ABP Desam


ఈ రాశివారు అప్పుల నుంచి విముక్తి పొందుతారు


ABP Desam


మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకుంటారు. కొనసాగుతున్న ప్రాజెక్టులకో కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.సొంత చెల్లింపులు చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు మీపై మీకు అధిక విశ్వాసం ఉంటుంది. గతం గురించి ఆలోచించకుండా దాన్నుంచి బయటపడడానికి దృష్టి సారించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ కాలం.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీకు గడిచిన రోజుకన్నా బావుంటుంది. సామాజిక రంగంలో మీ క్రియాశీలత పెరుగుతుంది. కొన్ని పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం మామూలుగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల మనసు చంచలంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మాట తూలొద్దు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. అనభవజ్ఞుల సలహాలు, సహకారంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలసి సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు జరపొద్దు. సమయాన్ని సద్వినియోగం ప్రయోజనం పొందుతారు.


ABP Desam


కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన సమయం.మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ కెరీర్ మెరుగుదలకు బలమైన సంకేతాలున్నాయి. మీ నెట్ వర్క్ పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు.


ABP Desam


తులా రాశి
ఈ రోజు మీరు పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు. అదృష్టం మీద ఆధారపడకండి, శ్రమ మీద దృష్టి పెట్టండి. ఓర్పుతో అన్నిటినీ గెలవగలమని గుర్తుంచుకోండి. ఓపికగా వ్యవహరిస్తే విజయం మీ సొంతం. భయం మీ ఆనందాన్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కొంచెం కష్టపడితే, మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితిలో చాలా మెరుగుదల ఉండవచ్చు. వ్యాపార పరంగా ఈరోజు మంచి రోజు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రాశివారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, ఉద్యోగం కోసం చూస్తున్నా దానికి సంబంధించి కీలకమైన అడుగు పడుతుంది, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారులు, ఉద్యోగులకు ఇదే శుభసమయం.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. మీరు మంచి నాయకులుగా ప్రశంసలందుకుంటారు. ఫాంటసీలలో జీవించడం మానేసి భౌతిక ప్రపంచం ప్రకారం నడవడానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడతారు.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. పనికి సంబంధించిన కొన్ని పెద్ద సవాలు మీ ముందుకు వస్తుంది. అలాగే మీరు ఇందులో విజయం సాధిస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీరు సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. మీరు కొత్త వెంచర్‌లోకి ప్రవేశించే బలమైన సూచనలు ఉన్నాయి. విదేశీ పరిచయాలు మీకు మంచి చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసొస్తుంది.