Navpancham Rajyog 2023: 12 ఏళ్ల తర్వాత ఏర్పడిన నవపంచమ రాజ్యయోగం, ఈ 3 రాశుల వారికి మహర్థశ
Rajyog 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Navpancham Rajyog 2023 : జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. గ్రహాలు రాశిమారినప్పుడు ఆ ప్రభావం 12 రాశులపైనా పడుతుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం పడితే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయితే గ్రహాలు రాశులు మారినప్పుడు కొన్ని గ్రహాలతో కలసి సంచరించడం వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఆయా సమయంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా బలపడతారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి, చంద్రుడు ఒకేరాశిలో సంచరిస్తున్నారు. ఈ ప్రభావంతో రాశులవారు లాభపడతారు.
మేష రాశి
గురు -చంద్రుల కలయికతో ఏర్పడిన ఈ నవపంచమ రాజయోగం మేషరాశి వారికి చాలా ఫలప్రదం కానుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. బంధాలు బలపడతాయి. మీ భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మరో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. కోర్టు వ్యవహారాల్లోచిక్కుకున్న వారు అనుకూలమైన తీర్పు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Also Read: ఈ వారం ఈ రాశివారి జీవితంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది
మిథున రాశి
నవపంచమ రాజయోగం మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తోంది. ఈ సమయంలో మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. నవపంచం రాజయోగం వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా రోజులుగా పూర్తికాని మీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
కన్యా రాశి
కన్యా రాశి వారికి కూడా నవపంచమ రాజయోగం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు తొలగిపోతాయి..జీవిత భాగస్వామి నుంచి సమన్వయం ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారాలు బాగాసాగుతాయి. కొత్త ఆదాయవనరులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడితే రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారాలు బాగా సాగుతాయి.
నవగ్రహాల ఆరాధన
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్రుడు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||