అన్వేషించండి

Guppedanta Manasu December 29th Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషి ఉన్న ఇంటిని కనిపెట్టిన రౌడీలు - వసుధారను కిడ్నాప్ చేసిన భద్ర

Guppedanta Manasu Serial Today Episode: వసుధారను చంపేయడానికి కిరాయి రౌడీలు కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ జరిగింది.

Guppedanta Manasu Telugu Serial Today Episode:  వసుధార ఆఫీసులో కూర్చుని  ఆలోచిస్తూ  ఉంటుంది. ఇంతలో అక్కడకు ఫణీంద్ర వచ్చి తన తమ్ముడు మహేంద్ర, అతని కొడుకు రిషి మీద తనకు ఎంత నమ్మకం ఉందో అంతే నమ్మకం నీమీద కూడా ఉందని చెప్తాడు.

ఫణీంద్ర: మీ మాట కానీ మీ పని కానీ అంత కచ్చితంగా ఉంటాయి. తొందర పడి ఓ మాట అనరు తొందర పడి ఓ పని చేయరు. మీరు ఏదైనా మాట అన్నా.. ఏదైనా చేశారు అన్నా దానికొక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో చెప్పమనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. శైలేంద్రను ఎందుకు అనుమానిస్తున్నారో చెప్పమని అడుగుతున్నాను. కానీ మీరేమి చెప్పడం లేదు. మొన్న ఇంటికి వచ్చి మహేంద్రను కూడా అడిగాను. మహేంద్ర కూడా సైలెంట్‌గా ఉన్నాడు. మహేంద్రం ఎమీ చెప్పడం లేదు. ఒకవేళ శైలేంద్ర తప్పు ఉందని తెలిస్తే శైలేంద్రను నేనే వదిలిపెట్టను.

అంటూ వాడు మీకు ఏ విషయంలోనూ అడ్డురాడు. అందుకు నేను హామీ ఇస్తున్నాను. నువ్వు కంగారుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు ఫణీంద్ర. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ మ‌హేంద్ర బాధ‌లో మునిగిపోతాడు. మార్చురీలో క‌నిపించిన డెడ్‌బాడీ రిషిదేన‌ని చాలా భ‌య‌ప‌డిపోయాన‌ని, ఆ క్ష‌ణంలో నా గుండె ఆగిపోయినంత ప‌నైంద‌ని అనుప‌మ‌తో చెబుతాడు మ‌హేంద్ర‌. రిషి ఖ‌చ్చితంగా వ‌స్తాడ‌ని, ఆ విష‌యంలో ఎలాంటి దిగులు పెట్టుకోవ‌ద్ద‌ని మ‌హేంద్ర‌ను ఓదార్చుతుంది అనుప‌మ‌. అప్పుడే వారి ద‌గ్గ‌ర‌కు వ‌సుధార‌ వ‌స్తుంది. ఫ‌ణీంద్ర ఇచ్చిన లెట‌ర్‌ను మ‌హేంద్ర‌కు చూపిస్తుంది.

మహేంద్ర: శైలేంద్ర ఎండీ సీట్ కోసం ఆశ‌ప‌డుతున్న సంగ‌తి అన్న‌య్య ఫ‌ణీంద్ర‌కు ఎలా తెలిసింది?

వసుధార: నా వల్లే  శైలేంద్ర నిజ‌స్వ‌రూపం ఫ‌ణీంద్ర‌ సార్‌కు  తెలిసింది.  

మహేంద్ర: అమ్మా వసుధార అసలేమైందో చెప్పమ్మా..

వసుధార: నిన్న రాత్రి నాకు కొత్త నెంబర్‌ నుంచి ఒక మెసెజ్‌ వచ్చింది. అందులో నీకు ఎండీ సీటు కావాలా? రిషి కావాలా? అని ఉండటంతో ఆ మెసెజ్‌ శైలేంద్రనే చేసి ఉంటాడనుకుని.. శైలేంద్రకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ అనుకోకుండా ఆ ఫోన్‌ ఫణీంద్ర సార్‌ లిఫ్ట్‌ చేసి నా మాటలన్నీ విన్నారు. అందుకే శైలేంద్రకు ఎండీ సీటు మీద ఆశ లేదని లెటర్‌ తీసుకొచ్చారు

