Guppedanta Manasu October 9th: ఎండీ సీటు దక్కకుండా శైలేంద్రకి ఝలక్ ఇచ్చిన వసు - జగతి జ్ఞాపకాల్లో మహేంద్ర
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...
మహేంద్ర మీటింగ్ నుంచి బయటకి వచ్చేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. జగతితో కలిసి గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనల్ అవుతాడు.
ఫణీంద్ర: మహేంద్ర పరిస్థితి అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఏం చేద్దాం
బోర్డు మెంబర్స్: ఎవరో ఎందుకు ఆ ఎండీ సీట్లో మీరే కూర్చోండి
ఫణీంద్ర: నేనా
శైలేంద్ర: కాలేజ్ స్థాపకులు మన కుటుంబమే కాబట్టి మన కుటుంబం నుంచి ఎవరో ఒకరు కూర్చుంటే బాగుంటుంది. మీరు ఇంటి పెద్ద కదా మీరు కూర్చుంటే ఇంకా బాగుంటుంది. మీకు నేను సహాయం చేస్తాను
ఫణీంద్ర: అది కేవలం సీటు కాదు ఒక బాధ్యత దాన్ని తీసుకోవడానికి అర్హత ఉండాలి. పదవి బయటి వాడికి బంగారు కిరీటంలాగా కనిపిస్తుంది కానీ అది ముళ్ల కిరీటం. అంత ఒత్తిడి నేను తీసుకోలేను. నాకు ఎండీ పదవి మీద ఆసక్తి లేదు.
Also Read: కావ్యకి సపోర్ట్‌గా మాట్లాడిన అపర్ణ- రాజ్‌ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?
శైలేంద్ర: రిషి ఏమో కాలేజ్‌లో అడుగు పెట్టను అంటున్నాడు. బాబాయ్ దీన స్థితిలోకి వెళ్లిపోయాడు. మీరు చూస్తే బాధ్యత తీసుకోలేను అంటున్నారు. ఎండీ సీటులో కూర్చోవడానికి మన ఫ్యామిలీలో ఇంక ఎవరున్నారు డాడ్.
దేవయాని: ఎవరో ఏంటి నువ్వు ఉన్నావ్ కదా
శైలేంద్ర: నేను ఎండీ ఏంటి?
దేవయాని: ఫారిన్లో చదువుకున్నావ్ ఇప్పుడు ఎవరో కూర్చోవడం ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడంలో తప్పేముంది.
శైలేంద్ర: నాకు ఎండీ సీటులో కూర్చోవాలని లేదు కానీ కాలేజ్ భవిష్యత్ కోసం అందరూ ఒకే అంటే నేను కూర్చుంటాను.
వసు: మీరు ఆ బాధ్యతలు తీసుకుంటారా? తనకి ఎక్స్ పీరియన్స్ లేదు కదా. అయినా పరవాలేదు కానీ ఆ బాధ్యత తీసుకోవడానికి శైలేంద్ర బాగా ఉత్సాహపడుతున్నారు. మీ అందరికీ ఒకేనా. శైలేంద్ర ఇంతకముందు ఎక్కడ పని చేసినా దాఖలాలు లేవు. అతని సమర్థత మనకి తెలియదు. ఎంత వరకు కాలేజ్‌ని ముందు తీసుకెళ్తారో కూడ తెలియదు. సర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరేమంటారు.
బోర్డు మెంబర్: ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన ఎక్స్ పీరియన్స్ లేకుండా ఎండీ సీటులో కూర్చోబెట్టలేము కదా.
దేవయాని: పని చేయడానికి అనుభవంతో పని ఏముంది?
వసు: శైలేంద్ర కాలేజ్‌కి వచ్చిన దగ్గర నుంచి చాలా సమస్యలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా కోటి రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసి పెద్ద సమస్య తీసుకొచ్చారు.
బోర్డు మెంబర్: అవును కోటి రూపాయల కోసం కాలేజ్ చేజారిపోయే పరిస్థితి వచ్చింది. రిషి సర్ రాబట్టి సరిపోయింది. ఆ సీటులో శైలేంద్ర కూర్చోవడానికి మేము ఒప్పుకోము.
వసు: పనికిరాని వాళ్ల చేతుల్లోకి కాలేజ్ వెళ్లకుండా చూడాలని నా అభిప్రాయం. ఎండీ సీటులోకి వచ్చే వాళ్ల గురించి ఒకటికి పది సార్లు ఆలోచించాలి.
