అన్వేషించండి

Guppedantha Manasu జూన్ 15 ఎపిసోడ్: సాక్షికి షాక్, దేవయానికి స్ట్రోక్, రిషిపై ప్రేమ జల్లు - వసుధారతో అట్లుంటది మరి!

Guppedantha Manasu June 15 Episode 477: గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఈగోమాస్టర్ ని డైలమాలో పడేసింది. జూన్ 15 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జూన్ 15 బుధవారం ఎపిసోడ్

వసుధార-జగతి-మహేంద్ర ముగ్గురూ ఓ గ్రౌండ్ లో నిల్చుని ఉంటారు..
వసుధార: రిషి సార్ ని లోపలకు ఎలా పంపించారు?
జగతి: అసలు నువ్వెందుకు వెళ్లావ్ అది ముందు చెప్పు?( మహేంద్ర నవ్వుతూ చూస్తుంటాడు)..నీ ప్రాణాలు లెక్కచేయకుండా నువ్వు లోపలకు ఎందుకు వెళ్లావ్..నువ్వు చెప్పలేవు కానీ సమాధానం ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు.
మహేంద్ర: జగతి ఇప్పుడెందుకు ఇవన్నీ
జగతి: ఒక మనిషి మనసు ఆలోచన, తత్వం ఓ విపత్కర సమయంలోనే బయటపడుతుంది.. ఇదే ప్రశ్న రిషి అడిగితే ఏం చెబుతావు
మహేంద్ర: నువ్వు రిషిని కాపాడావ్..దాన్ని మేం అభినందిస్తున్నాం..
జగతి: నీ ఆరాటం, ఉద్వేగం, భయం..నువ్వేంటో నీ మనసేంటో చెబుతున్నాయ్. ఏంటిది అని అడిగాను నువ్వు సమాధానం చెప్పలేదు. నేను అడిగిన ప్రశ్నే రిషి అడిగితే సమాధానం సిద్ధం చేసిపెట్టుకో.. నిజం దాచి పెట్టి ఇంకేదో చెప్పడం నీకీ మధ్య అలవాటైనట్టుంది కదా..
అక్కడి నుంచి మహేంద్ర-జగతి వెళ్లిపోతారు

Also Read: అప్పుడు డాక్టర్ బాబుని వెంటాడిన మోనిత - ఇప్పుడు డాక్టర్ సాబ్ ని వెంటాడుతోన్న శోభ - యూ టర్న్ తీసుకున్న కార్తీకదీపం

రిషి: రూమ్ లో కూర్చున్న రిషి..వసుధార తనకోసం పడిన ఆరాటం అంతా గుర్తుచేసుకుంటాడు. అసలు ఏంటీ వసుధార ఇలా మాట్లాడిందేంటి..ప్రాణాలకు తెగించి అంత రిస్క్ చేసింది..అంతమంది ఉన్నా ఎవ్వరూ లోపలకు వచ్చే ధైర్యం చేయలేదు.. మరి తనేంటి అలా వచ్చింది.. ఏంటీ..వసుధారలో ఈ మార్పు తన మనసు మారిందా-ఆలోచనల్లో మారిందా-ఇదంతా తన ఇష్టం అనుకోవాలా..తొందరపాటుతో నేను ముందే నా ఇష్టాన్ని చెప్పేశానా-క్లారిటీ లేనిది ఎవరికి-నాకు క్లారిటీ లేదంది కానీ నిజానికి క్లారిటీ లేనిది వసుధారకే అని ఈ రోజే అర్థమైంది- ఈ రోజు వసుధార మాట్లాడిన మాటలు వింటే తన మనసేంటో తనకే అర్థం కానట్టుంది-వసుని సరిగ్గా అడిగితే తెలిసిపోతుంది-నువ్వేంటి నీ మనసేంటి అని అడిగితే?-వద్దులే అడిగితే తిప్పి తిప్పి ఇంకేదో సమాధానం చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు క్లారిటీ లేదని చెబుతుంది- అసలు వసుధార గురించి ఆలోచనే నాకొద్దు.

