అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 17th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మహేంద్రను అనుకరించిన మను – సరోజకు వార్నింగ్ ఇచ్చిన వసుధార

Guppedanta Manasu Today Episode: మహేంద్రే తన తండ్రి అని నిజం తెలుసుకున్న మను అచ్చం మహేంద్రలా ప్రవర్తిస్తుంటే అనుపమ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  మహేంద్రే తన తండ్రి అని తెలిసి కూడా ఇన్నాళ్లు తనకు వసుధార ఎందుకు చెప్పలేదని బాధపడతాడు మను. మహేంద్ర తనపై చూపించిన ప్రేమ నిజాన్ని దాచిపెట్టడానికే అయ్యుండొచ్చు అనుకుంటాడు. చివరికి నా కన్నతల్లే నన్ను మోసం చేసిందని ఎమోషనల్‌ గా ఫీలవుతాడు మను. తాను కూడా నిజం తెలియనట్టే ఉండాలని.. వారితోనే నిజం బయటపెట్టించాలని నిర్ణయించుకుంటాడు మను. మరోవైపు రిషి, వసుధార ఇంటికి వెళ్తుంటారు.

వసుధార: పతనమవుతున్న కాలేజీని నిలబెట్టడానికే మి‌మ్మిల్ని హ‌ఠాత్తుగా ఎండీగా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది సర్‌.

రిషి: ఈ విష‌యం ఇంత‌టితో వ‌దిలేయ్‌ వసుధార.

 అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగానే కారుకు అడ్డుగా సరోజ వస్తుంది. సరోజను చూసిన రిషి వెంటనే కారు దిగి దగ్గరకు వెళ్లగానే మనం మన ఊరు వెళ్దాం పద బావ అంటూ చేయి పట్టుకుని లాక్కోళ్లడానికి ప్రయత్నిస్తుంది సరోజ.

రిషి: నేను రాలేను సరోజ. నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

సరోజ: ఈ దిక్కుమాలిన ఊళ్లో నీకు ఏం ప‌నులు ఉన్నాయి.

రిషి: అన్ని త‌ర్వాత చెబుతాను కానీ.. ఇక్కడికి నిన్ను ఎవ‌రు ర‌మ్మ‌న్నారు.

సరోజ: నీకోసమే  హైద‌రాబాద్ వ‌చ్చాను బావ.

ధనరాజ్‌: ఇంతకు ముందు నా కోసం వచ్చానన్నావు.

సరోజ: అమ్మమ్మ నిన్ను చూడాల‌ని క‌ల‌వ‌రిస్తుంది. ఆమెను చూడాల‌ని నీకు లేదా బావ. అమ్మమ్మ కంటే నీకు వ‌సుధార‌తో తిర‌గ‌డం ఎక్కువైందా?

 అంటూ వసుధారను తిడుతుంది సరోజ. రిషిని రమ్మని అడిగితే మీ నాన్నే డబ్బుల కోసం నన్ను ఇక్కడికి పంపించాడని ఏదైనా ఉంటే ఆయన్నే అడుగు అంటూ సరోజకు చెప్తాడు రిషి. మరోవైపు మను, అనుపమ దగ్గరకు వచ్చి తనకు రసగుల్ల తినాలని ఉందని.. అలాగే డిన్నర్‌లోకి ఆటూ కర్రీ అప్పడాలు చేయమని అడుగుతాడు. అయితే సేమ్‌ మహేంద్ర లాగే అడుగుతున్నాడేంటి అని అనుపమ అనుమానపడుతుంది.

మను: మ‌హేంద్ర‌ సార్‌ కు కూడా ఇవే స్వీట్‌, క‌ర్రీస్ ఇష్టం క‌దా అమ్మా. మా ఇష్టాలు, అభిరుచులు కూడా భ‌లే క‌లిశాయి.

 అంటూ గుడ్‌ న్యూస్‌ తెలిసినప్పుడు స్వీట్స్‌ తినాలని అనుపమకు రసగుల్లా తినిపిస్తాడు మను. మ‌రోవైపు మ‌హేంద్ర‌ కు పొల‌మారుతుంది. మిమ్మ‌ల్ని ఎవ‌రో త‌లుచుకుంటున్నార‌ని వ‌సుధార అంటుంది. మ‌రోవైపు మ‌హేంద్ర కూడా త‌న‌కు ఇష్ట‌మైన ర‌స‌గుల్లా తింటుంటాడు.

మహేంద్ర: రిషి తిరిగి రావ‌డం ఆనందంగా ఉంద‌మ్మా.. అందుకే స్వీట్ తినాల‌ని అనిపించింది.

వసుధార: మిమ్మ‌ల్ని సంతోష‌పెట్టే నిజం కావ‌చ్చు..మీ గ‌తాన్ని ప‌రిచ‌యం చేసే బంధం ఏదైనా కావొచ్చు మామయ్య.

 అంటూ మను గురించి ఇన్‌డైరెక్టుగా మాట్లాడుతుంది వసుధార. మరోవైపు

ఎండీ సీట్ చేజారిపోవ‌డంతో శైలేంద్ర బాధపడుతుంటాడు. ఇంతలో దేవయాని వచ్చి శైలేంద్రను తిడుతుంది.

దేవయాని: ఎన్నో ఎళ్ల క‌ల ఒక్క రోజులో  చెడ‌గొట్టావు..నా క‌డుపున చెడ‌బుట్టావు. ఒక్క ప‌ని స‌రిగ్గా చేయ‌డం చేయ‌డం చేత కాదు. నిన్ను న‌మ్ముకున్నందుకు న‌న్ను నేను కొట్టుకోవాలి

   అప్పుడే ధ‌ర‌ణి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడ‌గానే క‌న్నీళ్లు పెట్టుకుంటాడు శైలేంద్ర.

శైలేంద్ర:  నా బ‌తుకుకు అర్థం లేదు. నా క‌ల‌, ల‌క్ష్యం అన్ని పోయాయి. ఎండీ సీట్ నా చేజారిపోయింది ధరణి. మళ్లీ ఎండీగా రిషి బాధ్యతలు తీసుకున్నాడు.

అంటూ శైలేంద్ర చెప్పగానే ధరణి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆమె సంతోషం చూసి శైలేంద్ర మరింత బాధపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 21: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కాచీ జుట్టు కాల్చేసి పార్టీ ఆపడానికి ఆదిలక్ష్మీ ప్రయత్నం వృథా...దివ్యాంకకు గట్టిగా బుద్ది చెప్పిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్ బ్యాగ్‌లో సహస్ర గాజులు! బంటీ దొంగతనం బయట పెట్టిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్ బ్యాగ్‌లో సహస్ర గాజులు! బంటీ దొంగతనం బయట పెట్టిన సిరి!
Nindu Manasulu Serial Today October 21st: నిండు మనసులు: సిద్ధూకి సేవలు చేయడానికి అసహ్యించుకున్న ప్రేరణ! గణ కనిపెట్టేసిన నిజం!
నిండు మనసులు: సిద్ధూకి సేవలు చేయడానికి అసహ్యించుకున్న ప్రేరణ! గణ కనిపెట్టేసిన నిజం!
Godavari Serial Today October 21st: 'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!
'గోదావరి' సీరియల్: జాను రిసెప్షన్‌లో సూర్య! ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయిన జాను!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget