Guppedanta Manasu Serial Today June 10th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మనును నిలదీసిన వసు - కాలేజీ కోసమైనా రిషి లేడని నమ్మాలన్న ఫణీంద్ర
Guppedanta Manasu Today Episode: రిషి లేడన్న విషయం తాను నమ్మడం లేదని మంత్రిగారికి చెప్పి మీటింగ్ లోంచి వసుధార వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మంత్రి గారు వచ్చి రిషి కనపించడం లేదని ఇక రిషి చనిపోయి ఉంటాడని అనడంతో వసుధార నమ్మదు. రిషి సార్ బతికే ఉన్నాడని మీరెంత చెప్పినా నా మనసు మారదు అంటూ వెళ్లిపోతుంది. దీంతో మంత్రిగారు కోపంగా ఫీలవుతాడు. ఒక కాలేజీకి ఎండీగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అంటూ నిలదీస్తాడు. ఇలాగే ఉంటే ఈ కాలేజీ ప్రతిష్ట దిగజారిపోతుంది అని చెప్పి మంత్రి గారు వెళ్లిపోతారు. తర్వాత మను ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని వసు నిలదీస్తుంది.
మను: మేడం నేనిప్పడు ఆలోచిస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మన కాలేజీకి సెంటర్ రాకుండా అడ్డుపడింది ఎవరు? ఎందుకు అలా చేశారు. ఆ అవసరం ఎవరికుంది అని ఆలోచిస్తున్నాను మేడం.
వసు: ఆ విషయం గురించి అంతలా ఆలోచించాల్సిన పని లేదు మను గారు. దానంతటికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ శైలేంద్రే..
మను: అవును మేడం తనే చేశాడని నాక్కూడా తెలుసు. కానీ తనని ఏమీ చేయలేకపోతున్నాము.
అని ఇద్దరూ మాట్లాడుకుంటుండగా చాటు నుంచి వీళ్ల మాటలు వింటున్న శైలేంద్ర అది ఈ శైలేంద్ర గొప్పదనం. ఇప్పుడే కాదు ఏప్పుడైనా సరే మీరు నన్నేం చేయలేరు అని మనసులో అనుకుంటాడు. ఇంతలో వసుధార, మనును రిషి సార్ బతికే ఉన్నాడన్నా నమ్మకంతో ఉన్నారా? అని అడుగుతుంది. దీంతో మను అదేం లేదు అంటాడు. మరోవైపు మహేంద్ర దగ్గరకు వెళ్లి ఫణీంద్ర ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అంటాడు. నాన్నగారు ఈ కాలేజీ మన చేతుల్లో పెడుతూ ఏం చెప్పారో తెలుసా? అని సాయంత్రం వసును తీసుకుని ఇంటికి రా అని చెప్పి వెళ్లిపోతాడు. మహేంద్ర, వసుధార చాంబర్‌లోకి వెళ్తాడు.
వసు: మీరు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నారా? మామయ్యా..
మహేంద్ర: ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అమ్మా
వసు: రిషి సార్ గురించి చెప్పండి మామయ్య అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు కదా మీరు కూడా అలాగే అనుకుంటున్నారా మామయ్యా.. నా ప్రాణం బతికి ఉందని చెప్పినా ఎవ్వరూ వినరేంటి మామయ్యా..
అనగానే నేను నిన్ను నమ్ముతున్నాను అమ్మా.. అంటూ అన్నయ్యా సాయంత్రం మనల్ని ఇంటికి రమ్మని చెప్పారు. ఏదో నిర్ణయం తీసుకుందామంటున్నారు. మనం ఏదైనా సరే వెళ్లి మాట్లాడి తేల్చేద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఫణీంద్ర ఇంట్లో వసు, మహేంద్రల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎవరెవరో ఫోన్ చేసి మీ కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్ తీసేశారంటా అని తమ మాటలతో ఫణీంద్రను విసిగిస్తుంటారు.
దేవయాని: చూస్తున్నారా అండి ఆ వసుధార చేసిన పనివల్ల మీరిప్పుడు ఫోన్ స్విచ్చాప్ చేయాల్సి వచ్చింది.
శైలేంద్ర: డాడ్ మీరిప్పుడు ప్రస్టేట్ అవ్వకండి.. కానీ మీరిప్పుడు ప్రస్టేట్ అయితే మీ హెల్త్ కే ప్రాబ్లమ్ అవుతుంది. మీరే చూశారు కదా మంత్రి గారి ముందు ఆ వసుధార ఎలా మాట్లాడిందో..
ధరణి: మామయ్యగారు చూస్తుంటే దీని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది.
అని చెప్తుండగానే మహేంద్ర, వసుధార వస్తారు.
మహేంద్ర: చెప్పండన్నయ్యా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. వసుధారను కూడా తీసుకురావాలని అన్నారు.
ఫణీంద్ర: అమ్మా వసుధార నాకు రిషి అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం అమ్మా.. నిన్ను మా ఇంట్లో బిడ్డలా అనుకునేవాడిని. నువ్వు మా ఫ్యామిలీలోకి వచ్చాక ఇంట్లో నిండుతనం వచ్చింది. కానీ విధి ముందు తల వంచక తప్పలేదు. ఈ రోజు కుటుంబం చిన్నాభిన్నం అవుతుందనుకోలేదు. ఇప్పుడు ఏ పరిస్థితులైతే ఇలా చేశాయో.. అవే పరిస్థితుల వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందమ్మా..
వసు: మీరు చెప్పండి సార్ మీ మాట నేనెప్పుడూ కాదనలేదు. మామయ్య మాట ఎలాగో నాకు మీ మాట కూడా అలానే సార్. ఎండీ పదవి ఏమైనా వదిలేయమంటారా?
అనగానే శైలేంద్ర, దేవయాని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఫణీంద్ర దాని గురించి కాదని రిషి గురించి అని రిషి లేడన్న విషయాన్ని నువ్వు నమ్మాలని చెప్తాడు. దీంతో వసుధార షాక్ అవుతుంది. మీరేం చెప్పినా వింటానని నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తానని రిషి సార్ లేడంటే నేను ఒప్పుకోనని చెప్తుంది. దీంతో నువ్వు అడిగిన టైం అయిపోవచ్చింది రిషి ఇంకా వస్తాడు రాడు అని నాన్చుతూ ఉండకూడదు అని ఫణీంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్... NBK109 సెకండ్ వీడియో గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్!