వసుధార: కాలేజీలో ఓ మూల కూర్చుని జరిగినదంతా గుర్తుచేసుకుంటుంది. నాకేమైంది..నాకు రిషి సార్ అంటే నిజంగా ఇష్టం ఉందా అనుకుంటుంది. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇస్తుంది సాక్షి. 
సాక్షి: హలో వసుధార గారు ఇక్కడున్నారా..మీకోసం కాలేజీ అంతా వెతికాను. కంగ్రాట్స్..రిషి విషయంలో సాహసం చేశావంటగా.. అందుకే స్వీట్ బాక్స్ తో వచ్చాను..స్వీట్ తీసుకో..
వసుధార: కోపంగా లేచి నిల్చుంటుంది
సాక్షి: రిషికి సాహయం చేసినందుకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను. ఇలాంటి సమయంలో అభినందన సభ పెడితే బావోదు కదా..స్వీట్ తీసుకో
వసుధార: సాక్షిని చూసి నవ్వుకున్న వసుధార..లోపల భయపడుతూ బయటకు నన్ను అభినందిస్తున్నావ్ కదా..
సాక్షి: లోపల బయటా ఒకేలా ఉంటాను.. రిషికి హెల్ప్ చేస్తే నాకు చేసినట్టే కదా..
వసుధార: నేనుకూడా చాలా సంతోషంగా ఉన్నా సాక్షి...తప్పకుండా స్వీట్ తింటా అని ఓ ముక్కు తీసుకుని.. మరో స్వీట్ సాక్షి నోట్లో కుక్కుతుంది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావ్.. నువ్వు స్వీట్ తీసుకొచ్చి నన్ను అభినందిస్తే కన్ఫ్యూజ్ అవుతా అనుకుంటున్నావా...నాకు అన్ని కన్ఫ్యూజన్స్ పోయాయ్.. గుర్తుపెట్టుకో..చాలా క్లారిటీగా ఉన్నాను సాక్షి. ఇంతకుముందులేని క్లారిటీ అంతా ఇప్పుడొచ్చేసింది..
సాక్షి: ఏ విషయంలో క్లారిటీ వచ్చింది..
వసుధార: అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది..
సాక్షి: అంటే కొంపతీసి నువ్వు..
వసుధార: కొంపతీసి ఏంటి కొంపతీయకుండానే క్లారిటీగా ఉన్నాను..నీ కళ్లలో భయం ఉంది..నేను షో చేయడం లేదు.. నీలాంటి మ్యాటర్ లేనివాళ్లే షో చేస్తూ ఉంటారు. షో చేయడానికి నాకేం అవసరం.. ఎలా ఉండాలో అలాగే ఉంటాను.
సాక్షి: నువ్వు నేను ఊహించిన దానికన్నా చాలా స్పీడ్ గా ఉన్నావ్.. 
వసుధార: నీకు గూఢాచారులు చాలామంది ఉన్నట్టున్నారు..నువ్వు తెలుసుకోవాల్సింది కాలేజీలో ఏం జరుగుతోంది అన్నది కాదు నా మనసులో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి.. ఎన్ని జన్మలెత్తినా తెలుసుకోలేవు..
సాక్షి: నా మనసు ఇక్కడుంది..ఎందుకంటే రిషి ఇక్కడున్నాడు కాబట్టి..
వసుధార: అన్నీ నువ్వనుకుంటే సరిపోదు..రిషి సార్ కూడా అనుకోవాలి కదా..అనుకుంటున్నారా..లేదు కదా.. నిన్ను అవైడ్ చేస్తున్నారు కదా..నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయడం లేదు..నువ్వే అవుతున్నావ్0
సాక్షి: నువ్వు రిషిని అనుకున్నావ్ కదా..మళ్లీ ఏదోలా మాట్లాడుతున్నావ్
వసుధార: వద్దని నీకు చెప్పానా..చెప్పలేదు కదా..చెప్పానే అనుకో..ఇప్పుడు కాదంటున్నాను కదా..సాక్షి నీకో మాట చెప్పనా .. నువ్వు రిషి సార్ ని ఎప్పటికీ చేరుకోలేవు.. రిషి సార్ ని నేనెప్పటికీ వదులోకోలేను.. 
సాక్షి: అంటే ఏంటి నీ ఉద్దేశం
వసుధార: సింపిల్..ఇన్నాళ్లూ నువ్వేదనుకున్నావో అదే అనుకో..అదే నిజమవుతుంది అనుకో.. 
సాక్షి: నాకు అర్థంకాలేదు..క్లియర్ గా చెప్పు..
వసుధార: నీకు అర్థమైందని నాకు తెలుసు..స్వీట్ ఇచ్చావ్ కదా నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ గతంలో సాక్షి ఇచ్చిన చెక్ తిరిగి ఇస్తుంది.. ఈ చెక్ వట్టి పేపర్..బ్యాంకుకి వెళ్లి క్యూలో నిల్చుని డ్రా చేసుకుంటే కానీ విలువలేదు.. ఈ రూపాయి ఉంది చూడా దీనికి ఇప్పుడు విలువ ఉంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా విలువ ఉంటుంది.. సాక్షి నువ్వు ఈ చెక్ లాంటిదానివి కొన్ని సందర్భాల్లోనే చెల్లుతావ్.. నేను ఈ రూపాయి బిళ్లలాంటిదాన్ని ఎప్పుడూ విలువ కలిగే ఉంటాను.  స్వీట్ చాలా బావుంది థ్యాంక్యూ...
సాక్షి: రిషి విషయంలో మనసు మార్చుకుందా..నన్ను భయపెడుతోందా..వసుని లైట్ తీసుకుంటే కొంప ముంచేలా ఉంది. ఓ కంట కనిపెట్టాలి

