News
News
X

Guppedantha Manasu February 25th Update: వసు ప్రేమలో తడిసిముద్దవుతున్న రిషి, తాళి గురించి దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసుధార

Guppedantha Manasu February 25th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఫిబ్రవరి 25 ఎపిసోడ్ (Guppedanta Manasu February 25th Update)

రిషి రూమ్ లోంచి మహేంద్ర బయటకు వస్తుండగా..దేవయాని పిలిచి పెద్ద క్లాస్ వేస్తుంద
దేవయాని: మీ మొగుడు పెళ్ళాం ఇద్దరు ఏమనుకుంటున్నారు..రిషికి జ్వరం వస్తే నువ్వు నేను జగతి, ధరణి చూసుకోవాలి కాని మధ్యలో ఆ వసుధార ఏంటి. అయిన తను ఇంటికి రావడం ఏంటి మనల్ని పక్కకు జరపడం ఏంటి 
మహేంద్ర: వదిన గారు మనకు ఇలాంటి టైంలో జ్వరం తగ్గడం ఇంపార్టెంట్ 
దేవయాని: జగతి చిన్నప్పుడు రిషి ని వదిలి వెళ్ళిపోయినప్పుడు రిషి ని పెంచి పెద్ద చేసింది నేను అని అంటుండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. రిషి మనసేంటో నాకు తెలుసు రిషి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు  అంటూనే జగతిని ఉద్దేశించి.. ఫస్ట్ వసుధారని ఇంట్లో నుంచి పంపించేస్తారా లేదా మీకు ఎలా ఉందో కానీ నాకు లోకానికి మాత్రం బాగుండదు ఫస్ట్ పంపించేయండి . ఇంటికి తీసుకుని రావొద్దని నేను చెబుతున్నా నామాట వినలేదు. ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని అంటుండగా
మహేంద్ర: వదినగారు ప్లీజ్ ఇంక మీరు మాట్లాడకండి ..మీకున్న మర్యాదగా నిలబెట్టుకుని ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఇంతకుముందు లాగే పెత్తనం చేస్తాను అంటే కుదరదు
అది కాదు మహేంద్ర అని ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా..అక్కడి నుంచి వెళ్లిపోతారు జగతి-మహేంద్ర

Also Read: నేను మీ నీడ మీరు నా తోడు - రాత్రంతా రిషి సేవలో వసు, దేవయానికి ఇచ్చిపడేసిన జగతి, మహేంద్ర

మరొకవైపు వసుధార, రిషి కోసం జ్యూస్ చేస్తూ.. రిషి అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. 
వసు: మీరు నా మీద ఎంత అరిచినా కూడా మీ మీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది మీ కోపం మీదే నా ప్రేమ నాదే 
ఇంతలోనే రిషి నిద్ర లేచి కూర్చునేందుకు ప్రయత్నించి తూలిపడబోతుండగా వసుధార పట్టుకుంటుంది. 
వసు: మీకు ఎంత జ్వరం వచ్చిందో మీకు కూడా తెలుసు..జ్యూస్ తాగండి సార్ 
రిషి: నాకు తాగాలనిపించడం లేదు
వసు: జ్వరం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది సార్ కానీ తాగాలి
రిషి: నీకేం ఎన్నైనా చెప్తావ్ జ్వరం నాకు వచ్చింది నాకు తాగాలనిపించలేదు 
వసు:మీరు అంతలా జ్వరంతో మూలుగుతుంటే నాకు భయం వేసింది.. భయం కాదు దానిని ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకు కూడా తెలియదు .. 
రిషి: అన్నీ స్పష్టంగా చెబుతావ్ అవసరమైనవి తప్ప
వసు: ఇంకా కోపం పోలేదు అనుకుంటూ జ్యూస్ తాగండి అని ఇస్తుంది 
వసుధారకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్తుంది. వసుధార పక్కన ఉన్నావని ఏమో జ్వరం కూడా బాగుంది. ఇన్నాళ్లు ఈ ప్రేమను ఎందుకు దాచావు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు అనుకుంటాడు రిషి. 
రాత్రి రిషి నిద్రలేచి చూసేసరికి వసుధార ఒకచోట కూర్చుని అలాగే పడుకుని ఉండడం చూస్తాడు. వాటర్ బాటిల్ తీసుకోవాలి అనుకుంటాడు ఇంతలో వసుధార నిద్రలేవడంతో వెంటనే కళ్లు మూసుకుని ఉండిపోతాడు..
అప్పుడు టైమ్ చూసి..సార్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కూర్చోండి సార్ అని పిలుస్తుంది వసుధార
అప్పుడు వసుధార ట్యాబ్లెట్ ఇచ్చి నేను వెళ్లి పాలు తీసుకుని వస్తాను సార్ అని అక్కడ నుంచి వెళ్తుండగా రిషి వసుధార చేయి పట్టుకుంటాడు.
వసు: మనసులో ఏదైనా ఉంటే చెప్పండి సార్
రిషి: నాకు జ్వరం వస్తే నువ్వు భయపడ్డావు అంటూనే...ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు మరి నన్ను ఎందుకు బాధ పెట్టావని మనసులో అనుకుంటాడు. 
వసు:జ్వరం తగ్గే వరకు ఏం మాట్లాడొద్దు..నేను చెప్పినట్లు వినాలి

Also Read: ఫిబ్రవరి 25 రాశిఫలాలు, ఈ రాశివారికి కెరీర్ పురోగతిలో ఆటంకాలున్నా సక్సెస్ అవుతారు

మరోవైపు దేవయాని మహేంద్ర,జగతి అన్న మాట తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. 
వసు: ఏంటి మేడం మీరు ఇంకా పడుకోలేదా
దేవయాని: పడుకునేంత ప్రశాంతత ఇంట్లో లేదు 
వసు: అదేంటి మేడం ఇల్లు ప్రశాంతంగానే ఉంది కదా 
దేవయాని: చాలా ఎక్కువ చేస్తున్నావ్,  చాలా ధైర్యం ఎక్కువ మొండి దానివి 
వసు: థాంక్స్ మేడం నాకు ధైర్యం మొండితనం ఉందని మీరు గుర్తించినందుకు.రిషి సార్ కి జ్వరం వస్తే వసుధార ఎక్కడ ఉంటుంది చెప్పండి పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది . మనం ఒకరికి చెప్పాల్సిన పని లేదు మేడం మనకు మనం తెలిస్తే చాలు అని అక్కడ నుంచి వెళ్తుండగా ఆగు వసుధార అని అంటుంది. 
దేవయాని: అవన్నీ పక్కన పెట్టు నీ మెడలో తాళి సంగతి ఏంటి పెళ్లి జరిగింది అంటున్నావ్ మరి ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు ఏది మాట్లాడినా ఏదో సమాధానం చెప్పు తప్పించుకుంటున్నావు అని అంటుంది దేవయాని.
వసు: సమాధానం చెప్పాలి మేడం కానీ నేను చెప్పను ఈ తాళికి ఎవరైతే కారణమో వాళ్లే చెప్తారు. అప్పటివరకు వేచి చూడక తప్పదు మేడం అని వెళ్ళిపోతుంది. 
మరోవైపు మహేంద్ర రిషి హెల్త్ ఎలా ఉందని అడిగితే..టెంపరేచర్ తగ్గిపోయింది సార్ కి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటుంది వసుధార. అప్పుడు వారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

Published at : 25 Feb 2023 09:10 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial February 25th Episode

సంబంధిత కథనాలు

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Brahmamudi March 24th: వామ్మో రాహుల్ మామూలు కేటుగాడు కాదుగా - స్వప్నని చూసేసిన కావ్య

Brahmamudi March 24th: వామ్మో రాహుల్ మామూలు కేటుగాడు కాదుగా - స్వప్నని చూసేసిన కావ్య

Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక

Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక

Guppedanta Manasu March 24th: తన స్థానం ఏంటో దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసు, కాలేజీలోకి ఎంటరైన కొత్త విలన్ రిషికి దొరికిపోయినట్టేనా!

Guppedanta Manasu March 24th: తన స్థానం ఏంటో దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసు, కాలేజీలోకి ఎంటరైన కొత్త విలన్ రిషికి దొరికిపోయినట్టేనా!

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల