Guppedantha Manasu: 'గుప్పెడంత మనసు' రిషికి కొత్త పెద్దమ్మగా 'వదినమ్మ' విలన్
Guppedantha Manasu February 25th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో దేవయాని పాత్రలో నటిస్తోన్న మిర్చి మాధవి బదలు మరోనటి ఎంట్రీ ఇచ్చింది..ఆమె ఎవరంటే...
గుప్పెడంత మనసు సీరియల్‌లోకి కొత్త నటి వచ్చేసింది. రిషీంద్ర భూషణ్ కి కొత్త పెద్దమ్మ వచ్చింది. ఇన్నాళ్లూ రిషి పెద్దమ్మగా కథని మలుపుతిప్పిన దేవయాని అలియాస్ మిర్చి మాధవి ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో కొత్త నటి వచ్చేసింది. ఈమె ఎవరంటే..గతంలో సూపర్ హిట్టైన వదినమ్మ సీరియల్ లో దమయంతి పాత్రలో విలనిజం పండించిన సంగీత కొండవీటి. అంటే వదినమ్మలో దమయంతిగా మెప్పించిన సంగీత ఇప్పుడు గుప్పెడంతమనసులో దేవయాని అయింది
Also Read: వసు ప్రేమలో తడిసిముద్దవుతున్న రిషి, తాళి గురించి దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసుధార
గతంలో చాలా సీరియల్స్ లో నటించిన సంగీత కొండవీటికి 'వదినమ్మ' సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. వదినమ్మ సీత మూడో మరిది నాని అత్త దమయంతి. కూతురి కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే పాత్రలో విలన్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసింది దమయంతి. ఇప్పుడు గుప్పెండతమనసులో దేవయానిగా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి గుప్పెడంత మనసు సీరియల్ లో దేవయాని పాత్ర చాలా కీలకం.కథను నడిపిస్తున్నది, మలుపులు తిప్పుతున్నది ఈ పాత్రే.
తనకన్నా ఎక్కువ చదువుకుంది, తెలివైనది అనే ఉద్దేశంతో తోడికోడలైన జగతిని ఇంటినుంచి పంపించేయడం, ఆమె కొడుకుకి తల్లిపై నెగెటివ్ గా చెప్పి దూరం చేయడం, భార్య దగ్గరకు వెళ్లకుండా మరిది మహేంద్రను నిలువరించడంలో ఆమె పాత్ర కీలకం. ఎట్టకేలకు కుటుంబం అంతా ఓ చోట చేరుతోంది..ఇలాంటి సమయంలో మహేంద్ర, జగతి, రిషిని శాశ్వతంగా విడగొట్టేందుకు కుట్రలు వేస్తుంటుంది. ఈ కుట్రలను ఎదుర్కొంటూ ఎంట్రీ ఇచ్చింది వసుధార. మొన్నటి వరకూ జగతి వర్సెస్ దేవయానిగా సాగిన వార్...ప్రస్తుతం దేవయాని వర్సెస్ వసుధారగా నడుస్తోంది.
Also Read: నేను మీ నీడ మీరు నా తోడు - రాత్రంతా రిషి సేవలో వసు, దేవయానికి ఇచ్చిపడేసిన జగతి, మహేంద్ర
గుప్పెడంత మనసు సీరియల్ లో మెయిన్ లీడ్ అయిన రిషి(ముఖేష్ గౌడ), వసు (రక్షా గౌడ) ప్రేక్షకులకు ఎంతబాగా కనెక్ట్ అయ్యారో...మహేంద్ర, జగతి, దేవయాని, ధరణి , గౌతమ్, ఫణీంద్ర పాత్రలు కూడా బాగా మార్కులు సంపాదించుకున్నాయి. అయితే ఇప్పటికే గౌతమ్ గా నటించిన కిరణ్ కాంత్...బ్రహ్మముడి సీరియల్ తో బిజీ అయిపోయాడు. అంటే దాదాపుగా గుప్పెడంతమనసు నుంచి తప్పుకున్నట్టే. ఇప్పుడు దేవయాని ( మిర్చి మాధవి) కూడా వెళ్లిపోయింది. దేవయానిగా మిర్చి మాధవి ఫుల్ మార్క్ కొట్టేసింది. కోపం, ఈర్ష్య, అసూయ ప్రదర్శించడంలో ఆమెకు ఆమె సాటి అనిపించుకుంది. ఓ రకంగా చెప్పాలంటే సీరియల్ లో ఈమె కనిపించగానే కుట్రలకు కేరాఫ్ గా ఫిక్సైపోతారు ప్రేక్షకులు...కార్తీకదీపంలో మోనితను రియల్ గా కూడా విలన్ గా చూసినట్టే..గుప్పెడంతమనసు సీరియల్ లో దేవయానిని కూడా రియల్ విలన్ గానే చూస్తారు బుల్లితెర ఆడియన్స్. ఆమె ఏ రేంజ్ లో నటిస్తుందో ఇంతకన్నా చెప్పడానికేముంది. మరి కొత్తగా వచ్చిన సంగీత కొండవీటి మిర్చి మాధవిని మించి అనిపించుకుంటుందా..వెయిట్ అండ్ సీ...
View this post on Instagram