడు...
వసు: ఇప్పుడు సర్ కి ఏదైనా ప్రమాదం జరిగితే నీపనైపోతుంది...నువ్వు బ్రాస్ లెట్ కూడా ఇచ్చావ్ కదా...ఈ విషయం అందరకీ చెబుతాను..
శైలేంద్ర: నువ్వు చెబితే అందరూ నమ్ముతారా ఏంటి...
వసు: నేను పక్కా ఆధారంతో ఈ విషయం చెబుతాను..చూస్తారా అంటూ... ఫోన్లో వీడియో చూపిస్తుంది...రిషి నా దగ్గరే ఉన్నాడని చెప్పే వీడియో అది... 
అది చూసి శైలేంద్ర షాక్ అవుతాడు.. ఈ వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చిందని అడుగుతాడు
అప్పుడు జరిగిన విషయం గుర్తుచేసుకుంటుంది వసుధార...
అనుపమ: నీకు కొరియర్ రాగానే నువ్వు హడావుడిగా వెళ్లడం చూసి నాకు అనుమానం వచ్చింది ఆ తర్వాత నువ్వు శైలేంద్రతో మాట్లాడింది నేను చూశాను వీడియో కూడా రికార్డ్ చేశాను...చూడు అని చూపిస్తుంది...వాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా అని అనుపమ అంటుంది...
మహేంద్ర: నువ్వు ఎండీ సీట్ ఇస్తాననే నిర్ణయం మార్చుకోమ్మా
వసు: అందరి ముందూ వాడిని దోషిని చేయకుండా ఈ వీడియో పట్టుకుని వాడితో ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు అంటుంది...
శైలేంద్ర: నన్నే చీట్ చేస్తావా
వసు: చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుతావా...నేను నిన్ను చీట్ చేయడం ఏంటి..నీకు ఎండీ సీట్ ఇస్తే రిషి సార్ ని అప్పగిస్తా అన్నావ్.. నేనూ అదే చెబుతున్నా రిషి సర్ ని అప్పగించు అప్పుడు ఎండీ సీట్ ఇస్తాను... ఇందాక బోర్డ్ మీటింగ్ లో నువ్వే అన్నావ్ కదా రిషి సార్ సమక్షంలో ఎండీ బాధ్యతలు తీసుకుంటే బావుండేది అన్నావ్ కదా..రిషి సార్ ని తీసుకురండి ఆన్ ద స్పాట్  సంతకం పెట్టేసి ఎండీ సీట్ ఇస్తాను
శైలేంద్ర: ఎండీ సీట్ ఇచ్చాక రిషిని తీసుకొస్తానని నమ్మకం లేదా...రిషితో నాకు పనిలేదు
వసు: పని అవకముందు అందరూ అలానే అంటారు..అందుకే నువ్వు మోసం చేయవని గ్యారెంటీ లేదు..అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను 
శైలేంద్ర: మర్యాదగా ఎండీ సీట్ అప్పగించు లేదంటే రిషిని మట్టిలో కలిపేస్తాను
వసు లాగిపెట్టి కొడుతుంది...రెండు రోజుల్లో రిషి సర్ ని తీసుకొస్తే సరే లేదంటే ఈ వీడియో అందరీ చూపిస్తాను...అప్పుడు రిషి సర్ కి ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతుంది....
శైలేంద్ర షాక్ లో ఉండిపోతాడు....

Also Read: రిషిని కిడ్నాప్ చేసింది సాక్షినా, శైలేంద్ర-దేవయానిని బయటకి గెంటేసిన వసుధార!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Ind Vs Aus Test Series: జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
SIM Swap Scam: వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Embed widget