Also Read: ఇది కాదా L-O-V-E, వసు తనని ప్రేమిస్తోందని రిషికి క్లారిటీ వచ్చినట్టేనా!

అటు వసుధార కాలేజీలో నడుచుకుంటూ వెళుతూ అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని రిషికి మెసేజ్ చేస్తుంది. కట్ చేస్తే ఇద్దరూ ఓ గ్రౌండ్ లో ప్రత్యక్షమవుతారు..
రిషి: ఏంటి రమ్మని మెసేజ్ పెట్టావ్
వసుధార: మాట్లాడాలి.. ఇపార్టెంట్ విషయం
రిషి: ఇంపార్టెంట్ నీకా-నాకా
వసు: మనకి.. కాలేజీలో జరిగిన విషయం తలుచుకుంటే భయం వేస్తోంది..నా బ్రెయిన్ మొద్దుబారిపోయింది.. అందుకే ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు..అంత పొగలున్నా లోపలకు వచ్చేశాను..
రిషి: అయితే థ్యాంక్స్ చెప్పించుకునేందుకు రమ్మన్నావ్
వసుధార: నేనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను
రిషి: దేనికి
వసు: ఇది అని స్పష్టంగా చెప్పలేను కానీ నాకో విషయం అర్థమైంది.. ల్యాబ్ లో అన్నమాటలు నా గుండెల్లోంచి వచ్చినవే సార్. మీకేవైనా జరిగితే మరుక్షణమే ఈ వసుధార గుండె ఆగిపోతుంది సార్. నిజం సార్..మీరు లేకుండా నేను బతకలేను. ఇష్టమో-ప్రేమో- ఇంకొకటో నాకు తెలియదు సార్ నేను మిమ్మల్ని ......

ఎపిసోడ్ ముగిసింది....

Also Read: హిమ మెళ్లో తాళి కట్టేసిన నిరుపమ్, మొత్తం జ్వాల చూసేసింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget