ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే ( ఫిబ్రవరి 20 నుంచి 26 )
మేష రాశి వారం ప్రారంభంలో కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు వింటారు. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగులకు సీనియర్లు, జూనియర్ల నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు.
వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మిథున రాశి వారం ప్రారంభం నుంచి పనిభారం మోయాల్సి వస్తుంది. మీ మాటతీరు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి..ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిగ్రహాన్ని కోల్పోవద్దు. బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆస్తిలాభాలు ఉండవచ్చు.
కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారులు, ఉద్యోగులు విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి,లాభం పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు.
సింహం ఈ రాశివారికి ఈవారం శుభప్రదంగా ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. వ్యాపారుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో నిదానంగా, స్థిరంగా పురోగతి కనిపిస్తోంది.
కన్యా రాశి ఈ రాశివారి జీవితంలో వారం ప్రారంభంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. మీ తెలివితేటలు విచక్షణతో మీ ప్రత్యర్థులకు చెక్ పెడతారు. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.
తులా రాశి ఈ వారం ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. సమస్యలపై వెనక్కు తగ్గడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకుని మీవంతు ప్రయత్నం మరు చేయాలి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చిక రాశి ఈ రాశివారికి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులున్నా వారాంతానికి అంతా బావుంటుంది.అయితే ఈ వారం మీరు డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చుచేయాలి. ప్రేమ సంబంధాలతో అల్లరి తగాదాలుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనుస్సు రాశి ఈ రాశివారు తమ జీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమసిపోతాయి.వారం ప్రారంభంలో స్నేహితుల సహకారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ పిల్లలకు సంబంధించిన వార్త ఒకటి మీలో సంతోషాన్ని నింపుతుంది.
మకర రాశి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. జీవనోపాధి కోసం తిరుగుతున్న వారికి వారం ప్రారంభం శుభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది.
కుంభ రాశి ఈ రాశివారు ఈ వారం సోమరితనం, అహంకారానికి దూరంగా ఉండాలి. పనులు వాయిదా వేస్తే చాలా నష్టపోతారు. భాగస్వామ్య వ్యపారులు కలిసొస్తాయి. అనుకోకుండా మీ బాధ్యత పెరుగుతుంది.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు వారం చివర్లో శుభవార్త వింటారు.
మీన రాశి ఈ రాశివారు ఈవారం అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తిచేయడానికి మరింత కష్టపడాల్సి ఉంటంది. సమయానికి డబ్బు చేతికందుతుంది.. సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం.