ABP Desam


ఈ రోజు ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి
( ఫిబ్రవరి 24)


ABP Desam


మేష రాశి
ఈ రోజు మీరు ఎనర్జటిక్ గా ఉంటారు. ఉత్సాహపూరితమైన మీ వైఖరి మీ చుట్టుపక్కలవారిని కూడా సంతోషపెడుతుంది. మీ ప్రియమైన వ్యక్తి చంచలమైన మానసిక స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అనుకోని పర్యటన చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీరు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనైనా ఇంటి పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. చదువు పట్ల మీ ఏకాగ్రత కొంత తగ్గుతుంది. మీరు మీ దృష్టిని మరల్చకుండా ఉండాలి. ఉద్యోగులు పనిపై దృష్టి సారించండి


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశివారికి కొన్ని ఊహించని మూలాల నుంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు దాన్నుంచి కొంత ఉపశమనం పొందుతారు. కొత్త పనిని ప్రారంభించవచ్చు..ప్రణాళికలు అమలు చేయవచ్చు.


ABP Desam


సింహ రాశి
కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారానికి, పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ పనిని వాయిదా వేయొద్దు.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


ABP Desam


తులా రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ప్రతీ ఒక్కరినీ నమ్మేయవద్దు.. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనవారితో అతిచనువు ప్రదర్శించకపోవడం మంచిది. మీరు మీ ప్రణాళికల విషయంలో గోప్యత పాటించడం మంచిది.


ABP Desam


వృశ్చిక రాశి
ఈరోజు కొన్ని ప్రత్యేక పనుల కోసం మీకు కాల్ రావచ్చు. చాలా కాలంగా ఉన్న ఏదైనా పెద్ద గందరగోళాన్ని త్వరలో వదిలించుకుంటారు. ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒత్తిడికి లోనవుతారు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన వల్ల చిరాకుగా ఉంటారు. మీ ప్రియురాలి ప్రవర్తన మాత్రం మీకు మనోహరంగా అనిపిస్తుంది. అనవసర విషయాలగురించి ఎక్కువ ఆలోచించవద్దు. కొత్త వ్యక్తులను కలుస్తారు.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. తలపెట్టిన పనిలో అడ్డంకులు ఎదురైనా పూర్తిచేస్తారు. మధ్యాహ్నం నుంచి మీలో ఉత్సాహం పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ​​ఉంటుంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు ఈరోజు పూర్తి కానున్నాయి.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీరు డబ్బును ఆదా చేయడంపై దృష్టి పెట్టాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. సోదరులు, స్నేహితులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో కొన్ని అనవసరమైన ఖర్చులు ప్రస్తావనకు వస్తాయి