News
News
X

Guppedantha Manasu February 24th Update: నేను మీ నీడ మీరు నా తోడు - రాత్రంతా రిషి సేవలో వసు, దేవయానికి ఇచ్చిపడేసిన జగతి, మహేంద్ర

Guppedantha Manasu February 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఫిబ్రవరి 24 ఎపిసోడ్ (Guppedanta Manasu February 24rd Update)

మహేంద్ర జగతి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రిషి..ఇద్దరూ నా రూమ్ కి వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండాలి ఏంటి డాడ్ అది అని అడుగుతాడు
మహంద్ర: ఏంటి రిషి మమ్మల్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది 
రిషి: అంత పెద్ద నిజం దాచి బాగానే చేశారు కదా 
మహేంద్ర: పాయింట్ కి వస్తాను రిషి వసుధారని నువ్వు అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది 
రిషి: మనం అనుకున్నవన్నీ నిజాలు కాదు కదా డాడ్ ..మరి మీకేం అనిపించింది మేడం మీరు మనుషుల్ని మనసుల్ని అంచనా వేస్తారు కదా మీ శిష్యురాలిలా
జగతి: రిషి అంత అయిపోయింది కదా అపార్ధాలు తొలగిపోయాయి కదా తనని అలా దూరం పెట్టడం 
రిషి: డాడ్ తను చేసింది నాకు నచ్చలేదు అని అంటాడు రిషి..నా ఎమోషన్స్ తో మీరు ముగ్గురు కలిసి ఆడుకున్నారు 
మహేంద్ర: ముగ్గురు అని చెప్పి మమ్మల్ని ఎందుకు కలుపుతావు. అందులో మా తప్పు లేదని చెప్పింది కదా అనగా
రిషి: మీరు తప్పు చేయలేదని అంటారా డాడ్ . వసుధార చెప్తే చేశారు కొడుకు గురించి ఆలోచించలేదా కొడుకుకి చెప్పాలనిపించలేదా మహేంద్ర నచ్చచెప్పడానికి ప్రయత్నించగా రిషి మాత్రం వినిపించుకోకుండా అలాగే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అక్కడ దేవయాని ని చూసి షాక్ అవుతారు. 
జగతి: అక్కయ్య ఎక్కువసేపు అలాగే నిల్చుని ఉంటే కాళ్లు నొప్పిపెడతాయి వెళ్దాం పదండి 
మహేంద్ర: వదిన గారు చాటుగా ఉండి మాటలు అన్ని విన్నారు 
నేనేం వినలేదు అంటూ దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది 

Also Read: ఫిబ్రవరి 24 రాశిఫలాలు, ఈ రాశివారు పెద్ద గందరగోళాన్ని ఈరోజు వదిలించుకుంటారు

వసుధార - రిషి ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ కూర్చుంటారు. మా జెంటిల్మెన్ ఏం చేస్తున్నారు అనుకుంటూ మెసేజ్ చేస్తుంది...ఇప్పుడే తలుచుకున్నానో లేదో అప్పుడే మెసేజ్ వచ్చింది అనుకుంటాడు రిషి. ఇద్దరూ కాసేపు సెటైరిక్ గా మాట్లాడుకుంటారు. మర్నాడు తెల్లారినా రిషి లేవకపోవడంతో మహేంద్ర అక్కడకు వచ్చి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో వసుధార కాల్ చేస్తుంది... జ్వరం వచ్చిందని చెబుతాడు మహేంద్ర.. వసుధార వెంటనే బయలుదేరుతుంది.
దేవయాని: రిషి దగ్గరకు కూర్చుని ఏంటి మహేంద్ర ప్లాన్లు వేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్లాన్ అదిరింది అని చెప్పి అక్కడ ఇక్కడ తిప్పితే రిషికి జ్వరం వచ్చింది చూడండి 
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ టూర్ కి , జ్వరానికి సంబంధం ఏంటి..
ఇంతలో సార్ కి ఎలా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్లారా అంటూ వసుధార టెన్షన్ గా వస్తుంది.
జగతి: కూల్ వసుధారా..ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పారు  2 డేస్ లో తగ్గిపోతుంది
వసుధార: దేవయాని మేడం పక్కకి లేవండి అంటూ రిషి పక్కన కూర్చుంటుంది. రిషికి సేవలు చేస్తుంటుంది... అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతుంది. నిజంగా రిషి సార్ మీద ప్రేమ ఉంటే జ్వరం తగ్గాలనుకుంటే ఇకనుంచి వెళ్ళండి అనడంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. దేవయాని అక్కడే ఉండడంతో...వెళ్లి రిషి సార్ కోసం పాలు పంపించండి అంటుంది.

Also Read: దడ దడమని హృదయం శబ్దం నువ్వు ఇటుగా వస్తావని అర్థం, రిషిధార కొత్త అల్లరి

ఆ తర్వాత దేవయాని జగతి మీద సీరియస్ అవుతుంది
దేవయాని:పరాయి ఆడపిల్లకి కొడుకుని ఎలా అప్పగించి వస్తావు జగతి 
జగతి:వసు పరాయిది ఎలా అవుతుంది అక్కయ్య 
మహేంద్ర: వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు రేపో మాపో వాళ్ళకి మనం పెళ్లి కూడా చేయాల్సి ఉంటుంది 
దేవయాని:ఏం మాట్లాడుతున్నారు మహేంద్ర అంటూ సీరియస్ అవుతుంది.. రిషి మీ వైపు ఉండి మీరు చెప్పినట్టు వింటారని అనుకుంటున్నారా ఇప్పటికి ఇప్పుడు నేను ఏదైనా చేయగలను
జగతి: దేవయానికి వార్నింగ్ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అక్కయ్య రిషి వసుల విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు మీరు ఎన్ని చేసిన ఇప్పటివరకు భరించాము. మీరు చిన్నప్పటినుంచి ఏం చేశారు మీరు రాజీవ్ కి ఎన్నిసార్లు కాల్ చేశారు ఎందుకు చేశారు, కాలేజీ స్టాప్ కి ఏం చెప్పారు వాళ్ళకి ఏం ప్లాన్లు వివరించారు అన్ని చెప్పేస్తాను 
దేవయాని టెన్షన్ పడుతూ...ప్రతి ఒక్కదానికి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది 

మరోవైపు రిషి నిద్ర లేవడంతో వసుధార టాబ్లెట్ ఇచ్చి పాలు తాగమని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడు రిషి వసుధార చెయ్యి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. నిద్రలేచేసరికి వసుధార అలాగే నిద్రపోతుండగా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అనడంతో మీరు ఇక్కడ ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను సార్ అని అంటుంది. రిషి థాంక్స్ చెప్పడంతో  నాకు థాంక్స్ చెప్పడం ఏంటి ఎండి గారు అనడంతో ...ఏం కావాలని రిషి అడగితే..మీరు నాకు ఇవ్వడం ఏంటి సార్ మీరు నేను ఒకటే కదా  అంటుంది. ఇంతలోనే జగతి మహేంద్ర దేవయాని అక్కడికి వస్తారు. సార్ కి బాగుంది వెళ్లి కాఫీ తీసుకొస్తాను... ఏంటి దేవయాని మేడం అలా చూస్తున్నారు మీకు కూడా కాఫీ తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Published at : 24 Feb 2023 09:15 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial February 24th Episode

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Brahmamudi March 23rd: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం

Brahmamudi March 23rd: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం

Guppedanta Manasu March 23rd: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి

Guppedanta Manasu March 23rd: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి

Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే

Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