అన్వేషించండి

Karthika Deepam జూన్ 15 ఎపిసోడ్: అప్పుడు డాక్టర్ బాబుని వెంటాడిన మోనిత - ఇప్పుడు డాక్టర్ సాబ్ ని వెంటాడుతోన్న శోభ - యూ టర్న్ తీసుకున్న కార్తీకదీపం

Karthika Deepam june 15th Episode 1379: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 15 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 15 బుధవారం ఎపిసోడ్ 

హిమ:నిరుపమ్ కి ప్రపోజ్ చేయకుండా జ్వాల (శౌర్య) వెనుతిరిగి వెళ్లిపోవడంతో ఏం జరిగిందని నిలదీస్తుంది హిమ. తన శత్రువు కాల్ చేసిందన్న జ్వాల మాటలువిని హిమ షాక్ అవుతుంది. తన పేరుతో ఎవరు కాల్ చేశారని ఆలోచిస్తుంది. ఈ డైలమా తీరాలంటే తానే హిమ అని చెప్పేద్దామా అనుకుంటుంది. కానీ వద్దులే అసలు విషయం చెబితే మొదటికే మోసం వస్తుందని ఆలోచిస్తుంది. 

శోభ: బ్యాంక్ లోన్స్ ఎక్కువవుతున్నాయి ఇవన్నీ మీకు తలనొప్పి అవుతుంది మేడం అని చెబితే..నేను చూసుకుంటాలే వెళ్లు అని తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని పంపించేస్తుంది. నిరుపమ్ ని పెళ్లిచేసుకుంటే కానీ అప్పులన్నీ తీరవ్..అందుకోసమైనా అదే పనిలో ఉండాలి అనుకుంటుంది. ఇంతలో అక్కడకు ఓ పేషెంట్ వచ్చి ఈ బ్లడ్ గ్రూప్ అస్సలు దొరక్కపోతే గతంలో డాక్టర్ హిమ ఇచ్చారని చెబుతుంది. అదేంటి హిమకు బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ కదా బ్లడ్ ఎలా ఇచ్చింది...అంటే ఇదంతా డ్రామానా అని డౌట్ పడుతుంది శోభ.

జ్వాల: నేను హిమ గురించి వెతుకుంటే హిమ నా గురించి వెతుకుతోందా...లేదంటే ఎవరైనా హిమ పేరుతో కాల్ చేసి బెదిరిస్తున్నారా.. అవన్నీ ఇప్పుడెందుకు ఆలోచించడం...నిజంగా నా శత్రువు ఎదురుపడితే చూద్దాం అనుకుంటుంది..

Also Read: హిమ మెళ్లో తాళి కట్టేసిన నిరుపమ్, మొత్తం జ్వాల చూసేసింది!

అటు హాస్పిటల్ బయట ఎదురుచూస్తున్న శోభ...హిమ నిజంగా బ్లడ్ ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చిందంటే నా అనుమానం నిజమైనట్టే అనుకుంటుండగా హాస్పిటల్లోకి ఎంట్రీ ఇస్తుంది హిమ. మరోవైపు నిరుపమ్ దగ్గరకు వెళుతుంది జ్వాల.. నేను ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్లినందుకు డాక్టర్ సాబ్ కి కోపం వచ్చిందేమో అని జ్వాల మనసులో అనుకుంటూ... తింగరి కనిపించడం లేదని అడుగుతుంది. ఏంటో ఫస్ట్ టైమ్ డాక్టర్ సాబ్ తో మాట్లాడాలంటే భయమేస్తోంది అనుకుంటూనే... అనుకోకుండా ఓ కాల్ వచ్చింది అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది sorry అంటుంది. గతంలో హిమపై కోపంతో తాగిఉన్నప్పుడు నిరుపమ్ ఐలవ్ యూ చెప్పిన విషయం గుర్తుచేస్తూ తల కిందకు వచ్చి మాట్లాడుతుంటుంది. మీరంటే ఇష్టం అని చెప్పేసి నెమ్మెదిగా తల పైకెత్తి చూసి షాక్ అవుతుంది. అక్కడ నిరుపమ్ ఉండడు..ఎప్పుడు వెళ్లాడో కూడా గమనించదు.    

మరోవైపు హాస్పిటల్లో హిమని పలకరించిన శోభ..నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. డాక్టర్ షణ్ముఖ్ రావుగారు స్పెషలిస్ట్ కదా తనని కలుద్దాం అని వచ్చాను.ఎంత బాగా నటిస్తావ్ హిమా..అమాయకంగా కనిపిస్తావ్ కానీ నీలో మహానటి దాగుంది అంటుంది శోభ. ఇంతలో ఇద్దరు పేషెంట్లు వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతారు. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ...

శోభ మనసులో అనుకుంటుంది...''నీకు జ్వాల ఎవరో తెలుసు కానీ ఇంట్లో చెప్పవ్.. ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి నిరుపమ్ ని వద్దన్నావ్..నిరుపమ్ తో జ్వాలకి పెళ్లి చేయాలని చూస్తున్నావ్ కానీ ఎందుకో ఏంటో తెలియదు...నీ క్యాన్సర్ సంగతి నాటకం..నీ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం నాటకం...నిరుపమ్ తో జ్వాల పెళ్లి చేయాలి అనుకోవడం నాటకం..నీ నాటకాలు బయటపెట్టి ..నీ ఫ్యామిలీని అల్లకల్లోలం చేస్తాను...నిరుపమ్ ని సొంతం చేసుకోవడమే నా ధ్యేయం''

Also Read: ఇది కాదా L-O-V-E, వసు తనని ప్రేమిస్తోందని రిషికి క్లారిటీ వచ్చినట్టేనా!

హిమ: ఇంట్లో కూర్చుని శౌర్య ఫొటో చూస్తూ బాధపడుతుంది. ఇన్నేళ్లుగా దూరమయ్యాం..ఇప్పుడు ఎదురుగా ఉన్నా పరిస్థితి అనుకూలించడం లేదనుకుంటూ జరిగిన సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటుంది. నీ మనసులో నిరుపమ్ బావ ఉన్నాడని తెలిసినప్పటి నుంచీ నా మనసు చంపుకున్నాను...నా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాను..మీ ఇద్దరికీ పెళ్లిచేయాలని నిర్ణయించుకున్నాను..కానీ నేను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది..శౌర్య... నీకోసం ఏంత చేయాలో అంతా చేస్తున్నాను..ఆఖరికి బావ మనసు మార్చాలని క్యాన్సర్ వచ్చిందని నాటకం ఆడాల్సి వచ్చింది..నామీద అంత ప్రేమ ఉన్న బావ ఎంతో బాధపడ్డాడు... ఆ టైమ్ లో చివరి కోరికగా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ నాకు క్యాన్సర్ అని తెలిసినా కూడా ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు... నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు...నేను బావని పెళ్లిచేసుకున్నాక నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే నా పరిస్థితేంటి... బావ ఎలా ఫీలవుతాడు..పెళ్లయ్యాక కూడా శౌర్యని బావని కలపాలని నేను ప్రాణాలు తీసుకుంటే...వద్దు అలా చేస్తే అప్పుడు బావని నేను ఇష్టపడ్డానన్న విషయం శౌర్యకి తెలిసిపోతుంది..ఇంత చేసి కూడా శౌర్య మనసుని కష్టపెట్టిన దాన్నవుతాను.. మరి బావని-శౌర్యని ఎలా కలపాలి..దేవుడా ఏం చేయాలి....అనుకుంటుంది.

అటు ఇంట్లో తల్లిదండ్రులతో కలసి భోజనం చేస్తున్న నిరుపమ్... జ్వాల మాటలు తలుచుకుని చిరాకు పడతాడు. అనవసరంగా హిమ..జ్వాల మనసులో లేని ఫీలింగ్స్ పెంచింది...

Also Read: వంటల పోటీల్లో వెనిగర్ పంచాయితీ- జానకి మాటతో ఉలికిపడ్డ సునంద- ఇక రామచంద్ర గెలిచినట్టేనా?

రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
గురువారం ఎపిసోడ్‌లో గుళ్లో హిమకు తాళి కట్టేస్తాడు నిరుపమ్. అది జ్వాల చూస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget