Bison Trailer: విక్రమ్ కుమారుడు ధృవ్ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది - కోలీవుడ్ To టాలీవుడ్ వేరే లెవల్
Bison Trailer Reaction: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తెలుగు డెబ్యూ మూవీ 'బైసన్' ట్రైలర్ వచ్చేసింది. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dhruv Vikram's Bison Trailer Out: కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ 'బైసన్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ వేరే లెవల్‌లో ఉండగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
విక్రమ్ కుమారుడిగా కాకుండా తనదైన నటనతో కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు ధృవ్. ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మాస్, యాక్షన్ అంశాలు కలిపి ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్‌కు ఫుల్ జోష్ తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌గా 1990 నాటి పరిస్థితుల ఆధారంగా మూవీ తెరకెక్కింది. గ్రామంలో కబడ్డీ అంటే ప్రాణం పెట్టే యువకుడు ఆట కోసం ఏం చేశాడు? దాని వల్ల అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? కబడ్డీ ఆటతో ఆ యువకుడు ఏ స్థాయికి ఎదిగాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీలో ధృవ్ సరసన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే పశుపతి, రెజిషా విజయన్, కలైయరసన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మామన్నన్' ఫేం మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మూవీని రూపొందించారు. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు 'బైసన్' రానుంది. ధృవ్ తమిళంలో ఆదిత్యవర్మ, వర్మ, మహాన్ సినిమాల్లో నటించి మెప్పించారు.





















