Guppedanta Manasu Serial Today July 26th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: శైలేంద్ర డీల్ కు ఒప్పుకున్న రంగ – వసుధారకు గిఫ్ట్ ఇచ్చిన రాధమ్మ
Guppedanta Manasu Today Episode: వసుధారను ఇంటికి వెళ్లిపోమ్మన్న రంగ, శైలేంద్ర డీల్ కు ఓకే చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: శైలేంద్ర దగ్గరకు వెళ్లిన రంగాకు రిషి ఫోటో చూపిస్తాడు శైలేంద్ర. ఫోటో చూసిన రంగా షాక్ అవుతాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడని రంగ అడగ్గానే నా తమ్ముడు లేడని చనిపోయాడని అందుకే నీతో పని పడిందని నువ్వు నాతో వచ్చి నా తమ్ముడు రిషిలా నటించాలని బతిమాలుతాడు. రంగా రాలేనని నాకు చదువు రాదని చెప్పడంతో నువ్వు వస్తే నీకు 5 కోట్లు ఇస్తానని ఆశ చూపిస్తాడు శైలేంద్ర. దీంతో నేను అలా చేయలేనని చెప్పి వెళ్లిపోతాడు రంగ. తర్వాత శైలేంద్ర, దేవయానితో మాట్లాడతాడు.
దేవయాని: ఏంటి 5 కోట్లు ఆఫర్ చేశావా?
శైలేంద్ర: అవునమ్మా 5 కోట్లు ఆఫర్ చేశాను. ఐనా వాడు ఏం సమాధానం చెప్పలేదు. ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఒప్పుకుంటాడని అనిపిస్తుంది.
దేవయాని: వాడు నిజంగానే రిషి కాదా?
శైలేంద్ర: అయ్యో మామ్ మళ్లీ అదే డౌటా? పక్కాగా చెప్తున్నాను వాడు రిషి కాదు. రంగానే. వాడు ఆటో డ్రైవర్.
దేవయాని: అయినా ఆటో డ్రైవర్‌కు 5 కోట్లు ఏంటి నాన్నా?
శైలేంద్ర: వాడిప్పుడు ఆటోడ్రైవర్ కావొచ్చు మామ్ కానీ గెటప్ మార్చితే రిషి అయిపోతాడు కదా? 5 కోట్లు పెట్టొచ్చులే?
అని ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా చాటు నుంచి ధరణి వింటుంది. మరోవైపు రంగ, శైలేంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వసుధార వస్తుంది.
రంగ: మేడంగారు మీరు నా నోటితో నేనే రిషి సార్ అని చెప్పించాలని చూస్తున్నారు. మీరు అదే పనిలో ఉండండి. నేనేం అనను . కానీ అక్కడ జరగాల్సింది జరిగిపోతూనే ఉంటుంది. మీ కాలేజీని గవర్నమెంట్ హ్యాడోవర్ చేసుకుంటుంది అన్నా మీరు పట్టించుకోరు.
వసుధార: ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు.
రంగ: మేడం గారు నేను మిమ్మల్ని హర్ట్ చేయడం లేదు. మీ ప్రవర్తన ఎలా ఉందో చెప్తున్నాను. మీరు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో చెప్తున్నాను.
వసుధార: నాది స్వార్థం కాదు సార్. అసలు ఎందుకు మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు.
రంగ: సరే మేడం గారు మీ దృష్టిలో నేను ఎవరిని? పర్వాలేదు చెప్పండి మేడం గారు.
వసుధార: రిషి సార్
రంగ: అంటే నేను మీ రిషి సార్ అని మీరు నమ్ముతున్నారు కదా?
వసుధార: పక్కాగా నమ్ముతున్నాను సార్.
రంగ: అలాంటప్పుడు రిషి సార్ ఇక్కడున్నారని మీవాళ్లకు ఎందుకు చెప్పడం లేదు.
వసుధార: మీరు కాదంటున్నారు కదా సార్.
రంగ: అంటే నేను కాదంటున్నాను కాబట్టి ఆగిపోయాను అంటున్నారు.
వసుధార: అవును సార్.
రంగ: ఈ ప్రపంచం మొత్తం మీ రిషి సార్ చనిపోయాడని చెప్పినప్పుడు మీరెందుకు నమ్మడం లేదు. అక్కడి నుంచి ఎందుకు వచ్చారు.
వసుధార: అది వేరు ఇది వేరు సర్ మీరే రిషి సర్ ఇందులో మరో మాటే లేదు.
రంగ: మీరు అంత గట్టిగా నమ్మినప్పుడు నా మాటలతో మీకు పనిలేదు. మీ వాళ్లకు చెప్పి వాళ్లను ఇక్కడికి తీసుకురావొచ్చు కదా? కానీ తీసుకురాలేరు. ఎందుకంటే నేనే మీ రిషి సర్ అని మీకు ఇంకా క్లారిటీ రాలేదు. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కానీ కాలేజీ ఒక్కసారి చేజారిపోయాక మళ్లీ తిరిగిరాదు.
అంటూ రంగ, వసుధారకు మోటివేషన్ చేస్తాడు. అయితే మీరు రండని మీరు లేకుండా నేను వెళ్లలేనని వసుధార ఏడవడంతో నేను మీ రిషి సార్ కాదు కాబట్టి నేను రాలేనని చెప్పి వెళ్లిపోతాడు రంగ. తర్వాత వసుధార తన రింగ్ పోయిందని వెతుకుతుంది. రాధమ్మ వచ్చి ఏంటి వెతుకుతున్నావు అంటుంది. రింగు పోయిందని చెప్పి రంగ ఎక్కడ అని అడుగుతుంది. రాత్రి ఏదో పనుందని చెప్పి వెళ్లాడని చెప్తుంది. దీంతో వసుధార కంగారు పడుతుంది. ఇంతలో రాధమ్మ లోపలికి వెళ్లి బాక్సు తీసుకొచ్చి ఇది రంగ నీకు ఇవ్వమని చెప్పాడని గిఫ్ట్ బాక్సు ఇస్తుంది. మరోవైపు రంగ, శైలేంద్ర దగ్గరకు వెళ్లి మీ డీల్‌కు ఒప్పుకుంటున్నానని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.