Guppedanta Manasu Serial Today July 27th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: శైలేంద్రతో వెళ్లిపోయిన రంగ – మహేంద్రే తన తండ్రి అని తెలుసుకున్న మను
Guppedanta Manasu Today Episode: రిషి లా నటించేందుకు శైలేంద్రతో రంగ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode:
దేవయాని దగ్గరకు మను, అనుపమ వెళ్తారు. దారి తప్పి వచ్చారా? అని అడుగుతుంది దేవయాని. లేదు కొంతమంది వ్యక్తులను కలవడానికి వచ్చానని అనుపమ చెప్తుంది. ఆ కొంత మంది వ్యక్తులు ఎవరో అని దేవయాని అడుగుతుంది. దీంతో మహేంద్రను కలవడానికి వచ్చామని చెప్పడంతో మహేంద్రకు మిమ్మల్ని కలవడం ఇష్టం లేదని చెప్తుంది దేవయాని. ఇంతలో మహేంద్ర వస్తాడు.
మహేంద్ర: ఎప్పుడొచ్చారు అనుపమ
అను: ఇప్పుడే వచ్చాము మహేంద్ర.
మహేంద్ర: కూర్చోండి..
మను: ఎలా ఉన్నారు సార్
మహేంద్ర: ఏదో అలా ఉన్నాను అంటే ఉన్నాను. జీవితంలో అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలాను.
మను: సారీ సార్ మీ నుంచి వెళ్లిపోయినందుకు.
మహేంద్ర: సారీ ఎందుకు మను. అయినా బంధువులే రాబంధువుల్లా పొడుచుకుతింటున్నారు. కానీ మీరు ఏ సంబంధం లేకపోయినా నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. సరే మీరెలా ఉన్నారు. ఏదైనా పనిమీద వచ్చారా?
అను: అవును మహేంద్ర మేము పర్మినెంట్‌గా ఈ సిటీ వదిలి వెళ్లిపోదామని నేను నా కొడుక్కి చెప్పాను. తను కూడా ఒప్పుకున్నాడు. వెళ్లే ముందు ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చాము.
మహేంద్ర: ఏంటి మను ఇది. మీ అమ్మ చెప్పేది నిజమేనా? నువ్వు ఇక్కడికి ఒక ప్రశ్నతో వచ్చావు. దానికి సమాధానం తెలుసుకోకుండానే వెళ్తావా?
మను: ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సర్.
అనగానే మను తండ్రి గురించి అనుపమకు తెలిసిందో లేదంటే నాకు తెలిసింది చెప్పమంటారా అని దేవయాని అనగానే అనామిక చెప్పు నీకు తెలిసిన నిజం ఏంటో చెప్పు అంటుంది అనామిక. దీంతో దేవయాని షాక్ అవుతుంది. మను, మహేంద్ర దగ్గరకు వెళ్లి ఆశీర్వదించమని అడుగుతాడు. మహేంద్ర, మనును ఆశీర్వదించి లోపలికి వెళ్లిపోతాడు. మీకు జీవితంలో ఏమాత్రం పౌరుషం, రోషం ఉన్నా మళ్లీ మా ఇంట్లో అడుగుపెట్టొ్ద్దని అనుపమను తిడుతుంది దేవయాని. దీంతో అనుపమ, మను వెళ్లిపోతుంది. మరోవైపు శైలేంద్ర దగ్గరకు వెళ్లిన రంగకు ఒక సూట్‌కేసు ఇచ్చి వెంటనే మనం సిటీకి వెళ్దాం పద అంటాడు. రంగ సరేనని బుజ్జికి సూటుకేస్ ఇచ్చి వస్తానని బుజ్జి దగ్గరకు వెళ్తాడు.
రంగ: నేను ఒక పని మీద మా నాన్నమ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి.
బుజ్జి: నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే ఏం చెప్పాలన్నా?
రంగ: ఏం చెప్పొద్దు... అన్న వస్తాడని చెప్పు. అంతే చాలు ఇదిగో ఈ డబ్బుల తీసుకెళ్లి నాన్నమ్మని హాస్పిటల్‌లో చూపించు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో డాక్టర్‌ను అడిగి నాకు చెప్పు.
బుజ్జి: అలాగే అన్న మరి మేడం గారు అడిగితే ఏం చెప్పాలి.
రంగ: ఈ రింగ్ నేను ఇచ్చానని చెప్పి మేడం గారికి ఇవ్వు.
బుజ్జి: ఇదేంటన్నా దీని మీద వీఆర్ అని ఉందేంటి?
రంగ: రేయ్ నేను చెప్పింది చెయ్యరా?
బుజ్జి: రాముడు హనుమంతునికి అంగుళీకము ఇచ్చి సీతమ్మకు ఇమ్మన్నట్లు ఉందన్న.
రంగ: అంతే అనుకో నువ్వు ఈ రింగ్ మేడం గారికి ఇస్తే చాలు. ఈ రింగుతో పాటు నేను ఆ సార్ దిగిన ఫోటో మేడం గారికి చూపించు.
అని చెప్పి నువ్వు కూడా ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తుంటాను అలాగే చేస్తుండాలి అని రంగ చెప్పగానే బుజ్జి ఓకే అంటాడు. శైలేంద్ర, దేవయానికి ఫోన్ చేసి రంగాను సిటీకి తీసుకొస్తున్నాను అని చెప్తాడు. మరోవైపు మను నిజం తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను నా కన్నతండ్రి మహేంద్ర సారేనా? అని అనుపమను అడుగుతాడు. దీంతో అనుపమ షాక్ అవుతుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది అని అడుగుతుంది. సార్ ను కలిసిన మొదటిరోజు నుంచి ఇవాళ్టీ వరకు ఆయనను చూస్తే ఒక రకమైన ఎఫెక్షన్ అనిపిస్తుంది అని చెప్తాడు. దీంతో నేనేం చెప్పలేనని.. ఏం మాట్లాడలేనని అనుపమ చెప్తుంది. దీంతో కోపంగా అసలు నువ్వు నా అమ్మవేనా అంటూ నిలదీస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.