ABP Desam


ఈ రాశులవారికి అనుకోని ఆదాయం వస్తుంది


ABP Desam


మేష రాశి
ఈ రాశివారు తండ్రి సహాయంతో చేసే పనులు విజయవంతమవుతాయి. మీ పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. చేసిన పనికి తగిన ఫలితం పొందుతారు. సబార్డినేట్ ఉద్యోగి లేదా సోదరుడి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మీ రహస్యాలను వెల్లడించవద్దు.


ABP Desam


వృషభ రాశి
వృషభ రాశి జాతకులు తమ ప్రియమైన వారు చేసే రాజకీయాలకు బలైపోతారు. సామాజిక జీవితంలో ప్రజాదరణ పెరుగుతుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో సంబంధం దృఢంగా ఉంటుంది


ABP Desam


మిథున రాశి
మిథున రాశి వారు బుధవారం కుటుంబ కార్యక్రమాలలో మరింత బిజీగా ఉంటారు. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సమస్యలతో భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా వ్యవహరించాలి. ఈ రోజు మీర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


ABP Desam


కర్కాటక రాశి
ఈ రోజు కుటుంబ కలహాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. సమిష్టి చర్యల్లో అందరి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ఆరోగ్యంలో ఫ్రెష్ నెస్ ఉంటుంది.


ABP Desam


సింహ రాశి
కార్యాలయంలో బిజీగా ఉండడం వల్ల ఇంటిపనులపై దృష్టి సారించలేరు. ఆలోచించి అప్పు ఇవ్వడం మంచిది లేదంటే డబ్బు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. ఉద్యోగం, వ్యాపారం బాగానే సాగుతుంది.


ABP Desam


కన్యా రాశి
కన్యా రాశి వారి ప్రణాళికలు ఈ రోజు కార్యరూపం దాల్చుతాయి. సమస్యల పరిష్కారంతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని ఒత్తిడిల కారణంగా నిర్ణయాలు తీసుకోలేరు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.


ABP Desam


తులా రాశి
ఈ రోజు తులారాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటంది. సరదా కోసం ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు బహుమతులు అందుకునే అవకాశం ఉంది.


ABP Desam


వృశ్చిక రాశి
కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. నాటకరంగంతో సంబంధం ఉన్న వ్యక్తుల విలువ పెరుగుతుంది. కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రాశివారు అపరిచితులను నమ్మొద్దు. అనుకున్న పనులు పూర్తికావు. ఆకస్మిక ఖర్చులు బడ్జెట్ పై ప్రభావం చూపుతాయి. ఎవరితోనైనా అనవసర వివాదాలు తలెత్తుతాయి. మాటతూలొద్దు.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి వ్యాపార పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పనిలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. దాన ధర్మాలు చేయడానికి ఇదే సరైన సమయం.


ABP Desam


కుంభ రాశి
ఈ రాశివారికి ఓపిక చాలా అవసరం. తొందరపాటు వల్ల నష్టపోతారు. చట్టపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. చిన్న విషయాలకు వివాదం తలెత్తే అవకాశం ఉంది. తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు.


ABP Desam


మీన రాశి
పని చేసే ప్రదేశంలో తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. విమాన ప్రయాణం చేయే అవకాశం ఉంది. దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.