అని వసుధార చెప్పగానే శైలేంద్ర‌కు వ్య‌తిరేక‌తంగా మ‌న ద‌గ్గర సాక్ష్యం ఉన్నా ఇంకా బెదిరింపుల‌కు దిగుతున్నాడంటే వాడు మ‌ళ్లీ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్న‌ట్లుగా ఉంద‌ని మ‌హేంద్ర భ‌య‌ప‌డ‌తాడు. రిషిని కాపాడుకోవ‌డ‌మే మ‌న‌కు ముఖ్య‌మంటూ చెబుతాడు. త‌న న‌ట‌న‌తో తండ్రిని కూడా న‌మ్మించే మూర్ఖుడు శైలేంద్ర అని.. ఫ‌ణీంద్ర‌లో ఎంత నిజాయితీ ఉన్నా కొడుకు అనే మమ‌కారం శైలేంద్రను కాపాడ‌గ‌ల‌డ‌ని అనుమాన‌ప‌డ‌తాడు. శైలేంద్ర వేసే ప్ర‌తి అడుగును జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిద్దాం... ఏదో ఒక చోట త‌ప్పు చేసి దొరికిపోతాడు. దాని ఆధారంగానే రిషి ఎక్క‌డున్నాడో క‌నిపెడ‌దామ‌ని మ‌హేంద్ర‌, వ‌సుధార‌ల‌తో అంటుంది అనుప‌మ‌. రిషి వ‌స్తేనే శైలేంద్ర‌కు త‌గిన బుద్ది చెబుతాడ‌నుకుంటాడు మ‌హేంద్ర. గాయాల నుంచి కోలుకున్న రిషి క‌ళ్లు తెరుస్తాడు.

వృద్దుడు: ఒళ్లంతా దెబ్బ‌ల‌తో చెట్ల పొద‌ల్లో ప‌డి ఉన్న నిన్ను మేమే మా ఇంటికి తీసుకొచ్చాము.  మాకు తెలిసిన ప‌స‌రు వైద్యం చేశాము. అస‌లు నువ్వు ఎవ‌రు? నిన్ను కొట్టింది ఎవ‌రు? వ‌సుధార అనే పేరు ప‌దే ప‌దే క‌ల‌వ‌రిస్తున్నావు... అస‌లు ఆ పోరి ఎవ‌రు?  

అని రిషిని అడుగుతారు వృద్దులు. రిషి ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు. వసుధారను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వృద్ద దంపతులతో..

రిషి:  మిమ్మ‌ల్ని నా ద‌గ్గ‌ర‌కు ఆ దేవుడే పంపించాడు. మీరే నాకు పున‌ర్జ‌న్మ‌ను ఇచ్చారు. నాకు ప్రాణం పోశారు.  

అంటూ రిషి వారికి చేతులు జోడించి దండం పెడ‌తాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

రిషి:  వ‌సుధార నువ్వు నా కోసం ఎంతగా ఎదురుచూస్తుంటావో నాకు  తెలుసు. మ‌ళ్లీ మ‌నిద్ద‌రం క‌ల‌వ‌డం కోస‌మే అమ్మ జ‌గ‌తి వీళ్లిద్ద‌ర‌ని నా ద‌గ్గ‌ర‌కు పంపింది.

 అని మనసులో అనుకుంటాడు రిషి.  మరోవైపు  ఇద్ద‌రు రౌడీలు రిషి కోసం వెతుక్కుంటూ వృద్దుల ఇంటివైపు వ‌స్తారు. ఆ రౌడీల‌ను ప‌ట్టుకొని త‌న కోసం ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవాల‌ని రిషి అనుకుంటాడు.కానీ ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోలేద‌ని, వారితో పోరాడే శ‌క్తి లేద‌ని రిషితో అంటారు ఆ వృద్దుడు.  రౌడీల‌కు క‌నిపించ‌కుండా రిషిని ఇంట్లోనే దాచిపెడ‌తాడు ఆ వృద్ద దంపతులు. ఇంట్లోకి వచ్చిన రౌడీలు వృద్దులు ఎంత చెప్పినా వినకుండా ఇల్లు మొత్తం వెతుకుతారు. ఇంతలో ఒక రౌడీ రిషి దాక్కున్న రూంలోకి వెళ్లబోతుంటే ఫోన్‌ వస్తుంది. దీంతో రూమ్ చూడ‌కుండా వెళ్లిపోవ‌డంతో రిషి రిలీఫ్‌గా ఫీల‌వుతాడు. మరోవైపు వ‌సుధార‌ను చంపేందుకు భ‌ద్ర స్కెచ్ వేస్తాడు. అర్ధ‌రాత్రి అంద‌రూ గాఢ‌నిద్ర‌లో ఉండ‌గా వ‌సుధార‌ను చంపాల‌ని ఫిక్స్ అవుతాడు. వ‌సుధార రూమ్‌లోకి వ‌స్తాడు. ఖ‌ర్చీఫ్‌పై మ‌త్తు మందు స్ప్రే చేసి వ‌సుధార‌ను కిడ్నాప్ చేస్తాడు. వ‌సుధార ను తీసుకొని వృద్ధ దంప‌తుల ఇంటికి వ‌స్తారు రౌడీలు. రిషి నువ్వు లోప‌ల దాక్కున్నావ‌ని మాకు తెలుసు. మ‌ర్యాద‌గా మాకు లొంగిపో లేదంటే వ‌సుధార ప్రాణం తీస్తామ‌ని బెదిరిస్తారు. వ‌సుధార మెడ‌పై క‌త్తి పెడ‌తారు. వ‌సుధార ప్రాణం కాపాడ‌టానికైనా తాను బయటకు వెళ్తానని రిషి అనడంతో వృద్దులు వద్దని వారిస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget