ABP Desam


ఈ రాశుల ఉద్యోగులు నిరుద్యోగులకు శుభవార్త


ABP Desam


మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచిరోజు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. చిన్నప్పటి స్నేహితులను కలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అకాశాలొస్తాయి.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు గృహ సమస్యలు మీకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమానికి హాజరు కావడానికి ఇబ్బంది పడతారు. ఉద్యోగులు,వ్యాపారులు పనిపై శ్రద్ధ వహించాలి.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి..ఆదాయంలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ రోజు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు, రోజంతా ఆనందంగా ఉంటారు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీ ఒత్తిడి దూరమవుతుంది. తలపెట్టిన పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అనవసర ఆకర్షణలకు గురవడం వల్ల మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో పోటీ తగ్గుతుంది. ప్రయాణం చేసే అవకాసం ఉంది.


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. వ్యాపారంలో అద్భుమైన విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మంచి రోజు.


ABP Desam


తులా రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. షాపింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది. మీ మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు చివరి క్షణంలో మీ ప్రణాళికల్లో మార్పు రావొచ్చు. చిన్న విషయంలో మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధాల వల్ల మీరు బాధపడతారు. మీరు ప్రతి విషయం చాలా జాగ్రత్తగా పరిగణించాలి.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు మీకు హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి. పనుల్లో పాక్షిక విజయం ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. రోజంతా కష్టపడి పనిచేస్తారు. ఓ శుభకార్యానికి హాజరవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


ABP Desam


మకర రాశి
ఈ రోజు న్యాయశాస్త్ర విద్యార్ధులకు బావుంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.


ABP Desam


కుంభ రాశి
ఈరోజు కొన్ని పనులు పూర్తికావడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. శారీరక సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.


ABP Desam


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం వ్యాపారులకు లాభాన్నిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. మీ పనితీరు, ప్రవర్తన మీ గౌరవాన్ని పెంచుతుంది.