ABP Desam


ఈ రాశులవారు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి


ABP Desam


మేష రాశి
ఈ రాశివారు ఈ రోజంతా బిజీబిజీగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది.డబ్బును జాగ్రత్త చేయండి. స్నేహితులతో కలసి సంతోష సమయం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులో పనిచేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దిగుమతి-ఎగుమతి రంగంతో సంబంధం కలిగి ఉంటే, మీరు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత మిత్రులను కలిసే అవకాశం లభిస్తుంది.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరిస్తారు. కోర్టు-కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచిరోజు. ఈ రోజు ప్రారంభించే పనులు భవిష్యత్ లో మంచి లాభాలనిస్తాయి. అన్ని రకాల సవాళ్లను అధిగమించడం ద్వారా అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.


ABP Desam


సింహ రాశి
మీలో అదనపు శక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిరుద్యోగులు తాము ఆశించిన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు,వ్యాపారులకు మంచి రోజు. విద్యార్థులు కష్టపడాలి


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. కెరీర్ పరంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పనిచేసే రంగంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది.


ABP Desam


తులా రాశి
ఈ రోజు మీరు ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కుటుంబవాతావరణం గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారి కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. బంధువుల నుంచి పెద్ద గిఫ్ట్ అందుకుంటారు. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మంచి పనికి ప్రశంసలు అందుకుంటారు. కొంతమందిపై అనవసరంగా కోపాన్ని కూడా వ్యక్తం చేస్తారు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్యను కూడా పట్టించుకోండి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చికాకులు ఉంటాయి


ABP Desam


మకర రాశి
ఈ రోజు మీకు శుభదినం. ఏ పనిలోనైనా మిత్రుల సహాయం అందుతుంది. చాలా రోజులుగా మీకు రావాల్సిన మొత్తం ఎట్టకేలకు అందుతుంది. ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజును చక్కగా మలచుకోవడానికి కష్టపడాలి. ప్రేమ జీవితంలో ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. అనవసర వాదనలకు దిగొద్దు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.


ABP Desam


మీన రాశి
ఈ రోజు ఆచరణాత్మక విషయాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీ మంచి ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేయడానికి మీకు సహాయపడుతుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. విజయానికి కొత్త మార్గాలను కనుగొంటారు.