ఫణీంద్ర: శైలేంద్ర అన్నాడు కానీ ఆ ఎండీ సీటులో కూర్చునే అర్హత తనకి లేదు. తను ఇంకా నేర్చుకునే స్థాయిలో ఉన్నాడు ఆ విషయం మొన్న చెక్కు విషయంలో అర్థం అయ్యింది. మనం ఈ విషయం గురించి మినిస్టర్‌తో మాట్లాడదాం.
Also Read: రిషికి ప్రామిస్ చేసిన వసు - జగతి తర్వాత కాలేజీలో ఎండీ సీట్లో కూర్చునేదెవరు!
వసు పోలీస్ ఇన్స్పెక్టరతో రిషి సర్ చెక్ ఇష్యూ చేయలేదని చెప్తుంది. అదేంటి అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నారు మీతో ఎవరైనా బలవంతంగా చెప్పిస్తున్నారా? అని ఎస్సై ఫణీంద్ర ముందే అడుగుతాడు.
వసు: ఇప్పుడు కాదు సర్ అప్పుడు ఒకరు బతిమలాడటం వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మేడమ్ అలా చెప్పమన్నారు అందుకే చెప్పాల్సి వచ్చింది. కావాలంటే అది సీసీటీవీ ఫుటేజ్ చూడవచ్చు.
ఎస్సై: తన కొడుకు మీద తనే ఎందుకు నింద వేయమని చెప్పింది.
వసు: సర్ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి నాతో అలా చెప్పించారు.
ఎస్సై: అసలు ఆవిడ ఏం చెప్పారో క్లియర్‌గా చెప్పండి.
వసు: రిషి ప్రాణాలతో ఉండటం కంటే బయట బతికి ఉండటం ముఖ్యం కదా అని జగతి అడిగింది గుర్తు చేశారు. జగతి మేడమ్ గురుదక్షిణగా అడిగారు. మొదట ఒప్పుకోలేదు కానీ రిషి ప్రాణాలు కాపాడటం కోసం మేడమ్ చెప్పినట్టు చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదు.
ఎస్సై: ఎవరో జగతిని భయపెట్టడం వల్ల ఈ పని చేశారు. చెక్ ఫ్రాడ్ జరిగిందని సారధి కదా బయట పెట్టింది. మీతో చెప్పకుండా మంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లాడనే విధంగా ఆలోచిస్తాను. ఎంక్వైరీ మొదలుపెడతాను.
వసు ఇంటికి రాగానే రిషి భోజనం చేయలేదని ధరణి చెప్తుంది. చిన్నత్తయ్య పోయిన దగ్గర నుంచి ఆవిడ జ్ఞాపకాల్లో నుంచి బయటకి రాలేకపోతున్నారని అంటుంది. రిషి గదిలో ఒంటరిగా కూర్చుని జగతి గురించి ఆలోచిస్తూ ఉండగా వసు వస్తుంది. భోజనం తినిపించడం కోసం ట్రై చేస్తుంది కానీ తినడానికి అంగీకరించడు.
వసు: మేడమ్ చావుకి కారణమయ్యిన హంతకుడిని పట్టుకోవాలి అంటే ముందు మీరు దిగులు నుంచి బయటకి రాక తప్పదు.
రిషి: డాడ్ ఏం తిని ఉండరు ఆయన కోసం వెయిట్ చేద్దాం.
వసు: అదేంటి మహేంద్ర సర్ ఇంట్లో లేరా?
రిషి: మీతో కాలేజ్‌కి వచ్చారు కదా.
వసు: మీటింగ్ నుంచి మధ్యలోనే బయటకి వచ్చేశారు
రిషి వెంటనే మహేంద్రకి ఫోన్ చేస్తాడు కానీ కలవదు. దీంతో రిషి వాళ్లు మహేంద్ర కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు. తండ్రి కనిపించకపోయే సరికి రిషి కంగారుపడతాడు. మహేంద్ర తాగి రోడ్డు పక్కన జగతి.. జగతి.. అంటూ కలవరిస్తూ ఉంటాడు. రిషి ఎన్ని సార్లు చేసిన లిఫ్ట్ చేయడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గర పడి ఉన్నారని చెప్తాడు. వెంటనే అడ్రస్ తెలుసుకుని రిషి వాళ్లు బయల్దేరతారు.