News
News
X

ఫిబ్రవరి 25 రాశిఫలాలు, ఈ రాశివారికి కెరీర్ పురోగతిలో ఆటంకాలున్నా సక్సెస్ అవుతారు

Rasi Phalalu Today 25th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి

మంచి విషయాలను స్వీకరించడానికి మీ మనస్సు సిద్ధంగా ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్దీ ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. చెడు అలవాట్ల వైపు మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి.

వృషభ రాశి

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పనికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు పెరిగిపోతాయి తగ్గించుకోండి.  విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మిథున రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఎక్కడికైనా వెళ్లి సరదాగా స్పెండ్ చేస్తారు. కెరీర్ పురోగతి విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు . మీ భాగస్వామితో సత్ప్రవర్తన కారణంగా  వ్యాపారం పుంజుకుంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనాలను పొందుతారు

Also Read: 12 ఏళ్ల తర్వాత ఏర్పడిన నవపంచమ రాజ్యయోగం, ఈ 3 రాశుల వారికి మహర్థశ

సింహ రాశి

సోమరితనం తగ్గించుకోండి...ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు ప్రశాంతతని ఇచ్చే  సృజనాత్మక పనిలో బిజీగా ఉండటం మంచిది. నిలిచిపోయిన ధనం అందుతుంది..ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి

కన్యా రాశి

ఈ రోజు మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబంతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. ధనలాభానికి అనుకూలమైన రోజు. మీ కుటుంబం, వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడనుంది.

తులా రాశి

ఈ రోజు మీరు కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. అపరిచిత వ్యక్తులతో మీ వస్తువులను, ఆలోచనలను పంచుకోకుండా ఉండాలి. కొన్ని సమస్యల వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రియురాలి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కోపం తగ్గించుకోండి. పనిపై శ్రద్ధవహించండి

Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం

ధనుస్సు రాశి

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం చూసుకోండి. ఆర్థిక సమస్యల కారణంగా మీరు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ నుంచి ఎక్కువ ఆశించే వ్యక్తులకు నో చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

మకర రాశి

ఈ రోజు మీకు గౌరవం లభిస్తుంది. ఎవరికీ అప్పు ఇవ్వకండి.కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత పెరుగుతాయి. లవ్ మేట్ కు గిఫ్ట్ వస్తుంది.

కుంభ రాశి

రోజంతా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో కొంతమంది మిత్రుల సహాయంతో మీ పనులు పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు. చదువులో ఉపాధ్యాయుల సహాయసహకారాలు అందుకుంటారు.

మీన రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కుటుంబం, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కొంత తగ్గుతాయి. అయినప్పటికీ, మీరు మీ పని - కుటుంబం రెండింటి మధ్య సామరస్యాన్ని కొనసాగించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

Published at : 25 Feb 2023 05:32 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Maha Shivratri 2023 Today Rasiphalalu astrological prediction today Horoscope for Feb 25th Feb 25th Horoscope

సంబంధిత కథనాలు

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